Sobhita: మూడేళ్లకే నాగ చైతన్య, శోభిత విడిపోతారు- ఒక స్త్రీ వల్లే గొడవలు- జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్స్ (వీడియో)-astrologer venu swamy prediction on naga chaitanya sobhita dhulipala marriage life over engagement and involves samantha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sobhita: మూడేళ్లకే నాగ చైతన్య, శోభిత విడిపోతారు- ఒక స్త్రీ వల్లే గొడవలు- జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్స్ (వీడియో)

Sobhita: మూడేళ్లకే నాగ చైతన్య, శోభిత విడిపోతారు- ఒక స్త్రీ వల్లే గొడవలు- జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్స్ (వీడియో)

Sanjiv Kumar HT Telugu
Aug 09, 2024 11:32 AM IST

Venu Swamy About Naga Chaitanya Sobhita Dhulipala Astrology: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితంలో మూడేళ్ల తర్వాత గొడవలు ప్రారంభం అవుతాయని సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా ఒక స్త్రీ కారణంగా విడిపోయే అవకాశం ఉందని చెప్పారు.

మూడేళ్లకే నాగ చైతన్య, శోభిత విడిపోతారు- ఒక స్త్రీ వల్లే గొడవలు- జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్స్ (వీడియో)
మూడేళ్లకే నాగ చైతన్య, శోభిత విడిపోతారు- ఒక స్త్రీ వల్లే గొడవలు- జ్యోతిష్యుడు వేణు స్వామి కామెంట్స్ (వీడియో)

Venu Swamy About Naga Chaitanya Sobhita Dhulipala: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో ఎంతగానో ట్రోలింగ్ జరిగింది. ఇదిలా ఉంటే, ఇదివరకు నాగ చైతన్య, సమంత జాతకం చెప్పిన సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ కొత్తజంటపై సంచలన కామెంట్స్ చేశారు.

నాగ చైతన్య శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ గురువారం (ఆగస్ట్ 8) ఉదయం 9.42 నిమిషాలకు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మధ్యాహ్నం సమయంలో నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే నాగ చైతన్య శోభిత ధూళిపాల వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తాను చెబుతానని వేణు స్వామి సంచలన పోస్ట్ పెట్టారు. అలా చెప్పినట్లుగానే ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్‌లో వీడియో రిలీజ్ చేశారు వేణు స్వామి.

ఈ వీడియోలో వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగాలేదని ఆయన చెప్పారు. అలాగే మూడేళ్ల తర్వాత చైతూ, శోభితకు ఒక స్త్రీ మూలంగా సమస్యలు, గొడవలు వస్తాయని తెలిపారు. వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముహుర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని, కచ్చితంగా విడిపోతారని వేణు స్వామి గట్టిగా చెప్పారు.

"నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ శోభిత ధూళిపాళతో జరిగినట్లు నాగార్జున గారు అధికారికంగా ప్రకటించారు. వారు నిశ్చితార్థం చేసుకున్న ముహుర్తం ఎలాంటి అది అని గల్లీ జ్యోతిష్యుడు కూడా చెప్పగలడు. వీరి నిశ్చితార్థం ఉత్తర నక్షత్రంలో జరిగింది. నాగ చైతన్య రాశి కర్కాటక రాశి. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి. నాగ చైతన్యకు 6, శోభితకు 8 వచ్చాయి. అయిపోయింది. ఇద్దరి జాతకాల్లో షష్టాకాలు వచ్చాయి" అని వేణు స్వామి అన్నారు.

"సమంత జాతకాన్ని, శోభిత జాతకాన్ని విశ్లేషిస్తే ఇద్దరి జాతకాల్లో శని దృష్టి కుజుడి మీద ఉంది. ఇక శోభిత జాతకంలో శని దృష్టి కుజుడి మీదే కాదు శుక్రుడు మీద, గురుడు మీద ఉంది. వీరి జాతకం ప్రకారం వీరికి 2027 నుంచి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. అంతవరకు బాగానే ఉంటారు. కానీ ఆ తర్వాత వీరి వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. వీరి సమస్యలకు ప్రధాన కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది" అని వేణు స్వామి చెప్పారు.

"వీరి జాతకాలు కలవకపోవడమే కాదు. వీరికి పెట్టిన నిశ్చితార్థ ముహుర్తం కూడా సరిగా లేదు. నాగ చైతన్య సమంతకు నేను 100కి 50 మార్కులు వేస్తాను. అదే నాగ చైతన్య శోభితకు 10 మార్కులు వేస్తాను. 50 మార్కులు వేసిన సమంత విషయంలో ఏం జరిగిందో చూశారు. శోభితకు 10 మార్కులే వేశాను అంటే ఆలోచించుకోండి. కెరీర్ పరంగా సమంత జాతకం 100 శాతం బాగుంది. కానీ శోభితా జాతకం కెరీర్ పరంగా 20 శాతమే బాగుంది" అని వేణు స్వామి వెల్లడించారు.

"నేను చెప్పేది తప్పుగా తీసుకోవద్దు. అందరూ బాగుండాలనేదే నా కోరిక. తెలిసి తెలిసి తప్పు చేసి సమస్యల్లో చిక్కుకోకూడదనే నేను చెబుతున్నాను. అఖిల్ ఎంగేజ్‌మెంట్ అప్పుడు కూడా చెప్పాను. అదే జరిగింది. నాగ చైతన్య, శోభిత కలిసి ఉండేందుకు ఆస్కారం లేదు. వీళ్లు కచ్చితంగా విడిపోతారు. అది కూడా ఒక స్త్రీ వల్ల విడిపోతారు. నేను చెప్పేది, నేను చెప్పిన జాతకం తప్పు కావాలని కూడా కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక" అని వేణు స్వామి తెలిపారు.