Chandu Champion Collection: 120 కోట్ల బయోపిక్ మూవీకి ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?-chandu champion day 1 worldwide box office collection kabir khan kartik aaryan sports biopic drama of murlikant petkar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandu Champion Collection: 120 కోట్ల బయోపిక్ మూవీకి ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Chandu Champion Collection: 120 కోట్ల బయోపిక్ మూవీకి ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 15, 2024 01:00 PM IST

Chandu Champion Box Office Collection Day 1: భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ మురళీకాంత్ పెట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా చందు ఛాంపియన్. కార్తీక్ ఆర్యన్ మెయిన్ లీడ్ రోల్ చేసిన చందు ఛాంపియన్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

120 కోట్ల బయోపిక్ మూవీకి ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
120 కోట్ల బయోపిక్ మూవీకి ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Chandu Champion Box Office Collection: బయోపిక్ సినిమాలకు (Biopic Movies) ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా స్పోర్ట్స్ ఆధారితా బయోపిక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అలా తాజాగా థియేటర్లలోకి వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా సినిమానే చందు ఛాంపియన్ (Chandu Champion Movie). బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ మెయిన్ లీడ్ రోల్ చేసిన చందు ఛాంపియన్ సినిమా జూన్ 14న థియేటర్లలో విడుదలైంది.

yearly horoscope entry point

చందు ఛాంపియన్ డే 1 కలెక్షన్స్

చందు ఛాంపియన్ సినిమాకు మొదటి షో నుంచే మంచి పాజిటివ్ రివ్యూస్, మౌత్ టాక్ వచ్చింది. అయితే, సినిమాకు మాత్రం కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ప్రారంభమయ్యాయి. ప్రముఖ ట్రేడ్ సంస్థ Sacnilk.com గణాంకాల ప్రకారం ఈ బయోపిక్ స్పోర్ట్స్ డ్రామా రూ. 4.75 కోట్ల కలెక్షన్లతో ప్రారంభమైంది. తొలి రోజున చిత్రానికి సుమారుగా 5 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.

చందు ఛాంపియన్ ఆక్యుపెన్సీ

ఇక సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికొస్తే.. జైపూర్‌లో అత్యధికంగా 25.50 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, చెన్నైలో 21 శాతం, ఢిల్లీ, ముంబైలో 19 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. బెంగళూరు, లక్నో, చండీగఢ్, పుణె, కోల్‌కతా వంటి నగరాల్లో 12-17 శాతం మధ్య ఆక్యుపెన్సీని చందు ఛాంపియన్ సినిమా నమోదు చేసుకుంది.

చందు ఛాంపియన్ బడ్జెట్

అయితే, రూ. 120 కోట్ల బడ్జెట్ (Chandu Champion Budget) పెట్టిన చందు ఛాంపియన్ సినిమాకు తొలిరోజు 5 లోపు కలెక్షన్స్ రావడం నిరాశనే చెప్పుకోవాలి. సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ తొలి రోజు కావడంతో కలెక్షన్స్ అంతగా రావట్లేదు. టాక్ పరంగా ముందు ముందు ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది.

మురళీకాంత్ పెట్కర్ బయోపిక్

కాగా ఈ సినిమా పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలిసారిగా స్వర్ణ పతకం (Paralympics Indian First Gold Medalist) సాధించి తెచ్చిన విజేత మురళీకాంత్ పెట్కర్ (Murlikant Petkar) జీవితం కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ స్పోర్ట్స్ బయోపిక్ (Sports Biopic Drama) డ్రామాకు పాపులర్ డైరెక్టర్ కబీర్ ఖాన్ (Kabeer Khan) రచన, దర్శకత్వం వహించారు. సుమిత్ అరోరా, సుదీప్తో సర్కార్ రచన సహాకారం అందించారు. ఈ చిత్రాన్ని సాజిద్ నదియాడ్‌వాలా, కబీర్ ఖాన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.

కార్తీక్ ఆర్యన్ నటనకు ప్రశంసలు

ఇక చందు ఛాంపియన్ సినిమాను లండన్, వాయి, జమ్ముకశ్మీర్‌లలో చిత్రీకరించారు. ఈ సినిమాలో మురళీకాంత్ పెట్కర్ పాత్రలో నటించిన కార్తీక్ ఆర్యన్ (Kartik Aryan) నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా కోసం తన బాడీని చాలానే కష్టపెట్టాడు కార్తీక్ ఆర్యన్.

Whats_app_banner