Guppedantha Manasu August 12th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రకు రిషి ఎదురుదెబ్బ- సరోజ కొత్త ప్లాన్- వసుధార కాచుకోమంటూ
Guppedantha Manasu Serial August 12th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌లో ఎండీగా తననే ప్రకటిస్తున్నావని రంగాతో శైలేంద్ర అంటాడు. మరోవైపు వసుధారను కాచుకోమని హైదరాబాద్‌కు సరోజ వస్తుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో వసుధార ఎండీగా రిజైన్ చేసి వెళ్లాక కాలేజీలో ఏం జరిగిందే వసుధారకు చెబుతాడు మహేంద్ర. నువ్ వెళ్లాక అల్లర్లు మొదలు అయ్యాయి. శైలేంద్ర ఎత్తులకు పయ్యెత్తులు వేసి కాలేజీని చేజిక్కుంచుకుందామని అనుకున్నాడు అని మహేంద్ర అంటాడు.
నెంబర్ వన్ స్థానంలో
మనుకు ఎండీ బాధ్యతలు ఇద్దామని మినిస్టర్ గారు చెప్పారు. కానీ, తనకు ఎండీ పదవి ఇష్టంలేదని మను వెళ్లిపోయాడు. మళ్లీ ఇప్పుడు రిషి తిరిగి వచ్చాడు. ఇప్పుడు స్టూడెంట్స్, కాలేజ్ స్టాఫ్ సంతోషంగా ఉన్నారు. ఇక కాలేజీకి ఎలాంటి సమస్యలు రావు అని మహేంద్ర అంటాడు. అవును మావయ్య.. రిషి సార్ అంతా చూసుకుంటారు. మళ్లీ ఎప్పటిలాగా కాలేజ్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అని వసుధార అంటుంది.
మావయ్య మీకో విషయం చెప్పాలి. నేను ఎండీగా ఉండను అని వసుధార అంటుంది. అది విన్న రిషి వసుధార.. ఏంటి అలా అంటున్నావ్ అని అడుగుతాడు. మావయ్య అనుకుంటారను ముందే నా నిర్ణయం చెబుతున్నాను. నేను ఓసారి ఎండీగా రిజైన్ చేశాను. నేను ఎండీగా ఉండను. ఇది నా నిర్ణయం అని వసుధార వెళ్లిపోతుంది. తర్వాత కాసేపటికి వసుధార దగ్గరకు వెళ్లిన రిషి నీ నిర్ణయం మానుకోవా. నేను అడిగినా అనుకోవా అని అంటాడు.
మీకోసమే వద్దంటున్నా
క్షమించండి సార్. నేను నా నిర్ణయం మార్చుకోను. నా భయాలు నాకు ఉన్నాయని వసుధార అంటుంది. ఏంటీ పొగరుకు భయమా అని రాజీవ్ పెళ్లి విషయంలో ధైర్యంగా ఉన్న విషయాన్ని, తాను చనిపోయినట్లు అంతా నమ్మిన నువ్ నమ్మలేదని, నేను రంగా అంటున్నా నీ కళ్లల్లో ఎలాంటి భయం, బెరుకు చూల్లేదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడలేదు అని గుర్తు చేస్తాడు రిషి. మీకోసమే ఎండీ పదవి వద్దంటున్నాను. నాకు పదవి ఇచ్చి మీరు వెళ్లిపోతారేమో అని నా భయం అని వసుధార అంటుంది.
మీరు నా పక్కనే ఉండండి. అదే నా ధైర్యం. మీరు ఒక్క క్షణం దూరమైన నా గుండె ఆగిపోతుందని వసుధార అంటుంది. ఇకనుంచి నీ కళ్లలో ఒక్క కన్నీటి చుక్క రాకుండా చూసుకుంటాను అని, వసుధారను వదిలిపెట్టి వెళ్లను అని రిషి అంటాడు. మీరు నాకు ఒక మాట ఇవ్వండి. మీ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కాదనని అని మాట ఇవ్వండి అని వసుధార అడుగుతుంది. సరే మాటిస్తున్నాను. నీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. ఇంతకీ నీ నిర్ణయం ఏంటని రిషి అంటాడు.
