Bigg Boss Telugu 8: భద్రకాళిలా సోనియా చేష్టలు.. టవల్ మ్యాటర్‌తో నోరు మూయించిన కిర్రాక్ సీత.. నాగ మణికంఠ వెన్నుపోటు!
Bigg Boss Telugu 8 September 10th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్ రెండో రోజు కూడా జోరుగా జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 10 ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సోనియా భద్రకాళిలా పోజులిచ్చింది.
Bigg Boss Telugu 8 Today Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ రెండో వారం నామినేషన్స్ హౌజ్‌లో ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన ఈ నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నాడు కూడా జరగనుంది. ఈ బిగ్ బాస్ 8 తెలుగు రెండో వారం నామినేషన్ల ప్రక్రియకు సబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.
వెన్నుపోటు పొడిచినట్లు
బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 10వ తేది ఎపిసోడ్ ప్రోమోలో నాగ మణికంఠను పృథ్వీరాజ్ నామినేట్ చేశాడు. సర్వైవల్ కోసం నైనిక దగ్గరికి వెళ్లు నిన్ను తీసుకోమ్మని చెప్పావ్. అది నీ చీఫ్‌ను బ్యాక్ స్టాబ్ (వెన్నుపోటు) పొడిచినట్లు అనిపించింది నాకు అని పృథ్వీరాజ్ చెప్పాడు. సర్వైవల్.. ఈ గేమ్ అంతా కూడా సర్వైవలే అని నాగ మణికంఠ బదులిచ్చాడు.
అనంతరం నిఖిల్‌ను ప్రేరణ నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. పొద్దున బ్రేక్ ఫాస్ట్ మీ క్లాన్ వాళ్లు ఎందుకు చేయలేదు అని ప్రేరణ ప్రశ్నించింది. ఒక్కరోజుకు నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నారు కదా. మరి అంతకుముందు నేనే చూసుకున్నాను. అప్పుడు ఎవరు ఆకలి అనలేదే అని నిఖిల్ చెప్పాడు. తర్వాత మీరు బయట ఉన్నప్పుడు నేను మీ చీఫ్ ముందు నుంచి నాలుగు గ్లాసులు తీసి పెట్టా అని నైనిక చెప్పింది.
ఉతుక్కోవచ్చు కదా
నేనేం డిక్టేటర్ కాదని నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత ప్రేరణ సీత మధ్య వాగ్వాదం జరిగింది. డస్ట్ బిన్ డస్ట్ బిన్ అంటే.. అరే అది క్లీన్ ఉంది. లోపల చేయి పెట్టి తీసింది నేను. దాన్ని పెద్ద పాయింట్‌లా తీసుకురావడం కరెక్ట్ కాదని ప్రేరణ చెప్పింది. మొన్న మీ టవల్ ఆదిత్య అన్న వాడారు కదా. అది మీరు ఉతుక్కుని వాడుకోవచ్చు కదా. మరి ఎందుకు అతని దగ్గరికి వచ్చి గొడవ చేశారు అని కిర్రాక్ సీత బదులిచ్చింది.
దాంతో ప్రేరణ సైలెంట్ అయిపోయింది. నైనిక క్లాన్ వాళ్లకు అన్ని క్లీనింగ్ పనులు ఇచ్చింది యశ్మీ. ఈ క్రమంలోనే ఓ బాటిల్‌ను చెత్తలో వేసిన ప్రేరణ వాళ్లు చూసుకుంటారులే. టేబుల్‌పై పెట్టు అని జోక్ చేశాడు. అది కామెడీ అనుకోకుండా సీరియస్‌గా తీసుకున్న ప్రేరణ మళ్లీ అదే బాటిల్‌ను చెత్త కుండీ నుంచి తీసి టేబుల్‌పై పెట్టింది.
రేపు సోనియాతో వస్తుంది
ఈ విషయంలో తనది తప్పు లేదని వాదించిన ప్రేరణకు టవల్ ఎగ్జాంపుల్ చెప్పి నోరు మూయించినంత పని చేసింది కిర్రాక్ సీత. చీఫ్‌గా నువ్ ఫెయిల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు నబీల్. ఎంత చీఫ్ అయిన వాళ్ల పర్సనల్స్ వాళ్లకు ఉంటాయి, గొడవలు వస్తాయి. రేపు సోనియాతో వస్తుంది. ఇంకొకరితో వస్తుంది. ఐ డోంట్ కేర్ అని నిఖిల్ చెప్పాడు.