Ullaasam Song Lyrics: సరిపోదా శనివారం నుంచి ఆకట్టుకునేలా మెలోడీ సాంగ్.. ఉల్లాసం పాట లిరిక్స్ ఇవే.. చూస్తూ పాడేసుకోండి
Saripodhaa Sanivaaram Ullaasam Song Lyrics: సరిపోదా శనివారం చిత్రం నుంచి రెండో పాట వచ్చేసింది.మెలోడీ సాంగ్‍గా ఆకట్టుకునేలా ఈ సాంగ్ ఉంది. ఉల్లాసం అంటూ వచ్చిన ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు వివేక్ ఆత్రేయ. ‘అంటే సుందరానికి’ తర్వాత నాని - వివేక్ కాంబోలో వస్తున్న చిత్రం కావటంతో మరింత క్రేజ్ ఉంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సరిపోదా శనివారం చిత్రం నుంచి నేడు (జూలై 13) రెండో సాంగ్ రిలీజ్ అయింది. ఉల్లాసం అంటూ ఈ సాంగ్ వచ్చింది.
మెలోడియస్‍గా..
సరిపోదా శనివారం నుంచి వచ్చిన ఈ ఉల్లాసం పాట మెలోడియస్‍గా ఉంది. నాని, ప్రియాంక మోహన్ మధ్య డ్యుయెట్ సాంగ్‍గా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ ఈ పాటకు హృదయాన్ని హత్తుకునేలా మెలోడీ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను సంజిత్ హెగ్డే, కృష్ణలాస్య ముత్యాల ఆలపించారు. ఈ పాటకు సనరే లిరిక్స్ అందించారు.
ఉల్లాసం పాట లిరిక్స్
సరిపోదా శనివారంలోని ఈ ఉల్లాసం సాంగ్ డైలాగ్‍తో మొదలైంది. బాయ్‍ఫ్రెండ్ అని ప్రియాంకను నాని అడుగుతారు. “నేను చేసుకోబోయే వాడు వైలెన్స్ స్పెల్లింగ్ కూడా తెలియని వాడు అయి ఉండాలి. అలా ఎవరు ఉంటారు చెప్పు” అని ప్రియాంక అంటారు. “చారు (ప్రియాంక).. ఇప్పుడు వైలెన్స్ అనే వర్డ్‌లో ఒక ఎస్ ఉంటుందా.. రెండు ఎస్‍లు ఉంటాయా.. ఎస్ అయితే ఉంటుందిగా, నిజంగానే తెలియక అడుగుతున్నాను.. సింగిల్ ఎస్‍ఆ.. డబుల్ ఎస్‍ఆ” అని నాని అంటారు. ఆ తర్వాత సాంగ్ మొదలవుతుంది. లిరిక్స్ ఇక్కడ చూడండి.
అరే ఏమైంది ఉన్నట్టుండివ్వాళే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా… గుండెల్లో ఏదో వాలే… వాలే
వేషాలే మార్చే.. నాలో ఆవేశాలే
కోపాలే కూల్చే నీతో సల్లాపాలే
నీ… మైకంలో ప్రాణం తేలే… తేలే
ఏమిటో తెలియదెందుకో.. మనసు నిన్నలా నేడు లెేదే
కారణం తెలుసుకోవడానికది పిలిచినా పలకదే
ఉల్లాసం ఉరికే ఎదలో..
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో..
ఉప్పొంగే ఊహల జడిలో..
మనకే మనమే ఎవరో..
మౌనాలే మన ఊసులలో..
మాటలే తప్పిపోయే పెదవులలో..
మిన్నంటే మనసుల సడిలో.. మనతో మనమే ఎటుకో..
అరే ఏమైంది ఉన్నట్టుండివ్వాళే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా… గుండెల్లో ఏదో వాలే.. వాలే
కల్లోలం.. కమ్మేసే.. అంతా.. నీ వలనే
కళ్లారా.. నువ్వే.. నవ్వినా క్షణమునే
నా కనులకే కొత్త వెలుగులే చేరి.. కలతలే చెయ్యి విడిచెలే
కలకే వేల తళుకులే.. నువ్వు కనబడే దాక కలలే
ఇరువురి చేతులోని రేఖలన్నీ ముడిపడే.. రాత.. బలపడే
విడివిడిదారులే వీడిపోని జంటై కదిలే..
ఉల్లాసం ఉరికే ఎదలో..
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో..
ఉప్పొంగే ఊహల జడిలో.. మనకే.. మనమే ఎవరో.. (2)
మౌనాలే మన ఊసులలో..
మాటే తప్పిపోయే పెదవులలో..
మిన్నంటే మనసుల సడిలో.. మనతో మనమే ఎటుకో..
సరిపోదా శనివారం చిత్రం ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రేంజ్ మూవీగా విడుదలవుతుంది. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.