Telugu Cinema News Live August 14, 2024: Godzilla x Kong: The New Empire OTT: ఓటీటీలోకి నయా గాడ్జిల్లా మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రెంట్ లేకుండా.. డేట్ ఇదే
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 14 Aug 202404:25 PM IST
- Godzilla x Kong The New Empire: ‘గార్జిల్లా వర్సెస్ కాంగ్ ది: న్యూ ఎంపైర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. రెంట్ లేకుండానే స్ట్రీమింగ్ చేసుకునేలా అందుబాటులోకి వస్తోంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవనుంది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే..
Wed, 14 Aug 202402:01 PM IST
- Samantha Ruth Prabhu: హీరోయిన్ సమంత విషయంలో మరోసారి రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఓ దర్శకుడితో ఆమె ప్రేమలో ఉన్నారంటూ రూమర్లు బయటికి వచ్చాయి. ఇప్పటికే తాను రెండు వెబ్ సిరీస్‍లు చేసిన ఆ దర్శకుడితో ఆమె లవ్‍లో ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Wed, 14 Aug 202401:13 PM IST
- Singer Suchitra: సింగర్ సుచిత్ర కొన్ని వివాదాస్పద కామెంట్లతో దుమారం రేపారు. తన మాజీ భర్త, నటుడు కార్తీక్ కుమార్ గే అంటూ మాట్లాడారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. తాజాగా కార్తీక్‍కు సుచిత్ర క్షమాపణలు చెప్పారు.
Wed, 14 Aug 202410:57 AM IST
- Jr NTR Injury: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. ఆయన మణికట్టుకు గాయమైంది. ఈ విషయాన్ని ఆయన టీమ్ వెల్లడించింది. అలాగే, మరిన్ని వివరాలను వెల్లడించింది.
Wed, 14 Aug 202410:33 AM IST
- The Fall Guy OTT Release date: హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ గాయ్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా జియోసినిమా ఓటీటీ వెల్లడించింది.
Wed, 14 Aug 202409:55 AM IST
- Premalu TV Premier Date: సూపర్ డూపర్ హిట్ మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ.. వచ్చే ఆదివారం (ఆగస్ట్ 18) టెలికాస్ట్ కానుంది.
Wed, 14 Aug 202409:33 AM IST
- Stree 2 OTT Partner: స్త్రీ 2 సినిమాకు భారీ హైప్ ఉంది. శ్రద్ధా కపూర్, రాజ్‍కుమార్ రావ్ లీడ్ రోల్స్ చేసిన ఈ సీక్వెల్ కామెడీ హారర్ చిత్రం భారీ అంచనాలతో థియేటర్లలోకి వస్తోంది. అయితే, ఈలోగానే ఈ చిత్రం ఓటీటీ పార్ట్‌నర్‌ను ఫిక్స్ చేసుకుంది.
Wed, 14 Aug 202409:07 AM IST
- Emergency trailer: ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర.. అంటూ కంగనా రనౌత్ నటిస్తున్న ఎమర్జెన్సీ మూవీ ట్రైలర్ బుధవారం (ఆగస్ట్ 14) రిలీజైంది. ఈ మూవీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే.
Wed, 14 Aug 202408:44 AM IST
- Shekhar Home OTT Detective Web Series: శేఖర్ హోమ్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ డిటెక్టివ్ డ్రామా సిరీస్ తెలుగులోనూ అడుగుపెట్టింది. ఫేమస్ షెర్లాక్ హోమ్స్ స్ఫూర్తిగా ఈ సిరీస్ తెరకెక్కింది. శేఖర్ హోమ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే..
Wed, 14 Aug 202408:35 AM IST
- Venu Swamy Wife: వేణు స్వామి భార్య వీణ శ్రీవాణి ఇప్పుడు నాగ చైతన్యనే గిఫ్ట్ కావాలని అడుగుతోంది. తానూ గతంలో ఓ జర్నలిస్ట్ అంటూ మీడియాను లక్ష్యంగా చేసుకొని చేసిన వీడియోకు కొనసాగింపుగా బుధవారం (ఆగస్ట్ 14) మరో వీడియో రిలీజ్ చేసింది.
Wed, 14 Aug 202407:57 AM IST
Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ లో నటిస్తున్న స్టార్లను పరిచయం చేస్తూ సదరు ఓటీటీ బుధవారం (ఆగస్ట్ 14) ఓ టీజర్ రిలీజ్ చేసింది. స్ట్రీమింగ్ వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
Wed, 14 Aug 202407:52 AM IST
Telugu OTT: రాజ్ తరుణ్ పురుషోత్తముడు మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Wed, 14 Aug 202407:05 AM IST
- Hero with most cars: అతడు తీసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ దేశంలో ఏ స్టార్ హీరో దగ్గరా లేని విధంగా ఏకంగా 26 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?
