Saripodhaa Sanivaaram story: నాని సరిపోదా శనివారం కథ చెప్పేసిన మూవీ విలన్.. ఆ ఒక్క పాయింట్‌తోనే..
Saripodhaa Sanivaaram story: నాని నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ కథను మేకర్స్ ఇప్పటి వరకూ సీక్రెట్ గా ఉంచుతూ వచ్చారు. అయితే తొలిసారి మూవీలో అసలు పాయింట్ గురించి ఎస్‌జే సూర్య రివీల్ చేశాడు.
Saripodhaa Sanivaaram story: వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సరిపోదా శనివారం క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఎక్కువగా రోమ్ కామ్స్ కు దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు నాని నటించిన చిత్రంతో జోనర్ మార్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథపై చిత్రబృందం మౌనంగా ఉండగా, తాజాగా గ్రేట్ ఆంధ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్.జె.సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సరిపోదా శనివారం కథ ఇదే
సరిపోదా శనివారం మూవీలో ఎస్‌జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 9న రిలీజ్ కానుండగా.. తాజాగా అతడు ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో సూర్యను ఈ సినిమా గురించి అడిగినప్పుడు నాని పాత్రకు సంబంధించిన వివరాలను పంచుకున్నాడు. ఈ సినిమాలోని ఈ యూనిక్ పాయింట్ తనకు ఆసక్తి కలిగించడమే తాను దాన్ని రివీల్ చేయడానికి కారణమని తెలిపాడు. ఇప్పటి వరకూ వచ్చిన చాలా యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ఈ కథను రివీల్ చేయడం వల్ల ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని సూర్య కూడా నమ్ముతున్నాడు.
''నాని క్యారెక్టర్ కు చిన్నతనంలో కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అతని భవిష్యత్తు గురించి అతని తల్లి ఆందోళన చెందుతూ ఉంటుంది. తనలాంటి వ్యక్తిని ఆమె ఎలా కంట్రోల్ చేయగలదు? చిన్నప్పుడు తన కోపాన్ని అదుపులో ఉంచుకోమని ఆమె అడిగితే.. అతను దానిని మరింత చూపించాలనుకుంటాడు. వారంలో ప్రతి రోజు తన కోపాన్ని చూపించే బదులు ఒక్క రోజు మాత్రమే చూపించాలని ఆమె చెబుతుంది. దీంతో అతడు ఒక ప్రత్యేక కారణంతో శనివారాన్ని ఎంచుకుంటాడు" అంటూ సినిమాలోని మెయిన్ పాయింట్ ఏంటో సూర్య వెల్లడించాడు.
ఓ సాధారణ వ్యక్తిలో ఉన్న అసాధారణ లక్షణాన్ని సహజంగా చూపించే ఉద్దేశంతోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు సూర్య చెప్పాడు. కథను మరింత చెప్పేందుకు తనకు దర్శకుడు అనుమతి ఇవ్వలేదని ఈ సందర్భంగా సూర్య జోక్ చేశాడు.
సరిపోదా శనివారం మూవీ గురించి..
మెంటల్ మదిలో, అంతే సుందరానికి, క్రైమ్ కామెడీ బ్రోచేవారెవరురా తర్వాత వివేక్ దర్శకత్వం వహిస్తున్న నాలుగో చిత్రం ఇది. నాని, సూర్య, ప్రియాంక మోహన్ లీడ్ రోల్స్ పోషించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'సరిపోదా శనివారం'. ఆగస్టు 29న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అంటే సుందరానికి అంటూ గతంలో ఇదే వివేక్ ఆత్రేయతో నాని తన తొలి సినిమా చేయగా.. ఇప్పుడు రెండోసారి అతనితో చేతులు కలిపాడు.
అంటే సుందరానికి మూవీ నానికి నిరాశే మిగిల్చింది. అయితే గతేడాది దసరా, హాయ్ నాన్న సక్సెస్ తో ఊపు మీదున్న నాని.. ఈ సరిపోదా శనివారం మూవీతో హ్యాట్రిక్ సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు.