Neeraj Chopra Manu Bhaker: నీరజ్ చోప్రా, మను బాకర్ పెళ్లి చేసుకుంటున్నారా? ఆమె తండ్రి రియాక్షన్ ఇదీ
Neeraj Chopra Manu Bhaker: ఒలింపిక్స్ ఛాంపియన్ అథ్లెట్లు నీరజ్ చోప్రా, మను బాకర్ పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలపై మను తండ్రి స్పందించారు. ఈ ఇద్దరూ పారిస్ లో సిగ్గు పడుతూ మాట్లాడుకోవడం, తర్వాత నీరజ్ తో మను తల్లి కూడా మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి.
(1 / 9)
Neeraj Chopra Manu Bhaker: స్పోర్ట్స్ వరల్డ్ లో ఇప్పుడో కొత్త లవ్ స్టోరీ తెరపైకి వచ్చింది. జావెలిన్ త్రో హీరో నీరజ్ చోప్రా, పారిస్ ఒలింపిక్స్ లో రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన మను భాకర్ మధ్య ఏదో నడుస్తోందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
(2 / 9)
Neeraj Chopra Manu Bhaker: పారిస్ లో నీరజ్, మను ఇద్దరూ సిగ్గుపడుతూ మాట్లాడుకుంటున్న వీడియో, తర్వాత మను తల్లి నీరజ్ తో మాట్లాడుతూ తనపై ఒట్టేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
(3 / 9)
Neeraj Chopra Manu Bhaker: ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న ఈ ఇద్దరి మధ్య ప్రేమ కలిగిందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ వీడియోల వల్ల పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా మను తల్లి నీరజ్ తో మాట్లాడటం, ఇద్దరినీ కలిపి ఫొటో తీయడానికి ప్రయత్నించడం వీటికి బలం చేకూర్చాయి.
(5 / 9)
Neeraj Chopra Manu Bhaker: మను కెరీర్లో ఇంకా చాలా సాధించాల్సింది ఉందని, అప్పుడే పెళ్లి ఆలోచనలు లేవని ఆయన స్పష్టం చేశారు. దైనిక్ భాస్కర్ తో రామ్ కిషన్ మాట్లాడారు. ఆమెది పెళ్లి వయసు కాదని కూడా ఆయన అనడం గమనార్హం.
(6 / 9)
Neeraj Chopra Manu Bhaker: తన భార్య, మను తల్లి.. నీరజ్ తో మాట్లాడుతున్న వీడియోపైనా స్పందిస్తూ.. అతన్ని ఆమె తన కొడుకులా భావిస్తుందని అన్నారు.
(7 / 9)
Neeraj Chopra Manu Bhaker: అటు నీరజ్ చోప్రా మేనమామ కూడా అతని పెళ్లిపై స్పందిస్తూ.. నీరజ్ మెడల్ తీసుకొస్తే దేశం మొత్తానికి ఎలా తెలిసిందో.. అతడు పెళ్లి చేసుకున్నా తెలుస్తుందని అనడం విశేషం.
(8 / 9)
Neeraj Chopra Manu Bhaker: ఒలింపిక్స్ లో ఇండియా పతాకాన్ని రెపరెపలాడించిన నీరజ్, మను ఇద్దరూ హర్యానాకు చెందినవాళ్లే. నీరజ్ టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్, పారిస్ లో సిల్వర్ సాధించగా.. మను ఒక్క ఒలింపిక్స్ లోనే రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా నిలిచింది.
ఇతర గ్యాలరీలు