Hero Nani: RRR తర్వాత ఏ సినిమా ఆనదు.. కానీ ఈ మూవీనే ఆనుతుంది.. హీరో నాని కామెంట్స్
Nani About RRR In Saripodhaa Sanivaaram Press Meet: ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత ఏ సినిమా ఆనదు. కానీ, మా సినిమా మాత్రం ఆనుతుందని నేచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సరిపోదా శనివారం మూవీ ప్రెస్ మీట్‌లో హీరో నాని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Nani Comments In Saripodhaa Sanivaaram Press Meet: నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు.
హ్యూజ్ బజ్
సరిపోదా శనివారం చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
చితకొట్టేస్తున్నాడు
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మనం మధ్యలో ఒక ప్రామిస్, ఒక బాండ్ ఉంది. ఈ బాండ్‌ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా 'సరిపోదా శనివారం' అవుతుంది. ఈసారి సినిమా హాళ్లు కాన్సర్ట్‌లా ఉంటున్నాయి. జేక్స్ బిజోయ్ చితకొట్టేస్తున్నాడు. ఎప్పుడెప్పుమీరు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. మీతో పాటు చూడటానికి ఎదురుచూస్తున్నాను" అని అన్నాడు.
మార్నింగ్ షోకి నేను వస్తాను
"సుదర్శన్ 35 ఎంఎంకి మార్నింగ్ 11 షోకి వస్తున్నాను. కలసి సెలబ్రేట్ చేసుకుందాం. వివేక్ ఆ రోజే వస్తాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయి ఉన్నాడు. దానయ్య గారు ఆర్ఆర్ఆర్ లాంటి సక్సెస్ చూసిన తర్వాత అంత తొందరగా ఏదీ ఆనదు. కానీ, ఇది ఆనుతుందనే నమ్మకం ఉంది (నవ్వుతూ). కళ్యాణ్‌కి థాంక్స్. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్" అని నాని చెప్పారు.
రెండు నెలలుగా నిద్రలేదు
"సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. వివేక్ రెండు నెలలుగా నిద్రపోయింది లేదు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. ఈసారి వాళ్లందరి కోసం ఈసారి సినిమా వేరే లెవల్‌కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రీరిలీజ్ ఈవెంట్ 24న జరగబోతోంది. టీం అందరితో కలసి ఆ రోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఆగస్ట్ 29న థియేటర్స్‌లో కలుద్దాం. నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందంటే బ్లాక్ బస్టర్ కన్‌ఫర్మ్ అవ్వాల్సిందే (నవ్వుతూ)" అని నాని తెలిపారు.
ఓజీతో మళ్లీ వస్తున్నాను
"అందరికీ నమస్కారం. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని గారికి జోడిగా ఈ సినిమాతో రావడం ఆనందంగా ఉంది. డీవీవీ ప్రొడక్షన్‌లో ఈ సినిమాతో పాటు ఓజీతో మళ్లీ వస్తున్నాను. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా అనందంగా ఉంది" అని సరిపోదా శనివారం మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ చెప్పుకొచ్చింది.
బ్యూటిఫుల్ కథ రాశారు
"సరిపోదా శనివారం సినిమాలో ఇందులో నా పాత్ర పేరు చారులత. చాలా బ్యూటీఫుల్ క్యారెక్టర్. తను చాలా సాఫ్ట్ కాప్. వివేక్ గారు చాలా బ్యూటీఫుల్ కథని రాశారు. సినిమాలో నైస్ లవ్ స్టొరీ కూడా ఉంది. ఆగస్ట్ 29న తప్పకుండా సినిమా చూడండి" అని హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తెలిపింది.