Bigg Boss Telugu Elimination: టాప్‌లో రైతు బిడ్డ.. ఈవారం డబుల్ ఎలిమినేషన్‌.. కానీ, అదొక్కటే ట్విస్ట్-bigg boss 7 telugu 12th week elimination and prashanth top in voting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu Elimination: టాప్‌లో రైతు బిడ్డ.. ఈవారం డబుల్ ఎలిమినేషన్‌.. కానీ, అదొక్కటే ట్విస్ట్

Bigg Boss Telugu Elimination: టాప్‌లో రైతు బిడ్డ.. ఈవారం డబుల్ ఎలిమినేషన్‌.. కానీ, అదొక్కటే ట్విస్ట్

Sanjiv Kumar HT Telugu

Bigg Boss 7 Telugu Voting: బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం ఓటింగ్‌ మళ్లీ ఒక్కసారిగా మారిపోయింది. ఓటింగ్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్‌లో కొనసాగుతుంటే ఎలిమినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది.

బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం డబుల్ ఎలిమినేషన్‌లో ట్విస్టులు

Bigg Boss 7 Telugu 12th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ప్రస్తుతం 10 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. 12వ వారం నామినేషన్లలో రతిక, యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, అమర్ దీప్, అశ్విని ఇలా 8 మంది ఉన్నారు. ఈ కంటెస్టెంట్స్‌కి మంగళవారం నుంచి ఓటింగ్ నిర్వహించారు. అయితే, ఈవారం ఓటింగ్ అనేక విధాలుగా మారుతూ వచ్చింది.

బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం ఓటింగ్‌లో రైతు బిడ్డ టాప్‌లో కొనసాగుతుంటే ఎప్పుడూ ముందు స్థానంలో ఉండే హీరో శివాజీ వెనక్కి పడిపోయాడు. 30.53 శాతంతో ప్రశాంత్ ఫస్ట్ ప్లేసులో ఉంటే, 19.99 శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అమర్ దీప్ 17.41 శాతంతో మూడో స్థానంలోకి వెళ్లాడు. మొన్నటివరకు శివాజీ 3, అమర్ 1 స్థానాల్లో ఉండేవారు. ఇప్పుడు అమర్ మూడో స్థానానికి వచ్చాడు. అతి స్వల్ప ఓటింగ్‌తో సినిమా హీరో శివాజీ, సీరియల్ హీరో అమర్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది.

ఇక 11.5 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, 8.89 శాతంతో ఐదో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉండగా.. 4.28 శాతంతో రతిక, అర్జున్ ఇద్దరూ ఆరో స్థానంలోకి ఉన్నారు. చివరిగా 4.28 శాతంతో అశ్విని ఏడో స్థానంలో ఉంది. అంటే.. రతిక, అర్జున్, అశ్విని ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారు. మొన్నటివరకు రతిక, అశ్విని మాత్రమే డబుల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు అర్జున్ కూడా డేంజర్ జోన్‌లోకి వచ్చాడు.

అయితే, బిగ్ బాస్ 12వ వారం ఒకరిని ఎలిమినేట్ చేసి.. మరొకరికి ప్రశాంత్‌కు వచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను వాడమని చెబుతారు. పేరుకు డబుల్ ఎలిమినేషన్ అయినా, ఎవిక్షన్ పాస్‌తో ఒకరిని సేవ్ చేసి మరొకరిని ఎలిమినేట్ చేసి హౌజ్ నుంచి పంపిస్తారు. ఒకవేళ ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ ఉపయోగించకుంటే ఇద్దరు డబుల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వారిలో అర్జున్ కూడా ఉండొచ్చు. ఇలా ఈ వారం ఎలిమినేషన్‌లో ట్విస్టులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.