Bigg Boss 6 Telugu Day 2: నామినేషన్స్‌లో ముగ్గురు.. ఏడ్చేసిన సింగర్ రేవంత్, ఇనాయ.. హగ్ ఇవ్వలేదని భర్తతో మెరీనా గొడవ
Bigg Boss 6 Day 2 Episode: బిగ్‌బాస్ సీజన్ 6లో అప్పుడే చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. తొలి రోజు జుట్టు విషయంపై గొడవలు పడిన ఇనాయా సుల్తానా, గీతూ.. రెండో రోజు కూడా తమ గ్యాప్‌ను అలాగే కొనసాగించారు. క్లాస్‌లోకి వచ్చిన గీతూ ఇనాయాను లక్ష్యంగా చేసుకుంటూ వరుసగా పనులు చెప్పింది.
Bigg Boss 6 Day 2 Episode: బిగ్‌బాస్ సీజన్ 6 రెండో రోజు కూడా క్లాస్, మాస్, ట్రాష్ టాస్క్ నడిచింది. మొదటి రోజు ఇంటి సభ్యులను మూడు టీమ్‌లుగా విడిపోవాలంటూ బిగ్‌బాస్ ఆదేశించడంతో బాలాధిత్య, శ్రీహాన్, సూర్య క్లాస్‌లో.. రేవంత్, గీతూ, ఆదిరెడ్డి ట్రాష్‌లోకి వచ్చారు. సమయానుసారం ఛాలెంజ్‌లు ఇశ్తూ కంటిస్టెంట్లు తమ టీమ్‌ను మార్చుకునే అవకాశమిచ్చారు బిగ్‌బాస్. ట్రాష్ నుంచి క్లాస్‌లోకి వెళ్లేందుకు బిగ్‌బాస్ టాస్క్ ఇవ్వగా.. ఇనాయ, ఆదిరెడ్డి పోటీ పడతారు. ఆ టాస్క్‌లో గెలిచిన ఆదిరెడ్డి క్లాస్‌కు ప్రమోట్ అవగా.. శ్రీహాన్ మాస్‌కు వస్తాడు.
రెండో ఛాలెంజ్‌లో క్లాస్ నుంచి ట్రాష్‌కు ఓ సభ్యుడిని స్వాప్ చేసుకునే అవకాశమివ్వగా.. బాలాదిత్య ట్రాష్‌లోకి రాగా.. గీతూ క్లాస్‌లోకి వస్తుంది. ఈ టాస్క్‌లో గీతూ, రేవంత్ మధ్య చర్చ జరుగుతుంది. ఇద్దరూ క్లాస్‌లోకి వెల్లేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ చివరకు రేవంత్ తప్పుకోగా.. గీతూ క్లాస్‌లోకి వస్తుంది. ఇక వచ్చి రావడంతోనే ఇనాయాను టార్గెట్ చేస్తూ వరుసగా పనులు చెప్పింది. దీంతో ఇనాయా అసహనం వ్యక్తం చేసింది. ఆమెతో వాదనకు దిగింది. మరోవైపు సడెన్‌గా రేవంత్ బాత్రూంలోకి వెళ్లి ఏడ్వడం ప్రారంభించాడు.
అనంతరం జరిగిన టాస్కుల్లో రేవంత్, నేహా గెలిచి మాస్ టీమ్‌ల్లోకి రాగా.. బాలాదిత్య, అభినయశ్రీ ట్రాష్ టీమ్‌లోకి వస్తుంది. అనంతరం టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. నేహా, ఆదిరెడ్డి, గీతూ క్లాస్ టీమ్‌లో ఉన్న కారణంగా ఈ ముగ్గురు నామినేషన్స్‌లో లేరని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే వీరు కెప్టెన్సీ పోటీదారులకు అర్హత సాధించే అవకాశం కూడా ఉంది. ట్రాష్ టీమ్‌లో ఉన్న బాలాదిత్య, అభినయశ్రీ, ఇనాయ సుల్తానా ఈ వారం నామినేషన్‌లోకి వచ్చారు. వీరిలో ఇనాయాకు కాస్త నెగిటివిటీ ఉంది. రేపు మరికొంతమంది నామినేషన్స్‌లోకి వచ్చే అవకాశముంది.
ఓ పక్క టాస్క్ జరుగుతుంటే.. భార్య, భర్తలైన రోహిత్-మెరీనా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి. హగ్ ఇస్తుంటే కడా వదిలించుకుని వెళ్లిపోయాడంటూ మెరీనా అలక బూనింది. మరోసారి బాత్రూంలో ఇద్దరు డిస్కస్ చేస్తుండగా.. తన మాట వినలేదని రోహిత్‌తో గొడవ పడింది. దీంతో భార్యపై రోహిత్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది, సారీ చెప్పినా వినకపోతే ఏం చేయాలి? ఓవర్ యాక్షన్ తగ్గించుకో అంటూ మెరీనాపై అసహనం వ్యక్తం చేశాడు.
సంబంధిత కథనం