OTT Kannada Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ కన్నడ డ్రామా.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్
OTT Kannada Movie: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ కన్నడ ఆంథాలజీ డ్రామా వచ్చేస్తోంది. జులై 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 8.6 రేటింగ్ ఉండటం విశేషం. ఈ వారమే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
OTT Kannada Movie: కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలకు ఓటీటీల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ హిట్ మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ పేరు రూపాంతర. రాజ్ బి శెట్టి నటించిన ఈ సినిమా జులై 26న థియేటర్లలో రిలీజ్ కాగా.. కన్నడ ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు.
రూపాంతర ఓటీటీ రిలీజ్ డేట్
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆంథాలజీ డ్రామా రూపాంతర. మిథిలేష్ ఏదావలత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఐదు కథల చుట్టూ తిరుగుతుంది. దేనికదే వేర్వేరు స్టోరీలు అయినా.. అన్నింటినీ కలిపిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రూపాంతర మూవీ ఈ శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నిజానికి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ముందుగానే అనౌన్స్ చేసినా.. కన్నడ సినిమాలను ప్రైమ్ వీడియో చెప్పిన సమయానికి తీసుకురావడం లేదు. ఫ్యామిలీ డ్రామా అనే మరో కన్నడ మూవీ కూడా సోమవారమే (సెప్టెంబర్ 9) స్ట్రీమింగ్ కానుందని చెప్పినా.. ఇప్పటి వరకూ రాలేదు. దీంతో రూపాంతర కూడా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అన్నది చూడాలి.
రూపాంతర.. ఐదు స్టోరీల సమాహారం
సాధారణంగా వేర్వేరు కథలతో నడిచే ఆంథాలజీలు సిరీస్ గా ఓటీటీల్లోకి ఎన్నో వచ్చాయి. ఈ రూపాంతర కూడా అలా ఐదు కథల సమాహారమే. కానీ ఇవి వేటికవే వేర్వేరుగా నడిచినా.. ఒకచోట కలుస్తాయి. సినిమా మొదట్లోనే భవిష్యత్తులో ఉండే ఓ వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఓ కథను చెప్పాల్సి వస్తుంది.
అతడు నాలుగు స్టోరీలను చెబుతాడు. మొదట ఓ వృద్ధ జంట స్టోరీ, తర్వాత ఓ బిచ్చగాడి స్టోరీ, మూడోది ఓ స్థానిక గూండా అక్కడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తో గొడవ పడటం, నాలుగోది చిన్నతనం నుంచే కష్టాల బారిన పడిన ఓ వ్యక్తి తర్వాత ఎలా మత్తుకు బానిసయ్యాడన్నది. ఇలా ఈ నాలుగు స్టోరీల ద్వారా అతడు తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఇవి అతని ప్రాణాలను కాపాడాయా? లేదా అన్నది మూవీలో చూడొచ్చు.
ఈ సినిమాకు ఐఎండీబీలో 8.6 రేటింగ్ ఉండటం విశేషం. అంటే కన్నడ ప్రేక్షకులను మూవీ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రాజ్ బి శెట్టి నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ముందు చెప్పినట్లే ఈ రూపాంతర మూవీ సెప్టెంబర్ 13నే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తుందా లేదా అన్నది చూడాలి.