OTT Kannada Crime Drama: ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్-ott kannada crime drama 19 20 21 streaming on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Kannada Crime Drama: ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్

OTT Kannada Crime Drama: ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్

Hari Prasad S HT Telugu
Aug 27, 2024 12:17 PM IST

OTT Kannada Crime Drama: ఓటీటీలోకి తాజాగా ఓ సూపర్ హిట్ కన్నడ క్రైమ్ డ్రామా వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది.

ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్
ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్

OTT Kannada Crime Drama: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ కన్నడ మూవీ వచ్చేసింది. ఏడాదిన్నర కింద థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించినా.. కమర్షియల్ గా సక్సెస్ కాని ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ వచ్చేసింది. కానీ ఇప్పటికీ ఈ మూవీ రెంటల్ విధానంలోనే అందుబాటులో ఉండటంతో అందరికీ ఫ్రీగా చూసే అవకాశం లేకుండా పోయింది.

ప్రైమ్ వీడియోలోకి 19.20.21

గతేడాది మార్చి 3న రిలీజైన కన్నడ క్రైమ్ డ్రామా 19.20.21. ఈ సినిమాకు ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ ఉంది. ఇప్పుడీ మూవీ మంగళవారం (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఈ సినిమా చూడాలంటే మాత్రం రూ.99 రెంట్ చెల్లించాల్సి ఉంది. ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చినా కూడా ప్రైమ్ వీడియో తమ సబ్‌స్క్రైబర్లందరికీ మూవీ చూసే అవకాశం ఇవ్వకుండా ఈ రెంట్ విధానం పెట్టడం గమనార్హం.

అసలేంటీ 19.20.21 మూవీ?

ఈ 19.20.21 మూవీ నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ. ఓ వ్యక్తి జీవితాన్ని నిర్ణయించే కీలకమైన 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులోనే ఓ స్టూడెంట్ పై ద్రోహం కేసు నమోదైతే? కఠినమైన సెక్షన్ల కిందట అరెస్టయి బెయిల్ కూడా దక్కకపోతే ఆ విద్యార్థి జీవితం ఏమవుతుంది? నక్సల్స్ తో సంబంధం ఉందంటూ అరెస్టయిన స్టూడెంట్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్న కథాంశంతోనే ఈ కన్నడ క్రైమ్ డ్రామా తెరకెక్కింది.

మన్సూర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాజేస్ నత్రంగ, బాలాజీ మనోహర్, అవినాష్, కృష్ణ హెబ్బళెలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. తన కమ్యూనిటీ హక్కుల కోసం గళం విప్పి పోరాడే యువకుడి చుట్టూ తిరిగే కథే ఈ 19.20.21 మూవీ.

19.20.21కి పాజిటివ్ రివ్యూలు

నక్సల్స్, రాజ్యం మధ్య పోరులో ఎంతో మంది అమాయకులు బలైన చరిత్ర మనం చూశాం. ఇటు నక్సలైట్లు, అటు పోలీసులు మధ్య నలిగిపోయిన ఆదివాసీల బతుకులనూ మనం చూశాం. అడవి తల్లినే నమ్ముకున్న ఆదివాసీల నిస్సహాయత, స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల అత్యాశ, బాధ్యతారాహిత్యంలాంటి అంశాలను కూడా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ మన్సూర్ తెలియజెప్పే ప్రయత్నం చేశాడు.

మార్చి 3, 2023లో ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. అటు ఐఎండీబీలోనూ మూవీ చూసిన ప్రేక్షకులు మంచి రివ్యూలు ఇచ్చారు. అయితే ఈ మూవీకి బాక్సాఫీస్ సక్సెస్ మాత్రం దక్కలేదు. మొత్తానికి ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. మరి ఈ 19.20.21 సినిమాకు ప్రైమ్ వీడియోలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది చూడాలి.