Bigg Boss Telugu 8: నామినేషన్స్‌లో బిగ్ బాస్ ట్విస్ట్- ఆర్జీవీ హీరోయిన్‌ వర్సెస్ సీత- బొక్కలో క్యారెక్టర్ అంటూ!-bigg boss telugu 8 day 8 promo 2nd week nominations twist sonia vs seetha bigg boss 8 telugu nominations highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8: నామినేషన్స్‌లో బిగ్ బాస్ ట్విస్ట్- ఆర్జీవీ హీరోయిన్‌ వర్సెస్ సీత- బొక్కలో క్యారెక్టర్ అంటూ!

Bigg Boss Telugu 8: నామినేషన్స్‌లో బిగ్ బాస్ ట్విస్ట్- ఆర్జీవీ హీరోయిన్‌ వర్సెస్ సీత- బొక్కలో క్యారెక్టర్ అంటూ!

Sanjiv Kumar HT Telugu
Sep 09, 2024 02:26 PM IST

Bigg Boss Telugu 8 September 9th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్‌లో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి గొడవలతో సాగిన బిగ్ బాస్ 8 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్స్‌లో ఆర్జీవీ హీరోయిన్ సోనియా వర్సెస్ కిర్రాక్ సీత ఫైట్ జరిగింది. బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమో చూస్తే

నామినేషన్స్‌లో బిగ్ బాస్ ట్విస్ట్.. ఆర్జీవీ హీరోయిన్‌ వర్సెస్ సీత- బొక్కలో క్యారెక్టర్ అంటూ!
నామినేషన్స్‌లో బిగ్ బాస్ ట్విస్ట్.. ఆర్జీవీ హీరోయిన్‌ వర్సెస్ సీత- బొక్కలో క్యారెక్టర్ అంటూ!

Bigg Boss Telugu 8 Today Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రెండో వారం నామినేషన్స్ ఫస్ట్ వీక్ కంటే ఎక్కువ గొడవలతో సాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 9వ తేది ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు గట్టిగానే జరిగినట్లు చూపించారు.

తమ క్లాన్స్ కాకుండా

"ఈవారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలుకాబోతుంది. ప్రతి సభ్యుడు ఇద్దరు సభ్యులను నామినేట్ చేసి వారి తలపై పెయింట్ నీళ్లు పోయాల్సి ఉంటుంది." అని బిగ్ బాస్ చెప్పాడు. ఇది ప్రోమోలో చూపించినా.. తమ క్లాన్ సభ్యులను కాకుండా ఇతర క్లాన్ మెంబర్స్‌ను మాత్రమే నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టినట్లు సమాచారం.

ప్రస్తుతం హౌజ్‌లో మూడు క్లాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, సాధారణంగా హౌజ్‌లో ఎవరినైనా నామినేట్ చేసే రూల్ ఉంటుంది. కానీ, ఈసారి అలా కాకుండా ఇతర క్లాన్ హౌజ్ మేట్స్‌ను మాత్రమే నామినేషన్స్‌సో ఉంచాల్సిందిగా బిగ్ బాస్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ ఆదేశాలతో కంటెస్టెంట్స్ నామినేషన్స్ స్టార్ట్ చేశారు.

సీత వర్సెస్ ప్రేరణ

"మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకుని వచ్చి వాళ్లను ఫాలో అవ్వమని మీరో ఫాలో అవ్వొచ్చు గానీ, ఇతరులను ఫాలో అవ్వమని చెప్పే రైట్ మీకు లేదు" అని ప్రేరణను నామినేట్ చేస్తూ చెప్పింది. "బయటి నుంచి బయటి నుంచి అనేది చాలా సార్లు వస్తుంది. అది కొంచెం ఆపండి" అని ప్రేరణ చెప్పింది. "నేను క్యారెక్టర్ అసాసినేషన్ చేయట్లేదు" అని సీత వివరణ ఇచ్చుకుంది. ఇలా వీళ్లిద్దరి మధ్య ఫైట్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది.

అనంతరం హీరో ఆదిత్య ఓంను అభయ్ నామినేట్ చేశాడు. "మణికంఠ కంటే నాది తక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఉందా" అని ఓం అడిగితే.. "మణికంఠ కంటే తక్కువ కాదు. ఇద్దరిది" అని అభయ్ చెబుతుంటే.. "ఓకే అందరికీ అర్థమైంది.. అంతా అర్థమైంది" అని ఆదిత్య కట్ చేశాడు. "డస్ట్ బిన్‌ నుంచి తీసి పెట్టిండ్రా.. ఎక్కడి నుంచి తీసి పెట్టినా నువ్ క్లీనింగ్ చేయాల్సిందేగా.." అని నైనికతో సోనియా ఆకుల వాదించింది.

ఆ మెచ్యురిటీ రావాలే

తర్వాత "క్లేన్‌కు పర్సనల్‌కి డివిజన్ లేదంటే అది పర్సనాలిటీ ప్రాబ్లమ్. సో అది నువ్ డెవలప్ చేసుకోవాలి. ఆ మెచ్యురిటీ రావాలే" అని కిర్రాక్ సీతతో సోనియా చెప్పింది. "నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు. నువ్ గేమ్ అర్థం చేసుకుని వచ్చి తర్వాత నాకు వచ్చి ఎక్స్‌ప్లేన్ చేయు ఓకే. నీకు క్లారిటీ లేదు" అని సీత అంది.

అనంతరం మైక్ తీస్తూ.. "నాకు క్లారిటీ లేదు, నీకు ఉంది. బొక్కలో క్లారిటీ" అని సీత అంది. దాంతో "ఎక్కువ మాట్లాడొద్దు సీత. పిచ్చి మాటలు మాట్లాడొద్దు" అని సోనియా ఫైర్ అయింది. "నేను నిన్ను అనలేదు. బొక్కలో క్యారెక్టర్ అనలేదు. నువ్ మాట్లాడేది ఏంటీ" అన్నట్లుగా సీత వాదించింది. కాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఆశ ఎన్‌కౌంటర్, కరోనా వైరస్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది సోనియా ఆకుల.