Maharaja: విలన్ కాళ్లు పట్టుకున్న రామ్ చరణ్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్-ram charan rc16 director buchi babu sana touches vijay sethupathi feet over maharaja movie success event video viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maharaja: విలన్ కాళ్లు పట్టుకున్న రామ్ చరణ్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్

Maharaja: విలన్ కాళ్లు పట్టుకున్న రామ్ చరణ్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu
Jun 19, 2024 10:22 AM IST

Buchi Babu Sana Touches Vijay Sethupathi Feet: ఉప్పెన సినిమాలో విలన్‌గా చేసిన హీరో విజయ్ సేతుపతి కాళ్లు పట్టుకుని నమస్కరించాడు రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో జోరుగా వైరల్ అవుతోంది. మరి ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

విలన్ కాళ్లు పట్టుకున్న రామ్ చరణ్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్
విలన్ కాళ్లు పట్టుకున్న రామ్ చరణ్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్

Maharaja Buchi Babu Vijay Sethupathi: సినీ ఇండస్ట్రీలో ఒకరి మీద మరొకరికి ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అభిమానం పలు విధాలుగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకుంటారు. అందుకు మంచి ఉదాహరణే ఇటీవల విలన్ కాళ్లు పట్టుకున్న రామ్ చరణ్ డైరెక్టర్ సంఘటన.

ఆ విలన్ ఎవరో కాదు హీరో విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో విలన్‌గా తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఈ ఒక్క సినిమానే కాకుండా విక్రమ్, మాస్టర్ చిత్రాల్లో కూడా తనదైన విలనిజంతో అలరించాడు. ఇక విజయ్ సేతుపతి కాళ్లు పట్టుకుని నమస్కారం చేసింది ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సాన.

అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఇటీవల జూన్ 14న విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ మహారాజా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో విజయ్ సేతుపతి జోరుగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే మహారాజా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా రామ్ చరణ్‌తో RC16 తెరకెక్కిస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు సాన కూడా హాజరయ్యారు.

ఈవెంట్ బయట విజయ్ సేతుపతిని చూసిన బుచ్చిబాబు మక్కల్ సెల్వన్ కాళ్లు పట్టుకుని నమస్కరించాడు. తర్వాత చాలా ప్రేమగా ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, కృతి శెట్టి, పంజా వైష్ణవ్ తేజ్ తొలి పరిచయంగా వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర హైలెట్ అయిన విషయం తెలిసిందే.

ఆ సినిమాను కేవలం బుచ్చిబాబుకు ఉన్న ప్యాషన్, నమ్మకంతోనే తాను నటించేందుకు ఒప్పుకున్నట్లు, అందుకే రెమ్యునరేషన్ కూడా తక్కువ తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి తెలిపాడు. తనపై నమ్మకంతో తక్కువ పారితోషికంతో సినిమా ఒప్పుకున్న విజయ్ సేతుపతి మీదున్న ప్రేమతో, అభిమానంతో బుచ్చిబాబు అలా పాదాలకు నమస్కరించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయం అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఇదిలా ఉంటే, ఇటీవలే మహారాజా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు గురించి విజయ్ సేతుపతి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "బుచ్చి నా యంగర్ బ్రదర్ లాంటి వాడు. ఉప్పెన లాంటి మంచి సినిమా తీశాడు. ఇప్పుడు రామ్ చరణ్ గారితో సినిమా చేస్తున్నాడు. తను ఇక్కడకి రావడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. మహరాజకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థాంక్స్. లవ్ యూ ఆల్" అని విజయ్ సేతుపతి తెలిపారు.

అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ.. "ఈ సినిమా చూసి ఫస్ట్ గూగుల్‌లో ఈ డైరెక్టర్ ఎలా ఉంటారని సెర్చ్ చేశా. చాలా డేరింగ్ క్లైమాక్స్. ఈ సినిమా గురించి ఏం చెప్పినా ఎక్స్‌పీరియన్స్ పాడైపోతుంది. ఇందులో ప్రతి సీన్ అద్భుతం. విజయ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన హీరో అంతే. ఆయన ఇలాంటి సినిమాలే చేయాలనే కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్టు. ఏ రేంజ్‌కి వెళ్లి ఆగుతుందో చెప్పలేం. టీం అందరికీ ఆల్ ది బెస్ట్" అని చెప్పుకొచ్చారు.

WhatsApp channel