Heroine Crime: ఫ్రెండ్‌నే చంపిన హీరోయిన్.. శవం ముందు లవర్‌తో శృంగారం.. బాడీని 300 ముక్కలు చేసి!
Actress Maria Susairaj Killed Her Friend Neeraj Grover: సొంత ఫ్రెండ్‌నే చంపి, అతని శవం ముందు లవర్ లెప్టినెంట్ ఎమిల్ జెరొమ్ మాథ్యూతో కామకేళి (శృంగారం) జరిపింది కన్నడ హీరోయిన్ మరియా సుసైరాజ్. 26 ఏళ్ల టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ మర్డర్ వివరాల్లోకి వెళితే..
Heroine Murdered Her Friend: సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. కానీ, అందులో కూడా ఊహించని నేరాలు ఘోరాలు జరుగుతాయనేదానికి ఈ దారుణమైన ఘటనే ఉదాహరణ. 2008, మే నెలలో ముంబై నగరాన్ని కుదిపేసింది 26 ఏళ్ల టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ హత్య ఉదంతం.
ఈ హత్య చేసింది నీరజ్ స్నేహితురాలు, కన్నడ హీరోయిన్ మరియా సుసైరాజ్, ఆమె ప్రియుడు లెఫ్టినెంట్ ఎమిల్ జెరోమ్ మాథ్యూ అని తేలింది. దాంతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నీరజ్ గ్రోవర్ ఒక రోజు మరియా సుసైరాజ్‌కి షిఫ్టింగ్‌లో సహాయం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా తప్పిపోయాడు. ఆ తర్వాత అతన్ని ఎవరూ చూడలేదు.
షాకింగ్ నిజాలు
గంటలు, రోజులు, ఆపై వారాలు గడిచాయి. కానీ, నీరజ్ గురించి ఎటువంటి సమాచారం లేదు. చివరకు మొబైల్ నెట్‌వర్క్ టవర్ ద్వారా నీరజ్ లొకేషన్ గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ ఒక్క కాల్‌తో దారుణ హత్య కేసు బట్టబయలు అయింది. ఈ కేసులో మరియా సుసైరాజ్ మొదటగా అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన నిజాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి.
నీరజ్ గ్రోవర్‌ను హత్య చేయడమే కాకుండా అతని శవం ముందు హీరోయిన్ మరియా అతని లవర్ లెఫ్టినెంట్ అయిన ఎమిల్ జెరోమ్ మాథ్యూతో కామకేళి (శృంగారం) జరిపింది. ఆ తర్వాత కొన్ని గంటలకు నీరజ్ మృతదేహాన్ని 300 ముక్కలుగా నరికి పారేశారు. ఈ ఉదంతం ముంబై నగరాన్ని తీవ్ర భయాందోళనకు గురి చేసింది.
మరియా సుసైరాజ్ విషయానికొస్తే.. మైసూర్‌లోని క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన మరియా మోనికా సుసైరాజ్ చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, డ్యాన్స్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె తండ్రి ఒక నిర్మాణ సంస్థలో పనిచేయగా., ఆమె మామ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న సమయంలో మరియా నటి కావాలని కలలు కనింది.
కానీ, దానికి ఆమె కుటుంబం వ్యతిరేకించింది. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో మైసూర్‌లోని తన ఇంటిని వదిలి బెంగళూరులోకి వచ్చేసింది మరియా. అక్కడ కొన్ని చిన్న పాత్రలు చేసిన తర్వాత, 2002లో కన్నడ సినిమాతో పెద్ద బ్రేక్‌ని పొందింది. ఆమె 'జూట్' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అయితే, ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ మరియా నటనకు మాత్రం ప్రశంసలు అందుకుంది.
ఆడిషన్‌లో కలిసి
ఆ తర్వాత మరియా సుసైరాజ్‌కి మరికొన్ని చిత్రాలలో చిన్న పాత్రలు వచ్చాయి. అయితే మరియా ప్రాంతీయ సినిమాలోనే కాకుండా భారతదేశం అంతటా పేరు తెచ్చుకోవాలని కోరుకుంది. కన్నడ సినిమాల్లో పని తగ్గడంతో ముంబైకి మళ్లింది. ఆడిషన్స్ కోసం తరచుగా ముంబైకి వెళ్లేది. ఒకరోజు, ఆమె ముంబైలో మంచి సంబంధాలు ఉన్న నీరజ్ గ్రోవర్‌ను ఆడిషన్‌లో కలుసుకుంది.