హ్యాండ్సమ్‌గా ఉంటారు
టైమ్ వచ్చినప్పుడు చెబుతాను సార్ అని వసుధార అంటుంది. ఇద్దరూ ప్రేమగా హగ్ చేసుకుంటారు. తర్వాత ధన్‌రాజ్‌కు సరోజ కాల్ చేస్తుంది. దాంతో సంతోషంతో షాక్ అవుతాడు ధన్‌రాజ్. నేను మీతో మాట్లాడాలని కాల్ చేశాను. మీరు మా ఊరు చూశారు. నేను మీ ఊరు చూడొద్దా. మిమ్మల్ని చూసింది ఒక్కసారే. మీరు హ్యాండ్సమ్‌గా ఉన్నారు కానీ, మీ మనసు తెలుసుకోవద్దా. అలాగే మీ అలవాట్లు తెలుసుకోవాలి. మీతో ఐస్‌క్రీమ్‌కు వెళ్లడం, షాపింగ్‌కు వెళ్లడంతో తెలుసుకుంటాను అని సరోజ అంటుంది.
ఓకే ఓకే నువ్ హైదరాబాద్ వచ్చి కాల్ చేయి అంతా నేను చూసుకుంటాను అని సంతోషంగా ఫోన్ పెట్టేస్తాడు ధన్‌రాజ్. ప్లాన్ సక్సెస్. ఎలాగైనా బావను కలవాలి. లేకుంటే వసుధార బావను మాయం చేస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఎలాగైనా బావను ఇంటికి తీసుకురావాలి. లేదంటే నేను అక్కడే ఉండాలి. ఊరికి తిరిగి రాకూడదు. వసుధార వస్తున్నాను చూడు. రేపు తెలుస్తుంది ఈ సరోజ అంటే ఏంటని సరోజ అనుకుంటుంది.
నన్ను వదిలేరా లేరు
మరోవైపు రంగాకు శైలేంద్ర కాల్ చేస్తాడు. నువ్ నిజంగానే రంగావా. లేదు రిషిలా మాట్లాడుతేను అని శైలేంద్ర అంటాడు. క్యారెక్టర్‌లో ఉన్నాను కదా అని రంగా అంటాడు. నువ్వెక్కడ ఉన్నావ్ అని శైలేంద్ర అంటాడు. నీ భయం అర్థమవుతుంది అన్నయ్య. నేను ఇక్కడి నుంచి ఇటే మా ఊరికి వెళ్లిపోతాను అనుకుంటున్నారు కదా. వీళ్లు నన్ను వదిలేలా లేరు. ఈ రిషి గాడి భార్య అయితే నన్ను ఓ కంట కనిపెడుతుంది. నన్ను వీళ్లు రిషిలా మార్చేలా ఉన్నారు అని రంగా అంటాడు.
నువ్ రిషిలా ఉందామని ఫిక్స్ అయిపోయావా అని శైలేంద్ర అడుగుతాడు. ఛీ ఛీ.. నాకు నా వాళ్లు ఉన్నారు. మా నానమ్మ నాకోసం బెంగపెట్టుకుందట. ఇంకా నటించడం నావల్ల కావట్లేదు. ఓపిక నశించింది అని రిషి అంటాడు. ఇంకా మూడు రోజులే. నీ పని అయిపోయాకా నిన్ను దగ్గరుండి పంపించేస్తాను అని శైలేంద్ర అంటాడు. నీమీద నమ్మకం ఉంది కాబట్టే వీళ్లు నరకం చూపిస్తున్న భరిస్తున్నాను అని రంగా అంటాడు.
