OTT Malayalam Movies: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు సూపర్ హిట్ మలయాళం మూవీస్.. ఒకటి కామెడీ, మరొకటి క్రైమ్ థ్రిల్లర్-ott malayalam movies comedy drama vishesham crime thriller thalavan streaming on prime video sonyliv ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Movies: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు సూపర్ హిట్ మలయాళం మూవీస్.. ఒకటి కామెడీ, మరొకటి క్రైమ్ థ్రిల్లర్

OTT Malayalam Movies: ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు సూపర్ హిట్ మలయాళం మూవీస్.. ఒకటి కామెడీ, మరొకటి క్రైమ్ థ్రిల్లర్

Hari Prasad S HT Telugu
Sep 10, 2024 07:47 AM IST

OTT Malayalam Movies: ఒకే రోజు రెండు వేర్వేరు ఓటీటీల్లోకి రెండు సూపర్ హిట్ మలయాళం సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో ఒకటి కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా కాగా.. మరొకటి క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచి ఈ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు సూపర్ హిట్ మలయాళం మూవీస్.. ఒకటి కామెడీ, మరొకటి క్రైమ్ థ్రిల్లర్
ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన రెండు సూపర్ హిట్ మలయాళం మూవీస్.. ఒకటి కామెడీ, మరొకటి క్రైమ్ థ్రిల్లర్

OTT Malayalam Movies: ఓటీటీలోకి ఒకే రోజు రెండు హిట్ మలయాళం సినిమాలు రావడం విశేషం. వీటిలో ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో, మరొకటి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన హిట్ సినిమాల జాబితాలో ఉన్నాయి. ఆ మూవీస్ మరేవో కాదు విశేషం, తలవన్.

విశేషం ఓటీటీ స్ట్రీమింగ్

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చి హిట్ కొట్టిన కామెడీ డ్రామా విశేషం. ఈకాలం ఫెర్టిలిటీ సెంటర్లు, వాటిలో చికిత్స గురించి నవ్వులు పూయిస్తూ చూపించిన మూవీ ఇది. జులై 19న థియేటర్లలో రిలీజైన సంచలన విజయం సాధించింది. ఐఎండీబీలోనూ ఏకంగా 9 రేటింగ్ ఉండటం విశేషం. కొచ్చిలో నివసించే ఓ జంట చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

సూరజ్ టామ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఆనంద్ మధుసూదన్, చిన్ను చాందిని, బైజు జాన్సన్, అల్తాఫ్ సలీమ్ లాంటి వాళ్లు ఈ మూవీలో నటించారు. ఈ సినిమా మూడు నెలల తర్వాత మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమైంది.

తలవన్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇక మరో హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ తలవన్. బిజు మీన‌న్, ఆసీఫ్ అలీ హీరోలుగా న‌టించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ కూడా మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచే సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

తలవన్ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. త‌ల‌వ‌న్ మూవీకి జిస్ జాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో మియా జార్జ్‌, అనుశ్రీ హీరోయిన్లుగా న‌టించారు.

పోలీస్ ఆఫీస‌ర్లుగా బిజు మీన‌న్‌, ఆసిఫ్ అలీ యాక్టింగ్‌తో పాటు క‌థ, ట్విస్ట్ బాగున్నాయంటూ త‌ల‌వ‌న్ మూవీపై ఆడియెన్స్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఓ పోలీస్ ఆఫీస‌ర్ జీవితంలో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు జిస్ జాయ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

పోలీస్ పాత్ర‌ల‌తో మ‌ల‌యాళంలో బిజు మీన‌న్ చేసిన సినిమాలు అన్ని హిట్ట‌య్యాయి. అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్‌, తుండు, శివ‌మ్‌, పాత్ర‌మ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీస‌ర్ రోల్స్ చేశాడు బిజుమీన‌న్‌. మ‌ల‌యాళంలో హీరోగా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తోన్న బిజు మీన‌న్ తెలుగులో ఓ రెండు సినిమాల్లో క‌నిపించాడు గోపీచంద్ ర‌ణంతో పాటు ర వితేజ ఖ‌త‌ర్నాక్ సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు.