Guppedantha Manasu Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లోకి గుప్పెడంత మనసు రిషి, వసుధార! అందుకే సీరియల్‌ అర్ధాంతర ముగింపు?-guppedantha manasu rishi vasudhara into bigg boss show mukesh gowda bigg boss kannada 11 raksha gowda bigg boss 8 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లోకి గుప్పెడంత మనసు రిషి, వసుధార! అందుకే సీరియల్‌ అర్ధాంతర ముగింపు?

Guppedantha Manasu Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌లోకి గుప్పెడంత మనసు రిషి, వసుధార! అందుకే సీరియల్‌ అర్ధాంతర ముగింపు?

Sanjiv Kumar HT Telugu
Aug 16, 2024 02:42 PM IST

Guppedantha Manasu Mukesh Gowda Raksha Gowda Bigg Boss: గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి, వసుధార పాత్రధారులైన ముఖేష్ గౌడ, రక్ష గౌడ బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. వీరు బిగ్ బాస్‌లోకి వెళ్తున్నందు వల్లే సీరియల్‌ను అర్ధాంత్రగా ఆపేస్తున్నారని చర్చ నడుస్తోంది.

 బిగ్ బాస్‌లోకి గుప్పెడంత మనసు రిషి, వసుధార! అందుకే సీరియల్‌ అర్ధాంతర ముగింపు?
బిగ్ బాస్‌లోకి గుప్పెడంత మనసు రిషి, వసుధార! అందుకే సీరియల్‌ అర్ధాంతర ముగింపు?

Mukesh Gowda Raksha Gowda In Bigg Boss: స్టార్ మా ఛానెల్‌లో వస్తున్న ప్రముఖ పాపులర్ సీరియల్స్‌లో గుప్పెడంత మనసు ఒకటి. గుప్పెడంత మనసు సీరియల్‌లో హీరో హీరోయిన్లు అయినా రిషి, వసుధార పాత్రలు ఎంతగానో ప్రేక్షకులను అలరించాయి. అంతేకాకుండా వారికి ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టాయి.

రిషి రీ ఎంట్రీతో

రిషి, వసుధార పాత్రలే కాకుండా జగతి, మహేంద్ర పాత్రలను సైతం తెలుగు ఆడియెన్స్‌ ఎంతో అక్కున చేర్చుకున్నారు. రిషి, వసుధారలుగా ముఖేష్ గౌడ, రక్ష గౌడ ఎంతో పాపులర్ అయ్యారు. ఇటీవల రిషి క్యారెక్టర్ చనిపోయినట్లు చూపించి మళ్లీ రంగా అనే కొత్త పాత్రతో ముఖేష్ గౌడ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తానే రిషినని క్లారిటీ ఇచ్చి సీరియల్‌ను ఇంట్రెస్టింగ్‌గా కొనసాగించారు.

గుప్పెడంత మనసు లాస్ట్ ఎపిసోడ్

అయితే, ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ ముగింపు దశకు చేరుకుందని టాక్ నడుస్తోంది. ఇటీవల ఈ సీరియల్ చివరి రోజు షూటింగ్ కంప్లీట్ అయిందన్న మీనింగ్ వచ్చేలా నటుడు, మహేంద్ర పాత్ర చేసిన సాయి కిరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో "గుప్పెడంత మనసు మెమొరబుల్ డే 11 ఆగస్ట్ 2024" అని రాసి ఉన్న షీల్డ్‌ ఫొటోను షేర్ చేశారు సాయి కిరణ్.

వచ్చే వారంలో

ఆ ఫొటో షేర్ చేస్తూ "ఇవాళ గుప్పెడంత మనసు ప్యాక్‌డప్. మీరెలా ఫీల్ అవుతున్నారు" అని సాయి కిరణ్ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ పూర్తి కావొస్తుందని జోరుగా టాక్ నడుస్తోంది. ఇది సాయి కిరణ్‌తో షూటింగ్ లాస్ట్ డేట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం సీరియల్ సాగే తీరు చూస్తుంటే మాత్రం వచ్చే వారంలో గుప్పెడంత మనసు అయిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిగ్ బాస్‌లోకి రిషి, వసుధార

ఇక ఇదిలా ఉంటే, బిగ్ బాస్‌లోకి గుప్పెడంత మనసు సీరియల్‌లోని రిషి, వసుధార అయిన ముఖేష్ గౌడ, రక్షగౌడ ఎంట్రీ ఇస్తున్నారనే మరో వార్త రచ్చ చేస్తోంది. సీరియల్‌ను ఇంకా కొనసాగించేందుకు స్కోప్ ఉన్న బిగ్ బాస్‌లోకి మెయిన్ పాత్రలైన ముఖేష్ గౌడ, రక్ష గౌడ అడుగుపెట్టనుండటంతోనే గుప్పెండత మనసును అర్థాంతరంగా ముగిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ కన్నడకు ముఖేష్ గౌడ

బిగ్ బాస్ షో కొత్త సీజన్ ఇటు తెలుగుతోపాటు అటు కన్నడలోనూ ప్రసారం కానుంది. బిగ్ బాస్ కన్నడ 11వ సీజన్‌లోకి ముఖేష్ గౌడ ఎంట్రీ ఇస్తున్నాడని సమాచారం. అలాగే, బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి వసుధార అలియాస్ రక్ష గౌడ అడుగుపెట్టనుందని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

మరికొన్ని రోజుల్లో

అయితే, వీటిలో నిజం ఎంత ఉందనే విషయంపై క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. వారిలో ముఖేష్ గౌడ, రక్ష గౌడ ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే గుప్పెడంత మనసు సీరియల్ నిజంగానే పూర్తి కానుందా.. లేదా మరైలాగైనా ప్లాన్ చేస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.