నన్నే ఎండీగా ప్రకటిస్తున్నావ్
ఇంతకీ రేపు ఏం చేస్తావ్ అని శైలేంద్ర అంటాడు. రేపు ఎండీని ప్రకటిస్తాను. అర్హత ఉన్నవాళ్లను ప్రకటిస్తాను అని రిషి అంటాడు. అర్హత ఏంట్రా అర్హత. నేను చెబుతుంది ఏంటీ.. నువ్ మాట్లాడేది ఏంటీ.. వసుధార వచ్చిందా. అందుకే నువ్ ఇలా మాట్లాడుతున్నావ్. రేపు అర్హత ఉన్న నన్నే ఎండీగా ప్రకటిస్తున్నావ్ అని శైలేంద్ర కాల్ కట్ చేస్తాడు. మరోవైపు మహేంద్ర ఇంటికి అనుపమ వస్తుంది. మహేంద్ర సంతోషిస్తాడు. మను ఎలా ఉన్నాడు అని అడుగుతాడు మహేంద్ర.
బాగున్నాడు అని అనుపమ చెబుతుంది. రిషి, వసుధారను మహేంద్ర పిలిస్తే వాళ్లు వస్తారు. కుశలప్రశ్నలు వేసుకుంటారు. మా డాడ్ బాధలో ఉన్నప్పుడు మీరే ధైర్యం చెబుతూ వచ్చారు. తనకోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. థ్యాంక్స్ అని చెబుతాడు రిషి. మీరు మా అమ్మ డాడ్‌కు కలిపారు. అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డారు అని జరిగినవి గుర్తు చేస్తాడు రిషి.
పదిలంగా ఉంది
జగతిని తను ఎంత ద్వేషించేవాడో, తనే తన అమ్మ అని తెలిసినప్పుడు ఎంతో సంతోషించాడో చెబుతాడు రిషి. అమ్మను నోరారా అమ్మ అని పిలవాలని ఉండేదని చెబుతాడు. అన్ని ఎమోషన్స్ పంచుకోవాలని ఉండేదని చెబుతాడు రిషి. కానీ, నా పంతం నాకు అమ్మకు అడ్డుగా నిలిచిందని అంటాడు. ఇప్పుడు మా అమ్మ లేదు. ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. నా గుండెల్లో పదిలంగా ఉంది మా అమ్మ అని రిషి ఎమోషనల్‌గా చెబుతాడు. మహేంద్ర ఓదార్చుతాడు.
ఇప్పుడు నేను తిరిగి వచ్చాను. అన్నింటికి సాల్వ్ చేస్తాను. మా అమ్మ చావుకు కారణమైన వారిని పట్టుకుంటాను. ఆ హంతకులను పట్టుకునే ప్రాసెస్‌లో ఉన్నాను. అతి త్వరలోనే సాక్ష్యాధారలతో వాళ్లను మీ కళ్లముందు నిలబెడతాను. కానీ, నాకు ఏం కాదు. దెబ్బతిన్న వాన్ని ఎదురుదెబ్బ తీయడం నాకు తెలుసు అని రిషి అంటాడు. మహేంద్ర నామీద కోపంగా లేదా అని అడిగితే లేదని చెబుతాడు. పైగా జాలి వేస్తుంది. కొంతమంది జీవితాలను ఏం చేయలేమని మహేంద్ర అంటాడు.
ఇద్దరు కొడుకులు
మేడమ్.. మావయ్యకు ఇద్దరు కొడుకులు అన్న నిజం బయటపడే సమయం వస్తుందనిపిస్తుంది. ఇక ఆ నిజం బయటపడక తప్పదు. మీరు కంగారుపడద్దు. నేను ఆ విషయం చెప్పను అని వసుధార మెల్లిగా అనుపమతో అంటుంది. మీరు మీరే మాట్లాడుకుంటున్నారు. మాకు చెబితే వింటాం కదా. పర్సనల్ అయితే వదిలేయండి అని మహేంద్ర అంటాడు. చాలా బాగా అర్థం చేసుకుంటారు మావయ్య అని వసుధార అంటుంది. తర్వాత రిషి, వసుధారకు జాగ్రత్తలు చెప్పి అనుపమ వెళ్లిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.