OTT Romantic Thriller: మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి తాప్సీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!-phir aayi hasseen dillruba streaming on netflix ott taapsee pannu vikrant massey romantic thriller movie netflix release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Romantic Thriller: మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి తాప్సీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT Romantic Thriller: మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి తాప్సీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 07, 2024 04:13 PM IST

Phir Aayi Hasseen Dillruba OTT: ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‍రూబా’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‍ఫామ్ సహా మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

OTT Romantic Thriller: మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి తాప్సీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
OTT Romantic Thriller: మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి తాప్సీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

హసీన్ దిల్‍రూబా సినిమా 2021లో నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చి పాపులర్ అయింది. బాగా సక్సెస్ అయింది. స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను, విక్రాంత్ మాసే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‍లో వస్తోంది. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‍రూబా’ పేరుతో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం అడుగుపెడుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆసక్తిని రేపింది. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‍రూబా’ స్ట్రీమింగ్‍కు కూడా రెడీ అయింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఫిర్ ఆయీ హసీన్ దిల్‍రూబా చిత్రం మరో రెండు రోజుల్లో రోజుల్లో ఆగస్టు 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ సీక్వెల్ మూవీ కూడా థియేటర్లలో రిలీజ్ కాకుండా డైరెక్ట్‌గా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి మంచి హైప్ ఉంది.

ఇటీవలే వచ్చిన ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‍రూబా’ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీలోనూ రొమాన్స్, క్రైమ్, ట్విస్టులు ఉంటాయని అర్థమవుతోంది. ఈ చిత్రంలో తాప్సీ, విక్రాంత్ మాసేతో పాటు సన్నీ కౌశల్ కూడా ఓ మెయిన్ రోల్ చేశారు. జిమ్మీ షేర్గిల్, ఆదిత్య శ్రీవాత్సవ, భూమికా దూబే కూడా కీలకపాత్రలు పోషించారు.

ఫిర్ ఆయీ హసీన్ దిల్‍రూబా’ చిత్రానికి జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. హసీన్ దిల్‍రూబా కథకు కొనసాగింపుగానే ఈ సీక్వెల్ మూవీని తీసుకొస్తున్నారు. ఈ మూవీకి సంచెత్ - పరంపర, అనురాగ్ సైకియా మ్యూజిక్ ఇచ్చారు.

‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‍రూబా’ మూవీని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. గతేడాది జనవరిలోనే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. డిసెంబర్‌లో చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యం కాగా.. ఇప్పుడు ఆగస్టు 9న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

మరిన్ని ట్విస్టులతో..

రాణి కశ్యప్ (తాప్సీ), రిషబ్ సక్సేనా అలియాజ్ రిషి (విక్రాంత్ మాసే) మళ్లీ ఒకటై.. ఆగ్రాకు వెళ్లి కొత్త జీవితం మొదలుపెట్టడంతో హసీన్ దిల్‍రూబా చిత్రం ఎండ్ అయింది. దీనికి సీక్వెల్‍గా వస్తున్న ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‍రూబా’ అక్కడి నుంచే షురూ కానుంది. అభిమన్యు (సన్నీ కౌశల్)తోనూ రాణి రిలేషన్‍లోకి వెళుతుందనేలా ట్రైలర్‌లో ఉంది. పాత కేసు మళ్లీ రాణిని వెంటాడుతుందనేలా, మరిన్ని ట్విస్టులు ఉంటాయనేలా మేకర్స్ ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తిని పెంచేశారు.

తాప్సీ వివాహం

హీరోయిన్ తాప్సీ ఈ ఏడాదిలోని వివాహం చేసుకున్నారు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్, కోచ్ మథియస్ బోయ్‍ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం మార్చి 23వ తేదీన జరిగింది. ఉదయ్‍పూర్‌లో ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు, కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీల మధ్య ఈ వేడుక జరిగింది. ముందుగా పెద్దగా హడావుడి చేయకుండా సైలెంట్‍గా పెళ్లి చేసుకున్నారు తాప్సీ.