Neeraj Chopra : నీరజ్ చోప్రా డైలీ డైట్ ఇదే.. శాఖాహారి నుంచి మాంసాహారిగా మారడానికి కారణమిదే-javelin throw champion neeraj chopra diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Neeraj Chopra : నీరజ్ చోప్రా డైలీ డైట్ ఇదే.. శాఖాహారి నుంచి మాంసాహారిగా మారడానికి కారణమిదే

Neeraj Chopra : నీరజ్ చోప్రా డైలీ డైట్ ఇదే.. శాఖాహారి నుంచి మాంసాహారిగా మారడానికి కారణమిదే

Galeti Rajendra HT Telugu
Aug 14, 2024 08:00 PM IST

Neeraj Chopra : ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి భారత్‌కి పతకాన్ని అందించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఎంత ఫిట్‌గా ఉంటాడో మనందరికీ తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌కి ముందు 12 కేజీలు బరువు పెరిగినా..?

నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా (Instagram/@neeraj____chopra)

Neeraj Chopra diet : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఇప్పుడు దేశంలో అత్యంత ఇష్టపడే అథ్లెట్లలో ఒకరు. టోక్యో 2020 ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన చోప్రా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇటీవల ముగిసిన 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ నీరజ్ చోప్రా 89.45 మీటర్లు జావెలిన్ త్రోను విసిరి రజత పతకం సాధించాడు. నీరజ్ చోప్రా ఫిట్‌గా ఉండటానికి కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నాడు.

నీరజ్ చోప్రా డైలీ డైట్

స్పోర్ట్స్ లో అథ్లెట్‌ ఏ క్రీడలో పాల్గొంటారనే దాన్ని బట్టి బాడీ ఫ్యాట్ శాతాన్ని నిర్ణయిస్తారు. బాడీ బిల్డర్లకు బాడీ ఫ్యాట్ శాతం 3-5 శాతం, జావెలిన్ త్రో వంటి యాక్టివిటీ స్పోర్ట్స్ కోసం 10-10.5 శాతం బాడీ ఫ్యాట్ ఉండాలి. ఒలింపిక్స్ అధికారిక వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా తాను 10 శాతం బాడీ ఫ్యాట్‌ని మెయింటెన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ప్రాక్టీస్‌కి ముందు పండ్లు, పెరుగు, ఓట్స్, 3-4 గుడ్ల తెల్లసొన, రెండు రొట్టె ముక్కలతో టిఫెన్ తింటానని.. ఆ తర్వాత జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానని చోప్రా వెల్లడించాడు

మధ్యాహ్న భోజనంలో పెరుగు, అన్నం, పప్పులు, కూరగాయలు, గ్రిల్డ్ చికెన్, సలాడ్‌ అంటే నీరజ్ చోప్రాకి ఇష్టమట. ప్రాక్టీస్ సెషన్ల మధ్యలో అరటి పండ్లు, డ్రై ఫ్రూట్స్, జ్యూస్ తాగతానని ఇంటర్వ్యూలో చోప్రా చెప్పుకొచ్చాడు.

రాత్రి డిన్నర్‌‌లో పిండి పదార్థాలు లేకుండా చూసుకుంటాడట. కూరగాయలు, సలాడ్ మాత్రమే తీసుకుని.. పడుకునే ముందు గ్లాస్ పాలు, ఖర్జూరాలు.. కొన్నిసార్లు బెల్లం కూడా తీసుకుంటాను అని నీరజ్ చోప్రా తెలిపాడు.

మాంసాహారిగా ఎలా?

వాస్తవానికి నీరజ్ చోప్రా 2016 వరకు స్ట్రిక్ట్ వెజిటేరియన్. అయితే, అమెరికాలోని పోర్ట్ ల్యాండ్‌లో శిక్షణా శిబిరానికి వెళ్లినప్పుడు సరైన శాఖాహార భోజనం అక్కడ అందుబాటులో లేకపోవడంతో శరీరానికి పోషకాలు లభించడం కష్టమైపోయిందట. దాంతో మాంసాహారం తీసుకోక తప్పలేదని ఆ ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

టోక్యో ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా 12-15 కిలోల బరువు పెరిగాడు. కానీ పారిస్ ఒలింపిక్స్‌కి ముందు కఠినంగా శ్రమించి రెండు వారాల్లో రెండు కిలోల బరువు తగ్గి.. శరీరాన్ని పూర్తిగా ఫిట్‌గా ఉంచుకున్నాడు.