Goat Twitter Review: గోట్ ట్విట్టర్ రివ్యూ.. దళపతి విజయ్ చివరి సినిమాకు టాక్ ఎలా ఉందంటే?
The Greatest Of All Time Twitter Review In Telugu: దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఇవాళ (సెప్టెంబర్ 5) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ క్రమంలో గోట్ ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..
Goat Twitter Review In Telugu: కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ నటించిన గోడ్ (The Greatest Of All Time) భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో అతిపెద్ద మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే విజయ్ 2026 తమిళనాడు ఎన్నికలలో పాల్గొననున్నాడు.
ఈ తమిళనాడు ఎలక్షన్స్ కంటే ముందు విజయ్ నటించిన సినిమానే గోట్. అలాగే ఇది విజయ్ చివరి చిత్రం అని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విజయ్ లాస్ట్ మూవీ గోట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇది అభిమానులకు యాక్షన్-ప్యాక్డ్, ఇంట్రస్టింగ్ అనుభవాన్ని అందించనుందని తెలుస్తోంది.
గోట్ ట్విటర్ రివ్యూ
ఇక పాపులర్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన గోట్ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా చేశారు. ఇదిలా ఉంటే, గురువారం (సెప్టెంబర్ 5) గోట్ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై సోషల్ మీడియాలో రివ్యూలు వెలిశాయి. ఈ క్రమంలో గోట్ ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..
సినిమాలో విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని ట్విటర్‌లో చెబుతున్నారు. మల్టీ టాలెంట్‌కు పేరొందిన దళపతి విజయ్ తాను తమిళ సినిమాల్లో అత్యంత పేవరేట్ హీరోల్లో ఒకడిగా ఎందుకు నిలిచాడో ఈ సినిమాతో మరోసారి నిరూపించాడని అంటున్నారు. ట్విట్టర్‌లో అభిమానులు విజయ్ నటనకు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అతని ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, ఎమోషనల సీన్స్ యాక్టింగ్‌ను పొగిడారు.
కావాల్సినంత ఫన్
"కావాల్సినంత ఫన్, హీరోయిజంతో క్లీన్ అండ్ పర్ఫెక్ట్ ప్యాకెజ్‌డ్ మూవీ గోట్. ట్విస్టులు ఊహించేలా ఉన్న బాగున్నాయి. సినిమా చూసేందుకు విజయ్ మంచి ట్రీట్. కామెడీ, ఎమోషనల్, హీరోయిక్ సీన్లలో విజయ్ అదరగొట్టాడు. సెకండాఫ్ మరింత బాగుంది" అని ఒక నెటిజన్ రివ్యూ రాసుకొచ్చారు.
చాలా వరకు ట్వీట్స్ అన్ని విజయ్ నటనపై ప్రశంసలు కురుపిస్తున్నాయి. విజయ్ ఇందులో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని చెబుతున్నారు. విజయ్ అభిమానులకు గోట్ మస్ట్ వాచ్ మూవీ అని అంటున్నారు. గోట్ మూవీ ఫస్టాఫ్‌కి ఐదుకి 4 రేటింగ్, సెకండాఫ్‌కి 4.5 రేటింగ్ అని మహి అనే యూజర్ తెలిపాడు.
"ఫస్టాఫ్ అంతా బిగుసుకుపోయేలా చేస్తుంది. విజయ్ పవర్‌ఫుల్ నటన కూడా బోరింగ్ ప్లాట్‌ను ఆదుకోలేకపోయింది. సెకండాఫ్‌లో మేజర్ హైలెట్ విషయం ఉంటే తప్పా వర్కౌట్ కాదు" అని మరొక నెటిజన్ నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు.
"అన్ని అంచనాలను గోట్ మూవీ అందుకుంది. బెస్ట్ కమర్షియల్ సినిమా. ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా ఉంది. సెకండాఫ్‌లో వచ్చే క్లైమాక్స్ బ్యాంగ్ చేసేసింది. డీఏజింగ్‌గా చేసిన కెమియోస్ ఇంట్రెస్టింగ్‌గా ఉండి బాగున్నాయి. ఓవరాల్‌గా ఇది దళపతి విజయ్ షో" అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.