OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళం డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-ott malayalam dark comedy movie pattaapakal now streaming on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Malayalam Dark Comedy: ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళం డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళం డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Sep 10, 2024 01:53 PM IST

OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి మరో మలయాళం డార్క్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇప్పటికే మంగళవారం (సెప్టెంబర్ 10) ఓ కామెడీ, మరో క్రైమ్ థ్రిల్లర్ మలయాళం సినిమాలు ఓటీటీలోకి రాగా.. తాజాగా ఈ డార్క్ కామెడీ కూడా అడుగు పెట్టింది.

ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళం డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చిన మరో మలయాళం డార్క్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి మలయాళం సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఆ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడూ ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటోంది. తాజాగా మరో డార్క్ కామెడీ మూవీ పట్టాపాకల్ కూడా ఓటీటీలో అడుగు పెట్టింది. కొన్ని రోజుల కిందట సైనా ప్లే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు మరో దాంట్లోకి కూడా రావడం విశేషం.

పట్టాపాకల్ ఓటీటీ స్ట్రీమింగ్

మలయాళం డార్క్ కామెడీ మూవీ పట్టాపాకల్ మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా జూన్ 28న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఆగస్ట్ 27 నుంచి సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైనా.. ఇప్పుడు ప్రైమ్ వీడియో ద్వారా మరింత మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ఇదో మంచి టైంపాస్ మూవీ అని చెప్పొచ్చు.

పట్టాపాకల్ ఓ డార్క్ కామెడీ మూవీ. ఇద్దరు స్నేహితులు, ఓ మంత్రి, ఓ గ్యాంగ్‌స్టర్, నలుగు క్రిమినల్స్ చుట్టూ తిరిగే కథ ఇది. సాజిర్ సాదఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జానీ ఆంటోనీ, ఆశికా అశోకన్, వినీత్ తట్టి డేవిడ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

ఓటీటీ మలయాళం మూవీస్

ఓటీటీలోకి మంగళవారమే (సెప్టెంబర్ 10) మరో రెండు మలయాళం సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో ఒకటి కామెడీ కాగా.. మరొకటి క్రైమ్ థ్రిల్లర్. కామెడీ మూవీ విశేషం కూడా ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ తలవన్.. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఒకే రోజు మూడు మలయాళం సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చాయి.

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చి హిట్ కొట్టిన కామెడీ డ్రామా విశేషం. ఈకాలం ఫెర్టిలిటీ సెంటర్లు, వాటిలో చికిత్స గురించి నవ్వులు పూయిస్తూ చూపించిన మూవీ ఇది. జులై 19న థియేటర్లలో రిలీజైన సంచలన విజయం సాధించింది. ఐఎండీబీలోనూ ఏకంగా 9 రేటింగ్ ఉండటం విశేషం. కొచ్చిలో నివసించే ఓ జంట చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఇక మరో హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ తలవన్. బిజు మీన‌న్, ఆసీఫ్ అలీ హీరోలుగా న‌టించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ కూడా మంగళవారం (సెప్టెంబర్ 10) నుంచే సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.25 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.