Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్‍‍తో దుమ్మురేపిన నాని.. ఎలివేషన్స్ అదుర్స్-nani vivek athreya saripodhaa sanivaaram trailer released electrifying action packed with entertainment nani action mode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్‍‍తో దుమ్మురేపిన నాని.. ఎలివేషన్స్ అదుర్స్

Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్‍‍తో దుమ్మురేపిన నాని.. ఎలివేషన్స్ అదుర్స్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 13, 2024 09:08 PM IST

Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ మోడ్‍లో నాని అదరగొట్టారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చూపించిన ఎలివేషన్స్ దుమ్మురేపేలా ఉన్నాయి. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అదిరిపోయింది.

Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్‍‍తో దుమ్మురేపిన నాని.. ఎలివేషన్స్ అదుర్స్
Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్‍‍తో దుమ్మురేపిన నాని.. ఎలివేషన్స్ అదుర్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో బంపర్ హిట్‍లు కొట్టి నాని జోష్‍లో ఉన్నారు. విభిన్నమైన కథలతో చిత్రాలు చేస్తూ అదరగొడుతున్నారు. సరిపోదా శనివారం చిత్రం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫుల్ హైప్ ఉంది. ఈ తరుణంలో సరిపోదా శనివారం నుంచి నేడు (ఆగస్టు 13) ట్రైలర్ రిలీజ్ అయింది.

రౌండ్ చేస్తే.. అంతుచూడడమే..

సరిపోదా శనివారం సినిమా సోకులపాలెం అనే ఊరిలో సాగుతుంది. “నా సహనం నశించింది.. నా కన్నీళ్లు ఇంకిపోయాయి. అందుకే మనందరి తరఫున భయాన్ని దాటి ఒక అడుగుముందుకు వేద్దామనుకుంటున్నాను” అంటూ ఓ పిల్లాడు గోడపై బొమ్మ గీయటంతో ట్రైలర్ మొదలైంది. సీఐగా ఉండే దయానంద్ (ఎస్‍జే సూర్య).. సోకులపాలెం ప్రజలపై విరుచుకుపడుతుంటాడు. అదే స్టేషన్‍లో పని చేసే కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్) ఆయన చేసే అన్యాయాలపై అసంతృప్తిగా ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటని ఎదురుచూస్తుంటుంది .

“నీకు యముడు, చిత్రగుప్తుడు తెలిసే ఉంటుంది. వారిద్దరూ స్ప్లిట్ పర్సనాలిటీలా ఒకరిలోనే ఉంటే.. వాడే మావడమ్మా” అని సూర్య (నాని) గురించి సాయికుమార్ చెబుతారు. ఆ తర్వాత సూర్య ఎంట్రీ ఉంది. అన్యాయాలు చేసే వారి పేర్లను తన డైరీలో రౌండప్ చేసి వారిని చికతబాదేస్తుంటాడు సూర్య (నాని). తండ్రి పెట్టిన కండీషన్‍తో శనివారం మాత్రమే కోపం చూపిస్తుంటాడు. ఫైట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో సోకులపాలెం ప్రజలపై అన్యాయాలు చేస్తున్న సీఐ దయానంద్ పేరు రాసి రౌండప్ చేస్తాడు సూర్య. ఒక్కసారి పేరు రౌండ్ చేసుకుంటే వారి అంతు చూడడానికి ఎంత సూర్య దూరమైనా వెళతాడని, ఏమైనా చేస్తాడని సాయికుమార్ అంటారు. ఆ తర్వాత సూర్య యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. సూర్యను ఆపలేక దయానంద్ తికమకపడుతుంటాడు. 'పోతారు.. మొత్తం పోతారు' అంటూ దయాతో సూర్య చెప్పే డైలాగ్‍తో సరిపోదా శనివారం ట్రైలర్ ముగిసింది.

అదరగొట్టిన నాని

సరిపోదా శనివారం ట్రైలర్ మాస్ యాక్షన్, ఎలివేషన్లతో అదిరిపోయింది. యాక్షన్, అగ్రెసివ్ మోడ్‍లో నాని దుమ్మురేపారు. ఈ ట్రైలర్లో చివరి నిమిషం యాక్షన్‍తో శివతాండవం చేశారు. అందుకు తగ్గట్టే శివతాండవం అంటూ వచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. యాక్షన్‍లోనూ ఏ మాత్రం తగ్గననేలా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. అతడి టేకింగ్ అదిరిపోయింది. దౌర్జన్యాలు చేసే పోలీస్ అధికారిగా ఎస్‍జే సూర్య తన మార్క్ యాక్టింగ్‍తో మెప్పించారు. జేక్స్ బెజోయ్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ గూజ్‍బంప్స్ తెప్పించేలా ఉంది. మొత్తంగా అంచనాలకు తగ్గట్టే సరిపోదా శనివారం ట్రైలర్ దుమ్మురేపేసింది. మూవీపై హైప్‍ను మరింత పెంచేసింది.

సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.