Ram Gopal Varma: తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రియేట్ చేస్తుంది.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్-director ram gopal varma released udvegam teaser and says it will create wonder in telugu cine industry starrer trigun ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Gopal Varma: తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రియేట్ చేస్తుంది.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

Ram Gopal Varma: తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రియేట్ చేస్తుంది.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Aug 30, 2024 06:08 AM IST

Ram Gopal Varma About Udvegam Movie: ఉద్వేగం మూవీ తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రియేట్ చేయనుందని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. తాజాగా ఉద్వేగం టీజర్‌ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉద్వేగం సినిమా, టీజర్‌కు సంబంధించిన విశేషాలపై ఆర్జీవీ కామెంట్స్ చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రియేట్ చేస్తుంది.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రియేట్ చేస్తుంది.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

Ram Gopal Varma Comments: కళా సృష్టి ఇంటర్నేషనల్, మని దీప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై మహిపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ఉద్వేగం ది ఫస్ట్ కేసు. ఈ చిత్రానికి శంకర్ లుకలపుమధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్రిగున్ ప్రాధాన పాత్రలో, శ్రీకాంత్ అయ్యంగార్ విభిన్న పాత్రలో నటిస్తున్న ఉద్వేగం చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.

రామ్ గోపాల్ వర్మతో టీజర్ రిలీజ్

ప్రముఖ సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ఉద్వేగం చిత్రం టీజర్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో త్రిగున్, శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, ఐడ్రీమ్ అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉద్వేగం టీజర్ రిలీజ్ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. "కోర్టు రూమ్ డ్రామాతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి" అని తెలిపారు. టీజర్ చూసిన తరువాత చాలా సిన్సియర్ అటెప్ట్ అనపించిందని ఆర్జీవి అన్నారు. అంతే కాకుండా చాలా సహజంగా యాక్టింగ్ చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ చిత్రం కచ్చితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వండర్ క్రీయేట్ చేయబోతుందని ఆర్జీవీ పేర్కొన్నారు.

త్రిగున్‌కు 25వ సినిమా

ముందుగానే సినిమా దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే యాక్టర్ అదిత్య 25వ చిత్రం, అలాగే త్రిగున్ సైతం 25వ చిత్రం ఉద్వేగం అని, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి యాక్టర్స్ ఈ చిత్రంలో పని చేయడం గ్రేట్ అని ఆర్జీవీ పేర్కొన్నారు.

కోర్టు రూమ్ డ్రామాలు విజువల్‌గా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయని, ఈ చిత్రం టీజర్ చూసినప్పుడు అదే ఉద్వేగాన్ని కలిగించిందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఇదిలా ఉంటే, కోర్టు రూమ్ డ్రామాల్లో మంచి సస్పెన్స్ ఉంటుందని తెలిసిందే. తెలుగులో వచ్చిన వకీల్ సాబ్ చిత్రం తరువాత అంత డ్రామా, సస్పెన్స్ ఉన్న చిత్రం ఉద్వేగం అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.

సస్పెన్స్‌తోపాటు ఎమోషన్స్

ఉద్వేగం టీజర్ చూస్తే కచ్చితంగా ఓ కొత్త ములుపును సినిమాలో చూపించబోతున్నట్లు అనిపిస్తుంది. టీజర్‌లో విడుదల చేసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సస్పెన్స్‌తో పాటు ఎమోషన్స్ సైతం ఉన్నట్లు టీజర్ చూస్తే అనిపిస్తుంది. ఇక లా ను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు నాలెడ్జ్ కూడా అందిస్తుందని అర్థం అవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ అందిస్తామని చిత్ర బృందం వెల్లడించింది.

కాగా ఎన్నో హిట్ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ. కానీ, ఈ మధ్య ఆయన సినిమాలకు అంతగా ఎక్కట్లేదు. ఏది ఏమైనా ఆయనకు నచ్చినట్లు చిత్రాలు తెరకెక్కిస్తూ పోతున్నారు. ఈ క్రమంలోనే యువర్ ఫిల్మ్ అనే ప్రయోగం చేస్తున్నారు. హీరో హీరోయిన్స్, డైరెక్టర్ నుంచి టెక్నిషియన్స్ వరకు అంతా కొత్తవాళ్లతో సినిమాలు చేయనున్నారు.