Breakfast Dairies : మీ టిఫెన్స్​లో.. ఎగ్​ మఫిన్స్​ చేర్చుకోండి.. -today breakfast recipe is egg muffins here is the ingredients and making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Dairies : మీ టిఫెన్స్​లో.. ఎగ్​ మఫిన్స్​ చేర్చుకోండి..

Breakfast Dairies : మీ టిఫెన్స్​లో.. ఎగ్​ మఫిన్స్​ చేర్చుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 29, 2022 07:53 AM IST

ఉదయాన్నే గుడ్లు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. అయితే వీటిని అంతే హెల్తీగా టేస్టీగా తినాలకుంటే మాత్రం ఎగ్​ మఫిన్​లను ట్రై చేయాల్సిందే. పైగా వీటిని చేయడం కష్టమేమో అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండీ బాబు.. మీరే చూసేయండి వాటిని ఎలా చేయాలో.

<p>ఎగ్ మఫిన్స్</p>
<p>ఎగ్ మఫిన్స్</p>

Egg Muffins : ఉదయాన్నే టైం సరిపోక.. త్వరగా ఏదొకటి చేసుకుని తినాలనుకునే వారికి ఈ ఎగ్​ మఫిన్​లు మంచి ఎంపిక. పైగా ఇవి హెల్తీ కూడా. ఇవి పూర్తిగా తాజా కూరగాయలు, మాంసంతో, మంచి ఫ్లేవర్​లతో నిండి ఉంటుంది. కాబట్టి మీ ఉదయం చాలా టేస్టీగా మారబోతుంది. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో అని చింతించకండి. ఎగ్​ మఫిన్స్​ కోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ మఫిన్స్​ కోసం కావాల్సిన పదార్థాలు

* వెన్న - 1 టీస్పూన్

* పుట్టగొడుగులు - 4, 5 ముక్కలు

* ఉల్లిపాయ - 1 చిన్నది

* పచ్చిమిర్చి - 3

* చికెన్ సాసేజ్ - 6

* చీజ్ - 50 గ్రాములు

* పెప్పర్ - తగినంత

* గుడ్లు - 6

ఎగ్ మఫిన్​ల తయారీ విధానం

ఒక గిన్నె తీసుకుని.. దానిలో పుట్టగొడుగులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చికెన్ సాసేజ్, పెప్పర్, గుడ్లు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మఫిన్ ట్రేలో మూడు వంతుల వరకు నింపండి. దీనిపైన పెప్పర్ వేయండి. వీటిని ఓవెన్​లో 350 డిగ్రీల హీట్​లో 10 నుంచి 15 నిముషాలు కాల్చండి.

ఈ మఫిన్స్ బంగారు గోధుమ రంగులో రోస్ట్ అవుతాయి. వీటిని వేడిగా తినొచ్చు.. లేదా చల్లారిన తర్వాత తిని ఆనందించవచ్చు. ఈ వర్షంలో ఇలా ఎగ్ మఫిన్స్ తింటే.. మనసు హాయిగా ఉంటుంది.

సంబంధిత కథనం

టాపిక్