DVV Danayya | ‘అధీర'గా డీవీవీ దానయ్య కుమారుడు.. ఆకట్టుకున్న ఫస్ట్ స్ట్రైక్
ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం అధీర. తాజాగా ఈ సినిమా ఫస్ట్ స్ట్రైక్‌ను రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఆవిష్కరించారు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ హీరోగా త్వరలో అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. విభిన్న చిత్రాల దర్శకుడు ప్రశాంత వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను అధీర అని ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్‌ను ఆర్ఆర్ఆర్ చిత్రబృందం విడుదల చేసింది. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్లింప్స్‌ను ఆవిష్కరించారు.
హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్టులను ఇందులో చూపించారు. అధీర ఫస్ట్ స్ట్రైక్ పేరుతో విడుదలైన ఈ వీడియో ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను గమనిస్తే సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కల్యాణ్ టైటిల్ రోల్‌ను పోషించనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గౌరీ హరి సంగీతాన్ని అందిస్తుండగా.. దాశరధి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ ఇంతకు ముందు అ!, కల్కి, జాంబీ రెండి లాంటి వైవిధ్యమైన చిత్రాలను దర్శకత్వం వహించాడు. తన సినిమాలు ఇతర చిత్రాలకు భిన్నంగా ఉండేలా చూసుకుంటారు. ప్రస్తుతం తేజ సజ్జతో హనుమాన్ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఇది కూడా సూపర్ హీరో సినిమా కావడం గమనార్హం. తాజాగా కల్యాణ్ హీరోగా తెరకెక్కనున్న అధీర కూడా సూపర్ హీరో యాక్షన్ ఎంటర్టైనరే కానుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్‌ల్లో బిజీగా ఉన్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఈ సినిమా గ్లింప్స్ కోసం టైమ్ కేటాయించడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత కథనం
టాపిక్