Bigg Boss Nominations: బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో 8 మంది.. ఆమెకు మాత్రం స్పెషల్ పవర్!-bigg boss telugu 8 second week nominations contestants are 8 housemates in bigg boss 8 telugu nominations 2nd week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Nominations: బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో 8 మంది.. ఆమెకు మాత్రం స్పెషల్ పవర్!

Bigg Boss Nominations: బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో 8 మంది.. ఆమెకు మాత్రం స్పెషల్ పవర్!

Sanjiv Kumar HT Telugu
Sep 09, 2024 10:26 AM IST

Bigg Boss Telugu 8 Nominations 2nd Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రెండో వారం నామినేషన్స్ కూడా చాలా గొడవలతో జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా ఈసారి నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 13 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరికి స్పెషల్ పవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో 8 మంది.. ఆమెకు మాత్రం స్పెషల్ పవర్!
బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో 8 మంది.. ఆమెకు మాత్రం స్పెషల్ పవర్! (Youtube @Disneyplushotstar)

Bigg Boss Telugu 8 2nd Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ క్రమంగా క్రేజ్ తెచ్చుకుంటోంది. తొలి రోజు నుంచే రచ్చ చేయడం స్టార్ట్ చేసిన కంటెస్టెంట్స్ రెండో వారం కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి అడుగుపెట్టగా.. వారిలో ఇప్పుడు 13 మంది మిగిలారు.

రెండో వారం నామినేషన్స్

బెజవాడ బేబక్క ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక వీరికి రెండో వారం నామినేషన్స్ నిర్వహించారు. గత కొన్ని సీజన్స్ నుంచి ఎలిమినేట్ కంటెస్టెంట్‌ను ప్రకటించిన మరుసటి రోజు నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అంటే, ప్రతి సోమవారం బిగ్ బాస్ నామినేషన్స్ జరుగుతుంటాయి.

హోరా హోరీగా 

అలాగే రెండో వారం నామినేషన్స్‌ను కూడా సోమవారం టెలీకాస్ట్ చేయనున్నారు. మొదటి వారం కంటే మించి సెకండ్ వీక్ నామినేషన్స్ హోరాహోరీగా సాగినట్లు సమాచారం. కంటెస్టెంట్ల మధ్య తీవ్రమైన వాగ్వాదం, అరుపులు, గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇలా ఫైట్స్‌తో సాగిన బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నట్లు సమాచారం.

8 మంది నామినేట్

ప్రతి ఒక్క కంటెస్టెంట్ మరో ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేసి ఎలిమినేషన్ జోన్‌లో ఉంచుతారు. ఈ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువసార్లు నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను ఎలిమినేషన్ జోన్‌లో ఉంటారు. అలా ఈసారి ఏకంగా 8 మంది డేంజర్ జోన్‌లో ఉన్నారు. విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, నిఖిల్, పృథ్వీరాజ్, శేఖర్ బాషా, కిర్రాక్ సీత సెకండ్ వీక్ నామినేషన్స్‌లో ఉన్నారు.

అభయ్ వర్సెస్ సీత

అంటే వీరంతా ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. నైనిక, విష్ణుప్రియను సోనియా నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ప్రేరణ, నిఖిల్‌ను కిర్రాక్ సీత నామినేట్ చేసింది. విష్ణుప్రియను అభయ్ నవీన్ నామినేట్ చేశాడు. నాగ మణికంఠ-యశ్మీ మధ్య బిగ్ ఫైట్ జరిగినట్లు సమాచారం. అలాగే అభయ్ నవీన్ వర్సెస్ సీత గట్టిగానే జరిగిందట.

స్పెషల్ పవర్

నిఖిల్, కిర్రాక్ సీత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం హౌజ్‌లో మూడు క్లాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అంటే మూడు టీమ్స్‌గా ఉన్నారు. వారిలో అతిపెద్ద క్లాన్‌గా యశ్మీ గౌడ నిలిచింది. యశ్మీ గౌడ బిగ్ క్లాన్ కాబట్టి ఆమెకు స్పెషల్ అడ్వాంటేజ్ ఉండటంతోపాటు ఒక పవర్ ఇచ్చారట బిగ్ బాస్.

సేవ్ చేసే అవకాశం

అంటే, యశ్మీ గౌడ ఎక్కువగా నామినేట్ అయినప్పటికీ ఆమె బిగ్ క్లాన్ కాబట్టి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. లేదా తన టీమ్‌లో ఒకరిని నామినేషన్స్ నుంచి సేవ్ చేసే పవర్ కూడా ఇవ్వొచ్చు. లేదా ఇంకేదైనా స్పెషల్ అడ్వాంటేజ్ యశ్మీకి బిగ్ బాస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తిగా తెలయాలంటే బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 9వ తేది ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యేవరకు ఆగాల్సిందే.