Nani: ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్-director vivek athreya comments on nani sj suryah in saripodhaa sanivaaram pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani: ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్

Nani: ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 26, 2024 06:28 AM IST

Saripodhaa Sanivaaram Director Vivek Athreya On SJ Suryah: నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎస్‌జే సూర్య గురించి, సినిమా గురించి పలు విశేషాలు చెప్పారు.

ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్
ఆయనకు సీన్ చెప్పాలంటే భయమేస్తుంది.. నాని సరిపోదా శనివారం డైరెక్టర్ కామెంట్స్

Nani Saripodhaa Sanivaaram SJ Suryah: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

yearly horoscope entry point

అనూహ్య స్పందన

ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్స్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా పలు ప్రాంతాల్లో చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్‌కు అనూహ్య స్పందన వచ్చింది.

ఈనెల 29న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో భాగంగా శనివారం (ఆగస్ట్ 24) రాత్రి 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సరిమప.. ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదలైంది. అలాగే ఈ వేడుకలో డైరెక్టర్స్ దేవకట్టా, శ్రీకాంత్, సుధాకర్ చెరుకూరి, శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మతోపాటు ఎస్‌జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, కెమెరామెన్ మురళీ, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ తదితరులు పాల్గొన్నారు.

కన్‌ఫ్యూజ్‌గా ఉన్నా

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. "మా కుటుంబం అంతా ఈ వేడుకకు వచ్చి ఆశీస్సులు అందించారు. శ్రీకాంత్, ప్రశాంత్, శౌర్యువ్ తదితరులు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమా 29న విడుదలకావడానికి కారణం దర్శకుల టీమ్ కూడా ఓ కారణం. అంటే సుందరానికి రిలీజ్ రోజున కన్‌ఫ్యూజ్‌గా ఉన్నా. ఎదుకంటే కొందరు బాగుందని, మరికొందరు బాగోలేదని టాక్ వచ్చింది" అని అన్నారు.

"దాంతో ఏ తరహా సినిమా చేయాలో అర్థం కాలేదు. నాని నాకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. అందుకే థ్యాంక్స్ చెబితే సరిపోదు అనుకుని ఆయనకు నాపై ఉన్న నమ్మకానికి సరిపోదా శనివారం సినిమా ఇచ్చా. అలాగే ఇతర నటీనటులు కూడా బాగా కుదిరారు. అందరూ రైటింగ్ బాగుందని అంటున్నారు. అది వీరి పెర్ ఫార్మెన్స్‌తో ముందుకు సాగాను. ఎస్‌జే సూర్యకి ఏదైనా సీన్ చెప్పాలంటే భయమేస్తుంది. అయినా నేను చెప్పింది విని అంగీకరించారు" అని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెలిపారు.

పెద్ద స్థాయికి చేరుకోవాలి

"సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్ అవుతుంది. నాని గారు కథల ఎంపికలో బెస్ట్. కథ నచ్చితే కొత్త దర్శకుడయినా అవకాశం ఇస్తారు. నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ ఉండదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు నాని. అదేవిధంగా ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు. నాని ఇంకా పెద్ద స్థాయికి చేరుకోవాలి" అని నిర్మాత డీవీవీ దానయ్య అన్నారు.

"ఇక ఎస్‌జే సూర్య నటనలో ఇరగదీశారనే చెప్పాలి. నా తర్వాత సినిమాలో కూడా ఆయనే చేయాలని కోరుకుంటున్నా. ప్రియాంక అద్భుతంగా నటించారు. అభిరామిగారు ఈ సినిమాలో తల్లిగా చేశారు. దర్శకుడు ఏడాదిపాటు కథ రాశారు. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు" అని డీవీవీ దానయ్య తెలిపారు.

ఆ కోవలో చేరుతారు

"వివేక్ సినిమా అంటే.. అంటే సుందరానికి లాంటిది తీస్తాడేమోనని అనుకున్నాను. కానీ, మంచి సినిమా తీశాడు. పెద్ద దర్శకుడు కోవలో చేరతారు. సంగీతం దర్శకుడు జేక్స్ బిజోయ్ రీరికార్డింగ్ బాగా చేశాడు. ఈ సినిమా విడుదలయ్యాక సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం" అని సరిపోదా శనివారం మూవీ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య చెప్పుకొచ్చారు.

Whats_app_banner