Bigg Boss Telugu 8: మనందరం తినాల్సిన విషం ఇది.. నామినేషన్లలో హీరో ఆదిత్య ఓం కామెంట్స్-bigg boss telugu 8 aditya om nominated prithviraj shekar basha bigg boss 8 telugu september 4th episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: మనందరం తినాల్సిన విషం ఇది.. నామినేషన్లలో హీరో ఆదిత్య ఓం కామెంట్స్

Bigg Boss Telugu 8: మనందరం తినాల్సిన విషం ఇది.. నామినేషన్లలో హీరో ఆదిత్య ఓం కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Bigg Boss Telugu 8 September 4th Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ గొడవలతో జోరుగా సాగాయి. ఈ నేపథ్యంలో నామినేట్ చేస్తున్న హీరో ఆదిత్యం ఓం చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మనందరం తినాల్సిన విషం ఇది అంటూ శేఖర్ బాషాతో ఆదిత్య ఓం అన్నాడు.

మనందరం తినాల్సిన విషం ఇది.. నామినేషన్లలో హీరో ఆదిత్య ఓం కామెంట్స్

Bigg Boss Telugu 8 Day 3 Highlights: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో మొదటి వారం నామినేషన్ల ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఎవరు ఊహించని విధంగా గొడవలు, అరుపులు, ఇంటి సభ్యులత ఏడుపులతో ఫస్ట్ వీక్ నామినేషన్స్ జరిగాయి. మంగళవారం (సెప్టెంబర్ 3) మొదలైన ఈ నామినేషన్ల ప్రక్రియ బుధవారం (సెప్టెంబర్ 4) నాడు ముగిసాయి.

అంటే రెండు రోజులపాటు రచ్చ చేస్తూ బిగ్ బాస్ 8 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్ జరిగాయి. ఈ మొదటి వారం నామినేషన్లలో మొత్తంగా ఆరుగురు ఇంటి సభ్యులు నామినేషన్‌లో ఉన్నారు. అధిక ఓట్లతో వారిలో బెజవాడ బేబక్క, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నాగ మణికంఠ, శేఖర్ బాషా, యాంకర్ విష్ణుప్రియ ఉన్నారు.

ఎలిమినేట్ ఎవరనేది

ఈ ఆరుగురికి బుధవారం రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ ముగిసిన అప్పటినుంచి ఓటింగ్ పోల్ ఓపెన్ అయింది. వీరికి వచ్చే ఓటింగ్‌ను బట్టి ఈవారం ఎలిమినేషన్ ఎవరు అవుతారనేది తెలిసిన విషయమే. ఎలిమినేషన్ ఎవరు కానున్నది ఆదివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున చెబుతారు. అప్పటివరకు తమ ఓటింగ్‌ను పెంచుకునేందుకు కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.

ఇదిలా ఉంటే, బుధవారం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియను హీరో ఆదిత్య ఓం ప్రారంభించాడు. ఆయన వచ్చి పృథ్వీరాజ్‌ను మొదటగా నామినేట్ చేశాడు. "అన్ని డిపార్ట్‌మెంట్స్ పెట్టినప్పటినుంచి మీరు క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌‌కు వచ్చారు. క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో అతి తక్కువ పని చేసినవాళ్లలో మీరే. అందరికంటే లీస్ట్‌గా వర్క్ చేశారు" అని ఆదిత్యం ఓం అన్నారు.

సారీ చెప్పి.. కాళ్లు మొక్కారు

దానికి పృథ్వీరాజ్ కూడా ఓకే అన్నాడు. పెద్దగా డిఫెండ్ చేసుకోలేదు. "తర్వాత పాయింట్.. ఏదైనా డిస్కషన్‌లో ఉన్నప్పుడు లాజిక్‌గా మాట్లాడాలి, లేదా పని చూపించాలి, రెండు లేనప్పుడు ప్రూఫ్‌తో నిరూపించాలి. అంతేగానీ ఆవేశంలో మాట్లాడకూడదు. లేడిస్‌తో మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండాలి. అఫ్‌కోర్స్, మీరు సారీ చెప్పి కాళ్లు మొక్కారు. నేను దాన్ని మెచ్చుకుంటాను. కానీ, అలా ఇంకోసారి చేయకూడదని, మీ ఇంప్రూవ్‌మెంట్‌కోసం విత్ టోటల్ లవ్ ఈ నామినేషన్" అని ఆదిత్యం ఓం చెప్పాడు.

దానికి పృథ్వీరాజ్ కూడా ఒప్పుకుని సైలెంట్‌గా ఉన్నాడు. తర్వాత శేఖర్ బాషాను నామినేట్ చేశాడు ఆదిత్య ఓం. "మీతో నాకు మంచి ర్యాపో ఏర్పడింది. మీతోనే నేను మ్యాగ్జిమమ్ టైమ్ స్పెండ్ చేశాను. కానీ, ఈ నామినేషన్ ప్రక్రియ అంటే ఒక విషం. మనందరం తాగాలి. ఈరోజు, నిన్న మీలో ఎక్కువగా లేజీనెస్ చూశాను. మీరు ఎక్కువగా యాక్టివ్‌గా ఉండాలి. మీరు ఎవరికీ హెల్ప్ చేయలేదు" అని ఆదిత్య ఓం అన్నాడు.

లేజీనెస్ అనేది కరెక్ట్ కాదు

"లేజీనెస్ అనేది కరెక్ట్ కాదు. నిద్రలేకపోవడం వల్ల అనుకుంటా టైడ్ అయిపోయాను. ఇక వాలంటీర్‌గా హెల్ప్ అంటే వాళ్లకు వీళ్లకు చేస్తూనే ఉన్నాను. యాక్టివ్‌గా ఉండట్లేదు అనేది ఒప్పుకుంటాను. కానీ, అది లేజీనెస్ కాదు" అని శేఖర్ బాషా డిఫెండ్ చేసుకున్నాడు.