Bigg Boss Telugu 8 Contestants: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. 10 మంది కన్ఫర్మ్!-bigg boss telugu 8 confirmed contestants list of 10 celebrities bigg boss 8 telugu confirmed contestants nagarjuna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8 Contestants: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. 10 మంది కన్ఫర్మ్!

Bigg Boss Telugu 8 Contestants: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. 10 మంది కన్ఫర్మ్!

Sanjiv Kumar HT Telugu
Aug 22, 2024 02:42 PM IST

Bigg Boss Telugu 8 Confirmed Contestants List: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ జాబితా లీక్ అయింది. ప్రస్తుతం 10 మంది సెలబ్రిటీల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరే దాదాపుగా 99.99 శాతం కన్ఫర్మ్ అయినట్లు బిగ్ బాస్ టీమ్ సన్నిహిత వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. 10 మంది కన్ఫర్మ్!
బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. 10 మంది కన్ఫర్మ్!

Bigg Boss 8 Telugu Confirmed 10 Contestants List: తెలుగు ఆడియెన్స్, బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం అతి త్వరలోనే రానుంది. సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం కానుంది స్టార్ మా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

కంటెస్టెంట్స్ ఎవరు?

సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జున వ్యవహిరంచనున్నారు. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండంటంతో అందులో పార్టిస్‌పేట్ చేసే కంటెస్టెంట్ల ఎవరనే విషయం చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఇప్పటివరకు బిగ్ బాస్ 8 తెలుగులో చాలా మంది సెలబ్రిటీల పాల్గొనున్నట్లు పేర్లు వినిపించాయి. కానీ, తాజాగా బిగ్ బాస్ తెలుగు లేటెస్ట్ సీజన్‌లో పాల్గొనే పది మంది కంటెస్టెంట్ల వివరాలు లీక్ అయ్యాయి. ఈ సీజన్‌లో ఎంతమంది కంటెస్టెంట్స్‌తో గేమ్ ఆడిస్తారో తెలియదు గానీ, ఇప్పటివరకు అయితే ఈ పది మంది పేర్లు పక్కా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్‌లో పెద్దగా పేరు తెచ్చుకోని హీరోలు ఎంట్రీ ఇవ్వడం గత సీజన్స్‌లో చూశాం. అలాగే ఈ బిగ్ బాస్ తెలుగు 8లోకి టాలీవుడ్ హీరో ఆదిత్యం ఓం కంటెస్టెంట్‌గా రానున్నాడు. ఇక ఈ షోలో సీరియల్స్ బ్యాచ్ కూడా కచ్చితంగా ఉంటుందనేది తెలిసిన విషయమే. అలా ఈ సారి సీరియల్స్ యాక్టర్స్ కేటగిరీలో చక్రవాకం ఫేమ్ ఇంద్రనీల్, నిఖిల్ మలియక్కల్ రానున్నారు.

జబర్దస్త్ నుంచి ఇద్దరు

చక్రవాకం సీరియల్‌తో ఎంతో పాపులర్ అయ్యాడు ఇంద్రనీల్. ఆ తర్వాత పలు సీరియల్స్‌తోపాటు రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ సైతం ఇచ్చాడు. ఇక నిఖిల్ మలిక్కల్ 'అమ్మకు తెలియని కోయిలమ్మ' అనే సీరియల్‌లో హీరోగా చేశాడు. ఊటీ అనే సినిమాలో కూడా నటించాడు. అలాగే స్టార్ మాలో వచ్చిన నీతోనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నాడు నిఖిల్.

వీరితోపాటు హీరో అభిరామ్ వర్మ కూడా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి రానున్నట్లు సమాచారం. ఇతను నీతో అనే సినిమా చేశాడు. ఇక సింగర్ క్యాటగిరీలో సింగర్ సాకేత్ కొమండూరి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రతి బిగ్ బాస్ తెలుగు షోలో జబర్దస్త్ నుంచి ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారు. అలా ఈసారి ఈ సీజన్ 8కి జబర్దస్త్ రీతూ చౌదరి, యాంకర్ సౌమ్యరావు రానున్నట్లు సమాచారం.

అలాగే ప్రముఖ యూట్యూబర్ బెజవాడ బేబక్క కూడా బిగ్ బాస్ 8 తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె పలు విషయాలపై వీడియో కంటెంట్ చేస్తూ ఫేమస్ అయ్యారు. ఇటీవల నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్‌పై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌పై కూడా రియాక్ట్ అవుతూ బెజవాడ బేబక్క వీడియో చేశారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ

వీరితోపాటు మొగలిరేకులు సీరియల్ ఫేమ్ అంజలి పవన్ కూడా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి అడుగుపెట్టనుంది. అయితే, అంజలి పవన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రానున్నట్లు సమాచారం. హౌజ్‌లోకి కొంతమంది కంటెస్టెంట్స్‌ను పంపిన కొన్ని రోజులకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. అలా అంజలి పవన్ పాల్గొనుంది.

వీరితోపాటు కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో ఎంతగానో పాపులర్ అయిన యష్మీ గౌడ కూడా బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగుపెట్టనుంది. సీరియల్ విలనిజం పండించిన యష్మీ బిగ్ బాస్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇప్పటివరకు దాదాపుగా 99.99 శాతం పక్కాగా కన్ఫర్మ్ అయిన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌ కంటెస్టెంట్స్‌ వీళ్లే. ఈ పదిమంది కాకుండా ఇంకా ఎంతమందితో బిగ్ బాస్ 8 తెలుగు షోని నాగార్జున ఆడిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.