Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లోకి యాంకర్ విష్ణుప్రియ, రాజ్ తరుణ్ లవర్‌తో పోరాడిన శేఖర్ బాషా- మొత్తం 14 మంది!-bigg boss telugu 8 confirmed contestants are anchor vishnu priya rj shekar basha dancer nainika actress vismaya sri ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లోకి యాంకర్ విష్ణుప్రియ, రాజ్ తరుణ్ లవర్‌తో పోరాడిన శేఖర్ బాషా- మొత్తం 14 మంది!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లోకి యాంకర్ విష్ణుప్రియ, రాజ్ తరుణ్ లవర్‌తో పోరాడిన శేఖర్ బాషా- మొత్తం 14 మంది!

Sanjiv Kumar HT Telugu
Aug 26, 2024 02:13 PM IST

Bigg Boss Telugu 8 Anchor Vishnu Priya Shekhar Basha: బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్‌లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి యాంకర్ విష్ణు ప్రియ, హీరో రాజ్ తరుణ్ లవర్ లావణ్యతో యుద్ధం చేసిన ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇవ్వనున్నారనే కచ్చితమైన సమాచారం అందింది.

బిగ్ బాస్ తెలుగు 8లోకి యాంకర్ విష్ణుప్రియ, రాజ్ తరుణ్ లవర్‌తో పోరాడిన శేఖర్ బాషా- మొత్తం 14 మంది!
బిగ్ బాస్ తెలుగు 8లోకి యాంకర్ విష్ణుప్రియ, రాజ్ తరుణ్ లవర్‌తో పోరాడిన శేఖర్ బాషా- మొత్తం 14 మంది!

Bigg Boss 8 Telugu Contestants: బిగ్ బాస్ 8 తెలుగు షో ప్రారంభానికి దగ్గర పడుతున్న నేపథ్యంలో కంటెస్టెంట్ల వివరాలు మారుతూ వస్తున్నాయి. ఇదివరకు కంటెస్టెంట్ల విషయంలో అనేక రూమర్స్ వచ్చినప్పటికీ బిగ్ బాస్ తెలుగు 8 స్టార్ట్ డేట్ అనౌన్స్‌మెంట్ ఇచ్చినప్పటినుంచి దాదాపుగా కచ్చితమైన సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ 8 తెలుగు షోను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌కు ఇప్పటికీ కంటెస్టెంట్స్‌గా పాల్గొననున్న పదకొండు మంది సెలబ్రిటీల వివరాలు తెలిశాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి యాంకర్ విష్ణుప్రియతోపాటు మరో ముగ్గురు ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

యాంకర్ విష్ణుప్రియ కన్ఫర్మ్

పోవే పోరా షోతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ విష్ణుప్రియ చెక్‌మేట్ వంటి పలు సినిమాల్లో సైతం నటించి మెప్పించింది. చెక్‌మేట్ మూవీలో బోల్డ్‌గా నటించి అట్రాక్ట్ చేసిన యాంకర్ విష్ణుప్రియ జేడీ చక్రవర్తి యాక్ట్ చేసిన దయా వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో మెరిసింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ 8 తెలుగులోకి కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అయిందనేది పక్కా సమాచారం.

నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 8లోకి మరో కంటెస్టెంట్‌గా ఆర్జే శేఖర్ బాషా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అతనిపై బుధవారం (ఆగస్ట్ 28) ఏవీ కూడా షూట్ చేయనున్నారట. అయితే, ఇటీవల హీరో రాజ్ తరుణ్ ఎక్స్ లవర్ లావణ్యతో దాదాపుగా యుద్ధమే చేశాడు శేఖర్ బాషా. లావణ్యవన్నీ తప్పుడు ఆరోపణలంటూ నిరూపించేందుకు న్యూస్ ఛానెల్స్‌లో డిబేట్‌కు దిగి కాంట్రవర్సీతో పాపులర్ అయ్యాడు.

డ్యాన్సర్ నైనిక ఎంట్రీ

ఈ ఇద్దరితోపాటు బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్‌లోకి డ్యాన్సర్ నైనిక కూడా ఎంట్రీ ఇవ్వనుందట. ప్రముఖ తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో ఢీ ద్వారా పాపులర్ అయిన డ్యాన్సర్లలో నైనిక ఒకరు. అదిరిపోయే స్టెప్పులకు హాట్‌నెస్ యాడ్ చేసి ఆకట్టుకున్న నైనిక బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. డ్యాన్స్ షోలో నైనిక అలరించే డ్యాన్స్‌తోపాటు లవ్ ట్రాక్‌తో ఫేమస్ అయింది.

వీరితోపాటు తెలుగులో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన హీరోయిన్ విస్మయ శ్రీ కూడా బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అయిందట. ఇటీవల పలు కారణాలతో ఇన్‌స్టాగ్రామ్‌కు కొద్దిరోజులు బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పిన విస్మయ శ్రీ "మైల్స్ ఆఫ్ లవ్, దిల్ సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో" వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది.

14 మంది కంటెస్టెంట్స్ ఫిక్స్

ఇలా తాజాగా బిగ్ బాస్ 8 తెలుగులోకి నలుగురు కంటెస్టెంట్స్‌గా దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. అయితే, ఇదివరకు బిగ్ బాస్ తెలుగు 8లోకి 11 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసిందే. వారిలో, ఇంద్రనీల్, నిఖిల్ మిలిక్కల్, ఆదిత్య ఓం, సౌమ్య రావు, రీతూ చౌదరి, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, అంజలి పవన్, అభిరామ్ వర్మతోపాటు కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ ఉన్నారు.

అయితే, వీరిలో చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌తో పాపులరైన ఇంద్రనీల్ ఇంకా అగ్రిమెంట్‌పై సంతకం చేయలేదట. బిగ్ బాస్ ద్వారా నెగెటివిటీ కూడా రావొచ్చన భయంతో తన వైఫ్ మేఘన వద్దని చెబుతోందట. కానీ, బిగ్ బాస్‌లోకి వెళ్లాలని ఇంద్రనీల్ తాపత్రయపడుతున్నాడని తెలుస్తోంది.

బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యేవరకు ఇంద్రనీల్ వస్తున్నాడా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే, ఇంద్రనీల్‌ను పక్కనపెడితే ఇప్పటివరకు బిగ్ బాస్ 8 తెలుగుకు కంటెస్టెంట్స్‌గా పార్టిస్‌పేట్ చేసేందుకు 14 మంది సెలబ్రిటీలు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యారు.