Wed, 14 Aug 202406:58 AM IST
ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్‌పైనే తెలుగు ఆడియెన్స్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మిస్టర్ బచ్చన్ కంటే డబుల్ ఇస్మార్ట్ హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
Wed, 14 Aug 202406:01 AM IST
Jabardasth Promo: జబర్ధస్థ్ కొత్త ప్రోమో గొడవలు, ఆర్గ్యూమెంట్స్‌తో ఆసక్తిని పంచుతోంది. రాకెట్ రాఘవతో పాటు బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుయేల్ గొడవ పడ్డారు. ఈ గొడవలు మొత్తం టీఆర్‌పీల కోసమే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Wed, 14 Aug 202405:24 AM IST
- Patriotic Song Lyrics: దేశభక్తి ఏ దేశమేగినా ఎందుకాలిడినా పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. గురువారం (ఆగస్ట్ 15) ఇండిపెండెన్స్ సందర్భంగా ఈ పాట పాడుతూ దేశభక్తిని చాటి చెప్పండి.
Wed, 14 Aug 202404:43 AM IST
- OTT Horror Movie: ఓటీటీలోకి వణికించే హారర్ మూవీ వచ్చేసింది. ఈ ఏడాది జూన్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే అందులోనూ ఓ ట్విస్ట్ ఉంది.
Wed, 14 Aug 202404:17 AM IST
Drama Thriller OTT: పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయ హీరోగా నటించిన కన్నడ మూవీ కోటీ బుధవారం ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Wed, 14 Aug 202403:14 AM IST
Guppedantha Manasu August 14th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 14 ఎపిసోడ్‌లో ఎండీ కాబోతున్న ఆనందంలో అందరికంటే ముందే కాలేజీకి బయలుదేరుతాడు శైలేంద్ర. కానీ అతడిని పాండు కిడ్నాప్ చేస్తాడు. తనను మను కిడ్నాప్ చేయించాడని తెలుసుకొని శైలేంద్ర షాకవుతాడు.
Wed, 14 Aug 202402:42 AM IST
Devara Jr NTR: దేవర పార్ట్ 1 షూటింగ్ పూర్తి చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదే విషయాన్ని చెబుతూ మంగళవారం (ఆగస్ట్ 13) రాత్రి తారక్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wed, 14 Aug 202402:16 AM IST
- Today OTT Releases: ఓటీటీల్లోకి బుధవారం (ఆగస్ట్ 14), గురువారం (ఆగస్ట్ 15) ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అడుగుపెట్టనున్నాయి. కామెడీ నుంచి హారర్ వరకు ఎన్నో జానర్ల మూవీస్ ఇందులో ఉన్నాయి.
Wed, 14 Aug 202401:59 AM IST
Brahmamudi August 14th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 14 ఎపిసోడ్‌లో గుడిలో తల దాచుకున్న కళ్యాణ్, అప్పులకు బంటి ద్వారా షెల్టర్ ఇప్పిస్తుంది కావ్య. తానే ఈ పని చేసినట్లుగా వారికి తెలియకుండా జాగ్రత్తపడుతుంది.
Wed, 14 Aug 202401:33 AM IST
- Karthika deepam 2 serial today august 14th episode: జ్యోత్స్న కన్నతండ్రి దాసు ఎంట్రీ ఇస్తాడు. కూతురు ఎలా ఉందో చూడాలని అనుకుంటాడు. అటు దీప జరిగింది తలుచుకుని బాధపడుతుంది. శౌర్య చదువు విషయంలో ఎప్పటికీ తాను అండగా ఉంటానని కార్తీక్ భరోసా ఇస్తాడు.
Wed, 14 Aug 202401:30 AM IST
- NNS 14th August Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఆగస్ట్ 14) ఎపిసోడ్లో మనోహరికి రణ్వీర్ వీడియో కాల్ చేస్తాడు. మరోవైపు అమర్ లోకి వెళ్లి నిజం తెలుసుకుంటానని అరుంధతి అనగా.. ఆమె ఆత్మను భాగీ తాకడం షాక్‌కు గురి చేస్తుంది.
Wed, 14 Aug 202412:24 AM IST
Derick Abraham Review: మమ్ముట్టి హీరోగా నటించిన డెరిక్ అబ్రహం మూవీ ఇటీవల ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి షాజీపడోర్ దర్శకత్వం వహించాడు.