OTT Romantic Action Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ డూపర్ హిట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్-romantic action kannada movie love li now streaming on amazon prime video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Action Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ డూపర్ హిట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్

OTT Romantic Action Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ డూపర్ హిట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్

Hari Prasad S HT Telugu
Aug 07, 2024 04:19 PM IST

OTT Romantic Action Movie: ఓటీటీలోకి తాజాగా ఓ సూపర్ డూపర్ హిట్ కన్నడ రొమాంటిక్ యాక్షన్ మూవీ వచ్చింది. ఐఎండీబీలో ఏకంగా 9.5 రేటింగ్ ఉన్న ఈ సినిమా కన్నడనాట మంచి సక్సెస్ సాధించింది.

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ డూపర్ హిట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ డూపర్ హిట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్

OTT Romantic Action Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత భాషలకు అతీతంగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న సంగతి తెలుసు కదా. అలాంటి ప్రేక్షకుల కోసం ఇప్పుడు మరో కన్నడ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ పేరు లవ్ లీ. జూన్ 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ)లో ఏకంగా 9.5 రేటింగ్ ఉండటం విశేషం.

లవ్ లీ ఓటీటీ స్ట్రీమింగ్

కన్నడ భాష నుంచి కూడా అప్పుడప్పుడూ చాలా మంచి సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన మూవీయే లవ్ లీ. సుమారు రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే కేవలం కన్నడ ఆడియోతోనే ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇంగ్లిస్ సబ్ టైటిల్స్ తో చూడాలనుకుంటే చూడొచ్చు.

గ్యాంగ్‌స్టర్ గా మారిన ఓ అనాథ ఓ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత అతనిలో ఎలాంటి మార్పు వస్తుందన్నదే ఈ లవ్ లీ కథ. జూన్ 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కన్నడ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అందుకే ఐఎండీబీలో ఈ మూవీకి ఏకంగా 9.5 రేటింగ్ ఉంది.

ఏంటీ లవ్ లీ మూవీ?

లవ్ లీ మూవీ జై అనే ఓ గ్యాంగ్‌స్టార్ గా మారిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతడు జనని అనే అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత ఎలా మారతాడన్నది ఈ మూవీ స్టోరీ. ఈ సినిమాలో జై పాత్రలో వశిష్ట సింహా లీడ్ రోల్ పోషించగా.. జనని పాత్రలో స్టెఫీ పటేల్ కనిపించింది. కనీసం స్నేహితులు కూడా లేని అనాథగా పెరిగిన జై.. ఓ హాస్పిటల్లో రక్తదానం చేయడానికి వెళ్లి అక్కడ కనిపించిన జనని ప్రేమలో పడతాడు.

నిజానికి జననీయే అతనికి మొదట ప్రపోజ్ చేస్తుంది. అయితే తన క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా ఆమె ప్రేమను అంగీకరించడానికి జై వెనుకాడతాడు. కానీ ఆ తర్వాత ఓకే చెప్పడంతోపాటు పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. పెళ్లి కూడా చేసుకొని మంగళూరుకు షిఫ్ట్ అవుతారు.

అక్కడ జై ఉద్యోగం చేసుకుంటుండగా.. జనని ఓ ఊహించని వ్యాధి బారిన పడుతుంది. సెకండాఫ్ లో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఇద్దరూ కలిసి చికిత్స కోసం లండన్ వెళ్తారు. తర్వాత వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది సినిమాలో చూడాలి.