Manchu Lakshmi: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉన్నా.. 142 మందితో వాట్సాప్ గ్రూప్.. మంచు లక్ష్మీ కామెంట్స్-manchu lakshmi comments on staying in ram charan home at mumbai and whatsapp group with 142 cine industry artists ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manchu Lakshmi: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉన్నా.. 142 మందితో వాట్సాప్ గ్రూప్.. మంచు లక్ష్మీ కామెంట్స్

Manchu Lakshmi: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉన్నా.. 142 మందితో వాట్సాప్ గ్రూప్.. మంచు లక్ష్మీ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Manchu Lakshmi About Ram Charan Home: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో చాలా సీక్రెట్‌గా ఉండేదాన్నని మంచు లక్ష్మీ షాకింగ్ విషయాలు చెప్పింది. అలాగే తన నోరు ఆగదని, రామ్ చరణ్ ఇంట్లో ఉన్నది ఎవరికీ చెప్పొద్దని తానే చెప్పినట్లు పేర్కొంది. దీంతో ప్రస్తుతం మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉన్నా.. 142 మందితో వాట్సాప్ గ్రూప్.. మంచు లక్ష్మీ కామెంట్స్

Manchu Lakshmi About Ram Charan: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు లక్ష్మీ. విలన్‌గా చేసిన తొలి సినిమాతోనే నంది అవార్డ్ అందుకుని నటనలో తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే వాటిలో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఇటీవల యక్షిణి అనే తెలుగు హారర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్లేక్షకుల ముందుకు వచ్చారు మంచు లక్ష్మీ. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 6 ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ అవుతోన్న యక్షిణి వెబ్ సిరీసులో మంచు లక్ష్మీ జ్వాల పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే, తాజాగా తాను మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో చాలా సీక్రెట్‌గా ఉండాల్సి వచ్చిన విషయం తెలిపారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మీ ఆసక్తకిర విశేషాలు చెప్పారు. "ముంబైకి నేను షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండటానికి నాకు అపార్ట్‌మెంట్ అంటూ ఏది లేదు. దాంతో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ చెబితే మీరు రామ్ చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా.. మీకు పని చేయాల్సిన అవసరం ఏంటని అంటారు" అని మంచు లక్ష్మీ తెలిపారు.

"అందుకే నేను రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉన్నాను. నేను ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చరణ్‌కి కూడా చెప్పాను. దానికి అతను నేనెందుకు చెబుతాను అన్నాడు. కానీ, నా నోరు ఆగదు కదా. ఇప్పుడు నేనే చెప్పేశా. కానీ, అంత అందమైన ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్పలేదు. దీంతో నేను వెళ్లిపోతానని చెప్పాను. కానీ, నీకు నచ్చినన్నీ రోజులు నా ఇంట్లో ఉండమని చరణ్ చెప్పాడు. అలా ఎన్ని రోజులు ఉన్నానో కూడా చరణ్‌కి తెలీదు" అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.

అయితే, ముంబై రమ్మని తనను దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ చాలా సార్లు అడిగారని, ఇక్కడికి వచ్చిన వెంటనే అపార్ట్‌మెంట్ దొరక్కపోవడంతో కొన్నాళ్లపాటు రామ్ చరణ్ ఇంట్లో ఉండాల్సి వచ్చిందని మంచు లక్ష్మీ అసలు విషయం తెలిపారు. అలాగే సినీ ఇండస్ట్రీలోని 142 మంది ఆర్టిస్టులతో ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని కూడా మంచు లక్ష్మీ చెప్పారు.

ఆ వాట్సాప్ గ్రూప్‌లో రామ్ చరణ్, రానా దగ్గుబాటితోపాటు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, తమ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు ఆ గ్రూప్‌లో షేర్ చేస్తుంటారని, అలా అందరూ తమ పర్సనల్ అకౌంట్స్‌లో సినిమాలను షేర్ చేస్తూ ప్రమోట్ చేస్తుంటామని మంచు లక్ష్మీ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో తనదైన మాట తీరుతో హడలు పుట్టించే మంచు లక్ష్మీ నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. విలన్‌గా, హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించి తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. తన తొలి సినిమా అనగనగా ఓ ధీరుడులో ఐరేంద్రి వంటి పవర్ ఫుల్ రోల్ చేసి ఆకట్టుకున్నారు.