OTT Horror Thriller: ఓటీటీలోకి వస్తున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
OTT Horror Thriller: ఓటీటీలోకి మరో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం.ఈ మూవీ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
OTT Horror Thriller: ఓటీటీలోకి ఇప్పుడో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ నేరుగా వస్తోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా ఈ మూవీని ఓటీటీలోకే తీసుకొస్తున్నారు. కారీ క్రౌస్, విల్ జోన్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే అంతకంటే ముందు టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెప్టెంబర్ 12న ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.
హోల్డ్ యువర్ బ్రెత్ ఓటీటీ స్ట్రీమింగ్
ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు హోల్డ్ యువర్ బ్రెత్. అక్టోబర్ 3 నుంచి ఈ సినిమా హులుతోపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే ప్రయత్నం చుట్టూ తిరుగుతుంది. 1930ల్లో ఓక్లహామా బ్యాక్‌డ్రాప్ లో జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ దుమ్ము దూళి తుఫాను భూమిని ముంచెత్తుతుంది.
ఆ సమయంలో ఏదో అతీత శక్తి ఆ తుఫాను రూపంలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుందని భావించి.. దాని నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓ తల్లి చేసే పోరాటంగా ఈ హోల్డ్ యువర్ బ్రెత్ మూవీని నిర్మించారు. ఈ మూవీలో సారా పాల్సన్, అమియా మిల్లర్, అన్నాలీగ్ ఆష్‌ఫోర్డ్, అలోనా జేన్ రాబిన్స్ లాంటి వాళ్లు నటించారు.
మొదట డస్ట్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కించాలని 2020లో భావించినా.. తర్వాత హోల్డ్ యువర్ బ్రెత్ అంటూ టైటిల్ మార్చారు. అయితే ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయకుండా మొదట టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించి.. తర్వాత నేరుగా అక్టోబర్ 3న ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించారు. వచ్చే నెల నుంచి హులుతోపాటు హాట్‌స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
హాలీవుడ్ హారర్ మూవీస్
ఇదే కాకుండా ఓటీటీలోకి మరికొన్ని హాలీవుడ్ హారర్ సినిమాలు కూడా వచ్చాయి. రాబోతున్నాయి. ది రెంటల్ పేరుతో వస్తున్న హారర్ మిస్టరీ మూవీ సెప్టెంబర్ 13 నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక మరో మూవీ టారట్ నాలుగేళ్ల తర్వాత తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.
సోమవారం (సెప్టెంబర్ 9) నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇందులో తెలుగు నటి అవంతిక వందనపు కూడా నటించడం విశేషం. అయితే ఈ సినిమా ఫ్రీగా కాకుండా ప్రైమ్ వీడియోలో రూ.119 రెంట్ తో చూడాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది.