Bigg Boss Telugu7: హౌజ్‍లో శృంగారంపై టాపిక్.. బిగ్ బాస్ ఏం గౌరవం ఇచ్చాడన్న షకీల-bigg boss telugu 7 season september 4 episode and shakeela complaints on bigg boss ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu7: హౌజ్‍లో శృంగారంపై టాపిక్.. బిగ్ బాస్ ఏం గౌరవం ఇచ్చాడన్న షకీల

Bigg Boss Telugu7: హౌజ్‍లో శృంగారంపై టాపిక్.. బిగ్ బాస్ ఏం గౌరవం ఇచ్చాడన్న షకీల

Sanjiv Kumar HT Telugu

Bigg Boss 7 Telugu September 4 Episode: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ హౌజ్‍లో తొలి రోజు గొడవలు, పుల్లలు పెట్టడం, నామినేషన్స్ తోపాటు సరదాగా ముచ్చట్లు కూడా వినిపించాయి. ఈ క్రమంలో నటి షకీల, జబర్దస్త్ కమెడియన్ టేస్టీ తేజ మధ్య జరిగిన చర్చ ఆసక్తికరంగా సాగింది.

బిగ్ బాస్ ఏం గౌరవం ఇచ్చాడన్న షకీల

Shakeela Tasty Teja Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. అయితే, వారు పర్మనెంట్ ఇంటి సభ్యులు కాదని పెద్ద బాంబ్ పేల్చారు నాగార్జున. హౌజ్‍లో ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలను సంపాదించుకోవాలని చెప్పారు. ఓ టాస్క్ లో భాగంగా స్టోర్ రూమ్ నుంచి బెడ్స్స్, సోఫాలు వంటి తదితర ఫర్నిచర్ తెచ్చుకున్నారు కంటెస్టెంట్స్. కానీ, హౌజ్‍లో మాత్రం బెడ్స్ లేవు. దీంతో రాత్రంతా నిద్ర లేకుండా కొంతమంది ఇంటి సభ్యులు జాగారం చేశారు.

ఏం గౌరవం ఇచ్చాడు

 

లైట్స్ ఆర్పకపోవడం, పడుకోకుండా ఉండటం వంటివి క్రమశిక్షణలో భాగమేనేమో అని రతిక అనుమానం వ్యక్తం చేయడంతో పడుకున్న ఆట సందీప్, శివాజీ లేచి కూర్చున్నారు. మరోవైపు టేస్టీ తేజ, షకీల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. అయితే టేస్టీ తేజా చాలా సార్లు నిద్రపోతా బిగ్ బాస్ అంటూ అడిగాడట. దాన్ని గుర్తు చేస్తూ "బిగ్ బాస్ నీకు ఏం గౌరవం ఇచ్చాడు. నిద్ర వస్తుందని నువ్ అంతలా చెప్పావ్ కదా. బిగ్ బాస్ ఏం స్పందించలేదు. నువ్ ఎలా పడుకుంటావ్ " అని షకీల అంది. దాన్ని చాలా ఈజీగా తీసుకున్న తేజ "ఇక్కడ పడుకోవడమే. ఇంత పెద్ద ఇల్లు ఇచ్చారు. ఎక్కడైనా పడుకోవచ్చు. బిగ్ బాసే ఇచ్చాడు ఇల్లు ఒకటి ఓ షకీల" అని పాట పాడాడు.

చిన్న స్కర్ట్స్ వేసుకుని

 

తర్వాత షకీల, తేజ ఇద్దరు నేలపై కూర్చుని మాట్లాడుకున్నారు. "అవును, అసలు మీరు ఎందుకు అలాంటి సినిమాలు చేశారు. అంటే సినిమా ఆఫర్లు రాలేదా. మీరే చేశారా అని తేజ అడిగాడు. నాకు అప్పట్లో ఏయే అవకాశాలు వచ్చాయో అవే చేశాను. వాటినే ఒప్పుకున్నా. నాకన్నీ అడల్ట్ సినిమా ఆఫర్లే వచ్చాయి. అంతకుముందు చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకుని గ్లామర్ సినిమాలు చేశాను. అలా డ్యాన్సులు చేసినప్పుడు లేని తప్పు. అలాంటి సినిమాలు చేయడంలో తప్పేంటి అనిపించింది" అని షకీల సూటిగా సమాధానం ఇచ్చింది.

నేను పెద్ద ఫ్యాన్

 

"అలాంటి సినిమాలు ఎన్ని చేశారు" అని టేస్టీ తేజ అడిగాడు. "500కుపైగా సినిమాలు చేశాను" అని షకీల ఆన్సర్ ఇస్తే.. తేజ షాక్ అయ్యాడు. "మరి మీ ఇంట్లో ఏం అనలేదా" అని తేజ అడిగితే "ఏం అనలేదు. డబ్బులు బాగా వచ్చేవి. అవి ఇస్తున్నా కదా. అయినా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావేంటీ" అని షకీల అంది. దీంతో తేజ ప్రశ్నలు అడగటం మానేసాడు. అంతకుముందు గ్రాండ్ లాంచ్ రోజున కూడా "నేను మీకు ఫ్యాన్. చిన్నప్పుడు మీ సినిమాలు చూసేవాడిని" అని తేజ అంటే.. "చిన్నప్పుడు ఎవరైనా అలాంటి సినిమాలు చూస్తారా" అని తేజ చెంపపై సరదాగా కొట్టింది షకీల. ఇలా తొలి రోజున హౌజ్‍లో శృంగారం, అడల్ట్ కంటెంట్‍పై చర్చ చేసి మంచి ఫుటేజ్ ఇచ్చారు కంటెస్టెంట్స్.