Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారంకు నాని బిగ్ ప్లాన్.. కొత్త పోస్టర్ విడుదల.. రిలీజ్ డేట్ ఇదే!
Saripodhaa Sanivaaram Release Date: దసరా, హాయ్ నాన్న తర్వాత నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మరో కొత్త సినిమా సరిపోదా శనివారం. తాజాగా నాని సరిపోదా శనివారం మూవీ విడుదల తేదిపై కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Saripodhaa Sanivaaram New Poster: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. 'అంటే సుందరానికీ' చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కల్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.
ఇటివలే విడుదలైన సరిపోదా శనివారం నాని బర్త్ డే గ్సింప్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సరిపోదా శనివారంపై మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. 'సరిపోదా శనివారం' ఆగస్ట్ 29న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో పాటు కొత్త పోస్టర్ రిలీజ్ చేశఆరు. హీరో నాని పిడికిలి బిగించి మరో చెత్తో రౌడీని పట్టుకున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా పవర్ ఫుల్‌గా ఉంది. అంతేకాకుండా సరిపోదా శనివారం సినిమాను ఏకంగా 5 భాషల్లో విడుదల చేస్తున్నారు.
అంటే, నాని నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సరిపోదా శనివారంను ఆగస్ట్ 29న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా మలయాళ ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ చేస్తోంది. సరిపోదా శనివారం సినిమాలో వెర్సటైల్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మురళి జీ డీవోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా వర్క్ నిర్వరిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా సరిపోదా శనివారం మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఇందులో నాని సూర్య అనే పాత్రలో కనిపించాడు. "కోపాలు రకరకాలు. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కోలాగా ఉంటుంది" అంటూ తమిళ యాక్టర్ ఎస్‌జే సూర్య వాయిస్ ఓవర్‌తో సరిపోదా శనివారం గ్లింప్స్ వీడియోను ప్రారంభించారు. ఈ సినిమాలో నాని విపరీతమైన కోపం ఉన్న సూర్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఆ కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కేవలం శనివారం మాత్రమే చూపించాలని సూర్య అనుకుంటాడు. మరి అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల అంశాలతో సరిపోదా శనివారం తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ఇక గ్లింప్స్‌లో ఫోకస్ అంతా నానిపైనే ఉంచారు. నాని లుక్, స్టైల్, స్వాగ్ బాగుంది. ఇక చివరిలో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ ఎస్‌జే సూర్య చెప్పి భయంకరంగా నవ్వే సీన్ హైలెట్ అయిందని చెప్పుకోవచ్చు.
కాగా సరిపోదా శనివారం సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, పేరుకు తమిళ యాక్టర్ అయిన ఎస్‌జే సూర్యకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. మొదట్లో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సూర్య తర్వాత నటుడిగా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి ప్రశంసలు అందుకున్నారు. ఇక మానాడు సినిమాలో ఆయన చెప్పే అన్నయ్య అనే డైలాగ్‌పై ఎన్నో మీమ్స్ వచ్చి ఎంటర్టైన్ చేశాయి.