Chandu Champion Collection: బయోపిక్ సినిమాకు దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. 120 కోట్లకు వచ్చింది ఎంతంటే?-sports biopic movie chandu champion 4 days worldwide box office collection kartik aaryan chandu champion collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandu Champion Collection: బయోపిక్ సినిమాకు దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. 120 కోట్లకు వచ్చింది ఎంతంటే?

Chandu Champion Collection: బయోపిక్ సినిమాకు దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. 120 కోట్లకు వచ్చింది ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu

Chandu Champion 4 Days Collection: స్పోర్ట్స్ బయోపిక్ డ్రామాగా వచ్చిన చందు ఛాంపియన్ సినిమాకు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ సినిమాకు 4 రోజుల్లో వచ్చిన వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తే..

బయోపిక్ సినిమాకు దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. 120 కోట్లకు వచ్చింది ఎంతంటే?

Chandu Champion Box Office Collection: కార్తీక్ ఆర్యన్ నటించిన స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా చందు ఛాంపియన్ సినిమాకు విడుదలైన మొదటి సోమవారం వసూళ్లు పడిపోయాయి. ప్రముఖ ట్రేడ్ సంస్థ Sacnilk.com లెక్కల ప్రకారం ఈ చిత్రం నాలుగో రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూలు చేసింది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన చందు ఛాంపియన్ చిత్రానికి మొదటి రోజు రూ. 4.75 కోట్లు, రెండో రోజు రూ.7 కోట్లు, మూడో రోజు రూ.9.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. తొలి అంచనాల ప్రకారం చందు ఛాంపియన్ నాలుగో రోజు ఇండియాలో దాదాపు రూ. 4.75 కోట్లు వసూలు చేసింది. దీంతో చూసుకుంటే ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 26.25 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది.

అలాగే, చందు ఛాంపియన్ సినిమాకు ఓవర్సీస్ నుంచి నాలుగు రోజుల్లో రూ. 7.4 కోట్లు సాధించగలిగింది. ఇక చందు ఛాంపియన్ మూవీ నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 33 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో చూస్తే.. రూ. 120 కోట్ల బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన ఈ సినిమాకు నాలుగో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. చందు ఛాంపియన్ సోమవారం మొత్తం 20.67% హిందీ ఆక్యుపెన్సీని మాత్రమే సాధించింది. అంతకుముందు రోజుల ఆక్యుపెన్సీతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇదిలా ఉంటే, ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్‌లో భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పెట్కర్ జీవితం నుంచి ప్రేరణ పొంది ఈ స్పోర్ట్స్ డ్రామాను రూపొందించారు.

చందు ఛాంపియన్ ఒక దృఢమైన అథ్లెట్ స్ఫూర్తిదాయక కథను చెబుతుంది. ఈ సినిమాలో చందు పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటించాడు. విజయ్ రాజ్, భువన్ అరోరా, రాజ్పాల్ యాదవ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ దిగ్గజ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా బ్యానర్, నదియాడ్ వాలా గ్రాండ్సన్ ఎంటర్ టైన్ మెంట్, కబీర్ ఖాన్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

అయితే, చందు ఛాంపియన్ సినిమాలో కార్తీక్ ఆరన్ నటనకు మంచి అప్లాజ్ వస్తోంది. అభిమానుల నుంచి విమర్శకులు, సినీ పరిశ్రమ సభ్యులు, ప్రేక్షకుల వరకు కార్తీక్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి షబానా ఆజ్మీ కూడా కార్తీక్‌ నటనపై ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమా ప్రదర్శనలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షబానా షేర్ చేశారు. కబీర్ ఖాన తెరకెక్కించిన ఈ సినిమా తనను ఎంతగానో కదిలించిందని, కార్తీక్ ఆర్యన్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని షబానా పేర్కొంది. ఈ ఫొటోలో కార్తీక్ చెంపపై ముద్దు పెడుతూ తన ప్రేమను వ్యక్తపరిచింది షబానా అజ్మీ.