Guppedantha Manasu Rishi: రిషి ఈజ్ బ్యాక్ - గుప్పెడంత మనసులోకి రీఎంట్రీ ఇస్తోన్న ముఖేష్ గౌడ - స్టార్ మా క్లారిటీ
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్‌కు స్టార్ మా గుడ్‌న్యూస్ వినిపించింది. రిషి అలియాస్ ముఖేష్ గౌడ సీరియల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చింది. సర్‌ప్రైజ్ అలెర్ట్ పేరుతో స్టార్ మా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు సీరియల్‌కు రిషి అలియాస్ ముఖేష్ గౌడ దూరమై చాలా కాలమైంది. రిషి లేకుండానే మేకర్స్ ఈ సీరియల్‌ను రన్ చేస్తున్నారు. సీరియల్‌లో రిషి చనిపోయాడా? బతికున్నాడా? అన్నది సస్పెన్స్‌లో పెడుతూ చాలా రోజులుగా సీరియల్‌ను నెట్టుకొస్తున్నారు. రిషి మిస్సయిన వెంటనే మను క్యారెక్టర్‌ను స్క్రీన్‌పైకి తీసుకొచ్చి....తండ్రి సెంటిమెంట్‌తో లాగించేస్తున్నారు.
రిషి, వసుధార కెమిస్ట్రీ...
గుప్పెడంత మనసుకు తెలుగు ఆడియెన్స్‌లో ఫాలోయింగ్ పెరగడానికి రిషి ఓ కారణం. రిషి, వసుధార కెమిస్ట్రీ ఈ సీరియల్‌కు హైలైట్ అయ్యింది, ఒక్కసారిగా రిషి దూరమవ్వడంతో సీరియల్ చప్పగా మారిపోయింది. రిషి లేకుండా వసుధార క్యారెక్టర్ కూడా తేలిపోయిన ఫీలింగ్ కలుగుతోందని సీరియల్ ఫ్యాన్స్ చెబుతోన్నారు. రిషి రీఎంట్రీ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
స్టార్ మా సర్‌ప్రైజ్ అలెర్ట్...
రిషి రీఎంట్రీపై స్టార్ మా క్లారిటీ ఇచ్చేసింది. త్వరలోనే రిషి అలియాస్ ముఖేష్ గౌడ సీరియల్‌లోకి తిరిగి అడుగుపెట్టబోతున్నట్లు చెప్పకనే చెప్పింది. సర్‌ప్రైజ్ అలెర్ట్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ మా ఓ పోస్ట్ పెట్టింది. అతడు ఓ కాలేజీకి యంగ్ అండ్ డైనమిక్ ఎండీగా పనిచేస్తోన్నాడు. భార్యతో పాటు కుటుంబసభ్యులు, స్టూడెంట్స్ అమితంగా ఆరాధించే... ప్రేమించే ఆ ఎండీ కొన్నాళ్లుగా కనిపించడం లేదు. అతడి రీఎంట్రీ కోసం ప్రతి ఒక్కరూ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అతడు ఎవరో చెప్పుకొండి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. స్టార్ మా పెట్టిన పోస్ట్‌కు ముఖేష్ గౌడ (రిషి) కూడా రియాక్ట్ అయ్యాడు ఎనీ క్లూ అంటూ రిప్లై ఇచ్చాడు.
సీరియస్ సింహం రిషి...
రిషి గురించే స్టార్ మా ఈ పోస్ట్ పెట్టిందని అభిమానులకు ఈజీగా అర్థమైపోయింది. యాంగ్రీ యంగ్‌మన్, సీరియస్ సింహం రిషి అంటూ స్టార్ మా పెట్టిన పోస్ట్‌పై అభిమానులు రిప్లై ఇస్తున్నారు. రిషి రీఎంట్రీ కోసం తాము వెయింటింగ్ చేస్తున్నట్లు అభిమానులు పేర్కొన్నారు. సర్‌ప్రైజ్ అదిరిపోయిందంటూ స్టార్ మా పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో రావడం మాత్రం పక్కా అంటూ ఓ సీరియల్ ఫ్యాన్ కామెంట్ చేశాడు. రిషిని ఇన్నాళ్లు చాలా మిస్సయ్యామని, అతడు రీఎంట్రీ ఇవ్వబోతుండటం హ్యాపీగా ఉందని మరికొందరు ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
మహేంద్ర కూడా హింట్...
గుప్పెడంత మనసులో రిషి తండ్రిగా నటిస్తోన్న మహేంద్ర (సాయికిరణ్) కూడా రిషి రీఎంట్రీపై ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో మాట్లాడుతూ రిషిని చాలా మిస్సవుతున్నానని అన్నాడు. సాయికిరణ్ పోస్ట్‌ఫై రిషి (ముఖేష్ గౌడ) కూడా రియాక్ట్ అయ్యాడు. నేను కూడా మిమ్మల్ని మిస్సవుతున్నానంటూ రిప్లై ఇచ్చాడు. రిషి, మహేంద్ర పోస్ట్‌లు చూస్తుంటే త్వరలోనే వీరిద్దరు మళ్లీ స్క్రీన్‌పై కలిసి కనిపించబోతున్నట్లు తెలుస్తోందని అభిమానులు చెబుతోన్నారు.
హీరోగా ఎంట్రీ...
ఓ ప్రమాదంలో గాయపడటంతో గుప్పెడంత మనసు సీరియల్‌కు ఐదు నెలల పాటు రిషి దూరంగా ఉన్నట్లు సమాచారం. గాయం నుంచిపూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. తొందరలోనే అతడు మళ్లీ గుప్పెడంత మనసు సీరియల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. అతడి రీఎంట్రీ ఎపిసోడ్‌ను సర్‌ప్రైజింగ్‌గా ప్లాన్ చేస్తోన్నట్లు తెలిసింది. హీరోగా కూడా సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టేందుకు ముఖేష్ గౌడ సిద్ధమవుతోన్నాడు. గీతాశంకరం పేరుతో తెలుగులో ఓ సినిమా చేస్తోన్నాడు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.