Devara Promotions: దేవర ప్రమోషన్లలో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె సినిమాకు కూడా..-rrr actors jr ntr and alia bhatt does interview for devara and jigra karan johar joined ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Promotions: దేవర ప్రమోషన్లలో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె సినిమాకు కూడా..

Devara Promotions: దేవర ప్రమోషన్లలో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె సినిమాకు కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 10, 2024 04:09 PM IST

Devara Promotions: దేవర సినిమా ప్రమోషన్లను ముంబైలో జోరుగా చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలతో కలిసి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఓ బాలీవుడ్ హీరోయిన్‍తో కలిసి ఇంటర్వ్యూ చేశారు ఎన్టీఆర్.

Devara Promotions: దేవర ప్రమోషన్లలో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె సినిమాకు కూడా..
Devara Promotions: దేవర ప్రమోషన్లలో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె సినిమాకు కూడా..

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. ఈ మాస్ యాక్షన్ చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో క్రేజ్ మరో లెవెల్‍లో నెలకొంది. దేవర ప్రమోషన్లను ముంబై నుంచే షురూ చేశారు ఎన్టీఆర్. ఇప్పటికే ముంబైలో బిజీబిజీగా ఉన్నారు. నేడు (సెప్టెంబర్ 10) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అక్కడే జరగనుంది. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‍తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఎన్టీఆర్.

ఆర్ఆర్ఆర్ బంధం

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, ఆలియా భట్ కలిసి నటించారు. ఆ చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగా ఆలియా నటించినా.. ఎన్టీఆర్‌తో ముఖ్యమైన సీన్స్ ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సమయంలో ఎన్టీఆర్, ఆలియా మంచి స్నేహితులయ్యారు. ఆ మూవీ ప్రమోషన్ల సమయంలోనూ ఇది కనిపించింది. ఇప్పుడు, మళ్లీ దేవర, జిగ్రా చిత్రాలను ప్రమోట్ చేసుకునేందుకు వారిద్దరూ కలిశారు.

కరణ్ జోహార్‌తో ఎన్టీఆర్, ఆలియా

దేవర చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుండగా.. ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించి.. నిర్మించిన జిగ్రా మూవీ అక్టోబర్ 11న విడుదల కానుంది. ఈ తరుణంలో ఎన్టీఆర్, ఆలియా భట్ వారి చిత్రాలను ఈ ఇంటర్వూలో ప్రమోట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఆ ఇద్దరి చిట్‍చాట్‍కు బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. జిగ్రాకు సహ నిర్మాతగానూ కరణ్ ఉన్నారు.

ఎన్టీఆర్, ఆలియా భట్, కరణ్ జోహార్ కలిసిన ఫొటోలను దేేవర టీమ్ పోస్ట్ చేసింది. ‘దేవర కా జిగ్రా’ పేరుతో ఈ ఇంటర్వ్యూ సాగింది. మరో రెండు రోజుల్లోనే ఈ ఇంటర్వ్యూ బయటికి వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్, ఆలియాతో పాటు కరణ్ కూడా సరదాగా మాట్లాడతారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.

సందీప్ రెడ్డి వంగాతోనూ..

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ చేశారని తెలుస్తోంది. దీని కోసమే తాజాగా వీరు కలిశారు. గతేడాది యానిమల్‍తో బాలీవుడ్‍లో తన క్రేజ్‍ను మరింత పెంచుకున్నారు సందీప్. దీంతో దేవర ప్రమోషన్లలో ఆయన కనిపిస్తే హైప్ మరింత పెరుగుతుంది.

కపిల్ శర్మ కామెడీ షోలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. దేవర చిత్రంలో హీరోయిన్‍గా చేసిన జాన్వీ కపూర్, విలన్ పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్‍తో కలిసి కపిల్ షోలో ఎన్టీఆర్ సందడి చేశారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ త్వరలోనే రానుంది. మొత్తంగా ముంబైలో దేవర ప్రమోషన్లను ఫుల్ స్వింగ్‍లో చేస్తున్నారు ఎన్టీఆర్.

దేవర ట్రైలర్ టైమ్

దేవర సినిమా ట్రైలర్ నేడు (సెప్టెంబర్ 10) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ కానుంది. ముంబైలో జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఎన్టీఆర్ ఏం చెబుతారేది విషయంపై క్యూయాసిటీ ఉంది. హై వోల్టేజ్ యాక్షన్‍తో ఈ ట్రైలర్ అదిరిపోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‍తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించాయి.