Prabhas Imanvi: సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్ లవ్ స్టోరీ మూవీ ప్రారంభం.. హీరోయిన్‌గా ఇమాన్వీ.. అదిరిపోయిన జంట (ఫొటోలు)
Hanu Raghavapudi Prabhas Imanvi Movie Launch Photos: సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో ప్రభాస్ హీరోగా తెరకెక్కినున్న కొత్త సినిమా లాంచ్ ఇవాళ (ఆగస్ట్ 17) ప్రారంభమైంది. ఈ లవ్ స్టోరీ మూవీలో హీరోయిన్‌గా ఇమాన్వీ చేస్తోంది. ప్రభాస్‌తో ఇమాన్వి దిగిన క్యూట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
(1 / 6)
సలార్, కల్కి 2898 ఏడీ లాంటి వరుస బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లతో ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ న్యూ ప్రాజెక్ట్‌ను సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో ప్రారంభించారు. (Instagram)
(2 / 6)
ప్రభాస్- హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సరికొత్త లవ్ స్టోరీ మూవీ ఇవాళ (ఆగస్ట్ 17) గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ సినిమాను ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.(Instagram)
(3 / 6)
హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ నయా లవ్ స్టోరీ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా హీరోయిన్‌గా ఇమాన్వి చేస్తోంది. సోషల్ మీడియా స్టార్‌గా ఇమాన్వీ గుర్తింపు తెచ్చుకుంది. (Instagram)
(4 / 6)
ప్రభాస్, ఇమాన్వి జంటగా దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమాన్వీ చాలా క్యూట్‌గా ఉందని, జోడీ బాగుందని నెటిజన్స్, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (Instagram)
(5 / 6)
1940 బ్యాక్ డ్రాప్‌లో హిస్టారికల్, పవర్‌ఫుల్ వారియర్ కథాంశంతో ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కించనున్నట్లు సమాచారం. అత్యంత భారీ బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్‌తో ఈ మూవీ రూపొందనుంది. (Instagram)
ఇతర గ్యాలరీలు