Bigg Boss Telugu 8 Voting: బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో లేడి కంటెస్టెంట్ టాప్.. విగ్గు పీక్కోవడంతో అతనికి ప్లస్
Bigg Boss Telugu 8 First Week Nomination Voting: బిగ్ బాస్ తెలుగు 8 మొదటి వారం నామినేషన్ ఓటింగ్‌లో లేడి కంటెస్టెంట్, యాంకర్ విష్ణుప్రియ అత్యధిక ఓట్లతో టాప్‌లో దూసుకుపోతోంది. ఆమెకు పోటీగా నాగ మణికంఠ ఉన్నాడు. విగ్గు పీక్కోవడంతో అతనికి బాగా కలిసొచ్చింది. మరి ఎవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందంటే..
Bigg Boss Telugu 8 Voting: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో మొదటి వారం నామినేషన్స్ గొడవలతో బాగానే సాగాయి. నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ ఉన్నారంటే వాళ్లను సపోర్ట్ చేస్తూ ప్రేక్షకులు ఓటింగ్ చేస్తారని తెలిసిందే. అయితే, ఈ బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఏం జరురుగుతందనేది అస్సలు ఊహించలేం.
నెగెటివ్ క్యాండెట్
జీరోలు అనుకున్నవాళ్లు హీరోలు అవుతారు.. హీరోలు అనుకున్నవాళ్లు కనుమరుగు లేకుండా మూలన పడిపోతారు. అట్లుంది ఈ బిగ్ బాస్ గేమ్‌తోని. తాజాగా కూడా ఇదే రిపీట్ అయింది. మొన్నటివరకు నెగెటివ్ క్యాండేట్, ఊరికే ఏడుస్తున్నాడు.. ఎమోషనల్ అవుతున్నాడు అనుకున్న నాగ మణికంఠ ఇప్పుడు అత్యధిక ఓటింగ్‌తో సత్తా చాటుతున్నాడు.
తల్లిదండ్రులు చనిపోయారని, భార్య విడాకులు ఇచ్చిందని, కూతురుకి దూరంగా ఉంటున్నాని సింపథీ గేమ్ ఆడుతున్నాడు అని మొన్నటివరకు నాగ మణికంఠపై నెగెటివిటీ బాగానే ఉండేది. కానీ, సెప్టెంబర్ 4వ తేది ఎపిసోడ్‌లో తన విగ్గు పీక్కోని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చాడు నాగ మణికంఠ. దాంతో అతనికి తెగ ఓట్లు పడిపోతున్నాయి.
నెగెటివ్ వైబ్స్
బిగ్ బాస్ 8 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్ ముగిసిన తర్వాత తనను నెగెటివ్ పర్సన్ అంటున్నారని, తన చుట్టూ నెగెటివ్ వైబ్స్ ఉంటున్నాయని కామెంట్ చేశారని తెగ బాధపడిపోయాడు నాగ మణికంఠ. నిఖిల్‌కు చెప్పుకుంటూ తనవల్ల కావట్లేదని, ఇంతకన్న ట్రాన్సపరెంట్‌గా ఉండలేనంటూ తన విగ్గు తీసేసాడు నాగ మణికంఠ.
ఈ సీన్ చూసిన ఆడియెన్స్ తెగ షాక్ అయ్యారు. అయితే, నాగ మణికంఠ అలా చెబుతూ చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. బ్రెయిన్ స్ట్రక్ అయిపోయిందని, ఎటు కదల్లేకపోతున్నాని గోడు వెళ్లబోసుకున్నాడు. దాంతో బిగ్ బాస్ తనను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మోటివేట్ చేశాడు. ఈ వ్యవహారమంతా ఇప్పుడు నాగ మణికంఠకు చాలా ప్లస్ అయింది. దాంతో అతనికి ఓటింగ్ పెరుగుతోంది.
29 శాతంతో ఫస్ట్
బిగ్ బాస్ తెలుగు 8 మొదటి వారం నామినేషన్స్‌లో బెజవాడ బేబక్క, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, విష్ణుప్రియ, నాగ మణికంఠ ఉన్నారు. వీరిలో అత్యధిక ఓటింగ్ 29 శాతంతో యాంకర్ విష్ణుప్రియ టాప్‌లో దూసుకుపోతోంది. తన గేమ్ పెద్దగా ఏం లేకున్న తనకున్న ఫాలోయింగ్ వల్ల అంతలా ఓటింగ్ నమోదు అవుతోందని తెలుస్తోంది.
ఇక రెండో స్థానంలో 26 శాతంతో ఓటింగ్‌తో నాగ మణికంఠ నిలిచాడు. 12వ శాతం ఓట్లతో మూడో స్థానంలో పృథ్వీరాజ్, 12వ శాతం ఓట్లతో నాలుగో స్థానంలో సోనియా ఆకుల, 10 శాతం ఓట్లతో శేఖర్ బాషా ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక 9వ స్థానంలో చివరి ఆరో స్థానంలో బెజవాడ బేబక్క ఉంది.
టాపిక్