OTT Movie: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళం హిట్ స్పోర్ట్స్ డ్రామా-ott malayalam sports drama aaha to stream in telugu on aha video ott from september 12th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళం హిట్ స్పోర్ట్స్ డ్రామా

OTT Movie: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళం హిట్ స్పోర్ట్స్ డ్రామా

Hari Prasad S HT Telugu
Sep 10, 2024 02:23 PM IST

OTT Movie: ఓటీటీలోకి మూడేళ్ల తర్వాత ఓ మలయాళం హిట్ మూవీ తెలుగులో వస్తుండటం విశేషం. ఈ స్పోర్ట్స్ డ్రామా నవంబర్, 2021లో థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలోకి తెలుగులో రాబోతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీయే వెల్లడించింది.

మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళం హిట్ స్పోర్ట్స్ డ్రామా
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళం హిట్ స్పోర్ట్స్ డ్రామా

OTT Movie: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ఆహా మూడేళ్ల తర్వాత ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. 2021లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు ఆహా వీడియో తన ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని మంగళవారం (సెప్టెంబర్ 10) సదరు ఓటీటీ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలిపింది.

ఆహా ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం స్పోర్ట్స్ డ్రామా ఈ ఆహా. అక్కడ స్థానికంగా చాలా పాపులర్ అయిన టగ్ ఆఫ్ వార్ ఆటే ప్రధానంగా సాగే మూవీ ఇది. ఈ సినిమాను గురువారం (సెప్టెంబర్ 12) నుంచి ఆహా వీడియో స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ ఎక్స్ ద్వారా వెల్లడించింది.

"టగ్ ఆఫ్ వార్ కి రెడీగా ఉండండి.. ఆట మొదలెట్టాక అటో ఇటో తేలిపోవాల్సిందే.. ఆహా సెప్టెంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని చెప్పింది. ఈ స్పోర్ట్స్ 19 నవంబర్, 2021లో థియేటర్లలో రిలీజైంది.

ఆహా మూవీ స్టోరీ ఏంటంటే?

ఆహా మూవీలో ఇంద్రజీత్ సుకుమారన్, మనోజ్ జయన్, అమిత్ చకలక్కల్, అశ్విన్ కుమార్, శాంతి బాలచంద్రన్ లాంటి వాళ్లు నటించారు. బిబిన్ పాల్ శామ్యూల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు తోబిత్ చిరాయత్ స్క్రిప్ట్ అందించాడు. 1980, 1990ల్లోని చాలా పాపులర్ టగ్ ఆఫ్ వార్ టీమ్ అయిన ఆహా నీలూర్ స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించారు.

15 ఏళ్ల పాటు ఈ టీమ్ టగ్ ఆఫ్ వార్ లో ఎదురులేని ఛాంపియన్స్ గా నిలిచింది. పగలు పూట పొట్టకూటి కోసం ఏవో చిన్న చిన్న పనులు చేసుకునే ఈ టీమ్ లోని సభ్యులు.. రాత్రి అవగానే టగ్ ఆఫ్ వార్ ఆటలో పాల్గొని మెల్లగా స్టార్లుగా ఎదిగిపోతారు.

ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అలాంటి సినిమాను ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఆహా వీడియో తెలుగులో తీసుకు రానుండటం విశేషం. మలయాళం సినిమాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ డ్రామా కూడా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యంగా టగ్ ఆఫ్ వార్ అనే గేమ్ చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది. ఓ తాడును రెండు వైపులా రెండు జట్లు లాగి పట్టుకుంటాయి. ఏ టీమ్ అయితే ప్రత్యర్థి జట్టును మధ్యలో ఉండే ఓ పాయింట్ ను దాటి లాగేస్తుందో ఆ టీమ్ విజేతగా నిలుస్తుంది.