Arrest warrant against Ekta Kapoor: ఏక్తా కపూర్ పై అరెస్ట్ వారంట్-bihar court issues arrest warrant against ekta kapoor her mother ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arrest Warrant Against Ekta Kapoor: ఏక్తా కపూర్ పై అరెస్ట్ వారంట్

Arrest warrant against Ekta Kapoor: ఏక్తా కపూర్ పై అరెస్ట్ వారంట్

HT Telugu Desk HT Telugu

Arrest warrant against Ekta Kapoor: బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఏక్తా కపూర్ పై అరెస్ట్ వారంట్ జారీ అయింది. బిహార్ లోని బెగు సరాయి కోర్టు ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్ లపై ఈ వారంట్ ను ఇష్యూ చేసింది.

ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్

Arrest warrant against Ekta Kapoor: హిందీలో పలు విజయవంతమైన టీవీ సీరియళ్లను, వెబ్ సిరీస్ లను నిర్మించిన ఏక్తా కపూర్ పై బిహార్ కోర్టు అరెస్ట్ వారంటు జారీ చేసింది.

Arrest warrant against Ekta Kapoor: వెబ్ సిరీస్ 'XXX'

వెబ్ సిరీస్ 'XXX' సీజన్ 2 లో సైనికులను అవమానించేలా, సైనికుల, వారి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలను చిత్రీకరించారన్న ఆరోపణలపై ఆ వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్, ఆమె తల్లి శోభకపూర్ లపై బిహార్ లోని బెగు సరాయ కోర్టు అరెస్ట్ వారంటును జారీ చేసింది. బెగుసరాయి లో నివసించే మాజీ సైనికుడు శంభు కుమార్ చేసిన ఫిర్యాదు ఆధారంగా న్యాయమూర్తి వికాస్ కుమార్ ఈ వారంటు ను జారీ చేశారు.

Arrest warrant against Ekta Kapoor: సైనికుడి భార్యపై అనుచిత సీన్లు

వెబ్ సిరీస్ 'XXX' సీజన్ 2లో ఒక సైనికుడి భార్యకు సంబంధించి అభ్యంతరకర సీన్లను ప్రసారం చేశారని శంభు కుమార్ ఆరోపించారు. 'XXX' వెబ్ సిరీస్ `ఆల్ట్ బాలాజీ` ఓటీటీ ప్లాట్ ఫామ్ పై ప్రసారం అవుతోంది. ఈ ఓటీటీ కూడా ఏక్తా కపూర్ కు చెందిన బాలాజీ టెలీఫిల్మ్స్ వారిదే. ఏక్తాకపూర్ తల్లి శోభ కపూర్ ఈ బాలాజీ టెలీఫిల్మ్స్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Arrest warrant against Ekta Kapoor: వారంటు ఎందుకు?

గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. ఆ సమన్లకు బదులుగా, తాము ఆ సన్నివేశాలను తొలగించామని కోర్టుకు సమాచారమిచ్చిన ఏక్తాకపూర్.. కోర్టుకు మాత్రం హాజరు కాలేదు. దాంతో, కోర్టు ఈ అరెస్ట్ వారంటును జారీ చేసింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.