Bigg Boss Remuneration: బిగ్ బాస్ ఫస్ట్ ఎలిమినేషన్ కంటెస్టెంట్ అవుట్.. వారంలో బేబక్క సంపాదించింది ఎంతంటే?
Bigg Boss Telugu 8 First Elimination Contestant: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మొదటి వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. బిగ్ బాస్ హౌజ్‌లోకి ఏడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన బేబక్క.. ఎలిమినేట్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్‌గా నిలిచింది. మరి వారం రోజులు హౌజ్‌లో ఉన్న బేబక్క ఎంత సంపాదించిందని చూస్తే..
Bigg Boss Telugu 8 Bebakka Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్‌మెంట్ అనే ట్యాగ్ లైన్‌తో ప్రారంభం అయింది. దీనికి తగినట్లుగానే మొదటి రోజు నుంచి హౌజ్ మేట్స్ గొడవలు పెట్టుకోవడం, అరుచుకోవడం లాంటివి చేసి వినోదం పంచారు. ఇక నామినేషన్స్‌లో అయితే అంతకుమించి రెచ్చిపోయారు.
కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వారిలో మొదటి వారం నామినేషన్స్‌లో విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, శేఖర్ బాషా ఆరుగురు నామినేట్ అయ్యారు. రెండు రోజుల పాటు ఈ నామినేషన్స్ సాగాయి. నామినేషన్స్ పూర్తవ్వగానే ఓటింగ్ పోల్ తెరచుకుంది.
కంటెస్టెంట్ల ఓట్లు
మొదటి రోజు నుంచి యాంకర్ విష్ణుప్రియకు మంచి ఓటింగ్ నమోదు అయింది. ఆ తర్వాతి స్థానంలో మణికంఠకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి. ఇలా విష్ణుప్రియకు 30 శాతం (41,635 ఓట్లు), నాగ మణికంఠకు 27 శాతం (36,908 ఓట్లు), పృథ్వీరాజ్‍కు 13 శాతం (18,253 ఓట్లు), సోనియా ఆకులకు 10 శాతం (13,958 ఓట్లు), శేఖర్ బాషాకు 10 శాతం (13,859 ఓట్లు) ఓటింగ్ నమోదు అయింది.
ఇక చివరిగా అందరికంటే తక్కువగా అదే పది శాతం (13, 747 ఓట్లు)తో చివరి స్థానంలో నిలిచిన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేషన్‌ను నాగార్జున ప్రకటించగానే స్టేజీపై బేబక్క ఏవీ వేశారు. అనంతరం హౌజ్‌లో సీత, విష్ణుప్రియ, మణికంఠ ఎమోషనల్ అయ్యారు. అనంతరం హౌజ్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లను రోడ్డున పడేసేయ్ అని నాగార్జున చెప్పారు.
దాంతో నెగెటివిటీ ఎక్కువగా ఉందన్న కారణంతో సోనియా ఆకుల, అగ్రెషన్ ఎక్కువ అనే రీజన్‌తో పృథ్వీరాజ్, నిఖిల్ వల్లే తాను ఎక్కువగా నెగెటివ్ అయ్యానని అతన్ని, సోలోగా ఉంటూ, కాన్ఫిడెంట్ లేకుండా ఉంటాడని మణికం పేర్లు చెప్పింది బేబక్క. వారి ఫొటోలను రోడ్డుపై ఉన్న మార్క్‌పై పేస్ట్ చేసింది. అనంతరం బేబక్క హౌజ్‌ను బయటకు వెళ్లిపోయింది.
రోజుకు ఎంతంటే..
ఇదిలా ఉంటే, యూట్యూబర్‌గా బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బేబక్క రెమ్యునరేషన్ రోజుకు రూ. 21, 428 అని సమాచారం. అంటే వారం రోజులు ఉన్న బేబక్క సంపాదించింది సుమారుగా రూ. 1.50 లక్షలు. ఇంకొన్ని రోజులు ఉంటే ఈ అమౌంట్ ఇంకా పెరిగేది. కానీ, బిగ్ బాస్ సాంప్రదాయం ప్రకారం కిచెన్‌లోకి దూరి తక్కువ సమయంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లాగే బేబక్క కూడా అవుట్ అయింది.
కాగా యూట్యూబర్‌గా పాపులర్ అయిన బెజవాడ బేబక్క అసలు పేరు మధు నెక్కంటి. ఆమెకు సోషల్ మీడియాలో 1.64 కే ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ అనంతరం బేబక్కకు 1.83కే ఫాలోవర్స్ పెరిగారు. పెద్దగా ఎలాంటి నెగెటివిటీ లేకుండా బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయిన బేబక్క కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.