2008లో, నిర్మాత ఏక్తా కపూర్ ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్‌తో నీరజ్ కలిసి పని చేస్తున్నాడు. ఆడిషన్‌లో అయిన వీరి పరిచయం స్నేహానికి దారి తీసింది. తరచుగా మాట్లాడుకోవడం, సినిమా ఆడిషన్స్‌కు మరియాను పంపించడం వంటివి చేశాడు నీరజ్. అయితే, ఆమె కన్నడ యాస వల్ల ఆమెకు పాత్రలు రెజెక్ట్ అయ్యేవి. కానీ, మరియా ఎక్కడ ఫీల్ అవుతుందో అని ఆ విషయం చెప్పకుండా సాకులు చెప్పేవాడు నీరజ్.
అదే సమయంలో నీరజ్ ఇంట్లోనే మరియా ఉండేది. పెద్ద హీరోయిన్ కలలు కన్న మరియా తన మాథ్యూతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి దాచిపెట్టింది. కొన్ని రోజులకు నీరజ్‌తో మరియా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. కానీ, మాథ్యూ దగ్గర నీరజ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేవలం తాను ఫ్రెండ్‌గా చూస్తున్నట్లు, అతను మాత్రం లవ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
కోపంతో ఊగిపోయిన లవర్
మే 7న మాథ్యూతో ఇంటిమేట్ అయిన సమయంలోనే నీరజ్‌కు కాల్ చేసి హౌజ్ షిప్టింగ్ ఉందని మరియా చెప్పింది. నీరజ్ గొంతు విన్న మాథ్యూ కోపంతో ఊగిపోయాడు. కానీ, కేవలం వస్తువుల సర్దుబాటు కోసమే వస్తున్నాడని, డిన్నర్ తర్వాత వెళ్తాడని మరియా మాథ్యూకు సర్దిచెప్పింది. మే 8న నీరజ్, మరియా ఇంట్లో ఉండగా.. మాథ్యూ వచ్చాడు.
అప్పుడు మరియా బెడ్‌పై నీరజ్ ఉన్నాడు. దాంతో ఆవేశంతో కిచెన్‌లో ఉన్న కత్తితో నీరజ్‌ను పలుమార్లు పొడిచాడు మాథ్యూ. అప్పుడు రక్తంతో మాథ్యూ షర్ట్ నిండిపోయింది. అనంతరం మరియా గదిని, రక్తంతో ఉన్న నీరజ్ మృతదేహాన్ని క్లీన్ చేసింది. నీరజ్ శవం ఉన్న గదిలోనే పలుసార్లు శృంగారంలో పాల్గొన్నారు మరియా, మాథ్యూ.
ఆ తర్వాత నీరజ్ మృతదేహాన్ని 300 ముక్కలుగా నరికి బయట డంప్ చేశారు. మరియా ఇంటికి వెళ్తానన్న నీరజ్ ఇంకా ఇంటికి రాకపోవడంపై అతని ఫ్రెండ్ లాల్‌కు వచ్చిన అనుమానం పోలీస్ కేసు పెట్టేలా చేసింది. ఆ తర్వాత విచారణలో మరియా సెక్యూరిటీ గార్డ్ చెప్పిన విషయంతో పోలీసులు నీరజ్ మర్డర్ అయినట్లుగా కన్ఫర్మ్ చేసుకున్నారు.
జైలు శిక్ష
ఓ బ్యాగ్‌లో మాథ్యూ వస్తువులు తీసుకువెళ్లడాన్ని చూసిన సెక్యూరిటీ గార్డ్ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో మరియా, అతని ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో జెరోమ్ మాథ్యూకు 10 ఏళ్లు, సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు మరియాకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే, మరియా సుసైరాజ్ నీరజ్ హత్యకు పాల్పడలేదు. కానీ, సాక్ష్యాలను నాశనం చేసినందుకు దోషిగా తేలింది.
టాపిక్