OTT Detective Series: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే..-detective drama web series shekhar home streaming now on jiocinema ott platform also in telugu shekhar home ott series r ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Detective Series: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Detective Series: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 14, 2024 02:25 PM IST

Shekhar Home OTT Detective Web Series: శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ డిటెక్టివ్ డ్రామా సిరీస్ తెలుగులోనూ అడుగుపెట్టింది. వరల్డ్ పాపులర్ షెర్లాక్ హోమ్స్‌ స్ఫూర్తిగా ఈ సిరీస్ తెరకెక్కింది. శేఖర్ హోమ్ సిరీస్‍ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే..

OTT Detective Series: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT Detective Series: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇంగ్లిష్‍ డిటెక్టివ్ డ్రామా ‘షెర్లాక్ హోమ్స్’ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. డిటెక్టివ్ సిరీస్ అనగానే ఇదే పేరు గుర్తొస్తుంది. అలాంటి ఫేమస్ సిరీస్‍ను స్ఫూర్తిగా తీసుకొని హిందీలో ఇప్పుడు శేఖర్ హోమ్ తెరకెక్కింది. ఈ సిరీస్‍లో కేకే మీనన్ ప్రధాన పాత్ర పోషించారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ శేఖర్ హోమ్ సిరీస్‍పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సిరీస్ నేడు (ఆగస్టు 14) స్ట్రీమింగ్‍కు వచ్చింది.

తెలుగులోనూ..

శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ నేడు జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

ముందుగా శేఖర్ హోమ్ సిరీస్ టీజర్లు, ట్రైలర్లను హిందీలో మాత్రమే జియోసినిమా తీసుకొచ్చింది. దీంతో సిరీస్ ఇతర భాషల్లో వస్తుందా అనే సందేహం నెలకొంది. అయితే, హిందీతో పాటు తెలుగు సహా మరో నాలుగు భాషల్లోనూ ఈ సిరీస్‍ను జియో సినిమా నేడు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి తెచ్చింది.

శేఖర్ హోమ్ వెబ్ సిరీస్‍కు రోహన్ సిప్పీ, శ్రీజీత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ తెరకెక్కింది. టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని సమయంలో పూర్తిగా తెలివితేటలతో కేసులను సాల్వ్ చేయడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్‍లో కేకే మీనన్‍తో పాటు రణ్‍వీర్ షోలే, రసిక దుగ్గర్, కృతి కుల్హారీ, దివ్యేందు భట్టాచార్యా కీలకపాత్రలు పోషించారు.

ఆర్థర్ కొనాన్ డోలే క్రియేట్ చేసిన వరల్డ్ పాపులర్ షెర్లాక్ హోమ్స్‌ ఆధారంగా ఇండియన్ వెర్షన్‍గా శేఖర్ హోమ్స్ సిరీస్‍ను మేకర్స్ తెరకెక్కించారు. ఈ సిరీస్‍ను బీబీసీ స్టూడియోస్ ప్రొడక్షన్స్ నిర్మించింది. గతేడాదే షూటింగ్ మొత్తంగా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొని నేడు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తొలి సీజన్‍లో ఆరు ఎపిసోడ్లు స్ట్రీమింగ్‍కు వచ్చాయి.

శేఖర్ హోమ్ స్టోరీలైన్

1990ల కాలంలో పశ్చిమ బెంగాల్‍లోని లోన్‍పూర్‌లో శేఖర్ హోమ్ సిరీస్ సాగుతుంది. మిస్టరీగా ఉన్న కేసులను డిటెక్టివ్ శేఖర్ (కేకే మీనన్) దర్యాప్తు చేస్తుంటారు. జయ్‍వ్రత్ సాహ్ని (రణ్‍వీర్ షోరే)తో కలిసి మిస్టరీలను శేఖర్ సాల్వ్ చేస్తుంటారు. ఇన్వెస్టిగేషన్‍తో పాటు కామెడీ, సస్పెన్స్ కూడా ఈ సిరీస్‍లో ఉంటుంది. కేకే మీనన్, రణ్‍వీర్ షేరే యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు.

తిక్‍డమ్ నేరుగా జియోసినిమాలోకే..

తిక్‍డమ్ అనే ఫ్యామిలీ డ్రామా సినిమా నేరుగా ఆగస్టు 23వ తేదీన జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమాలో అమిత్ సియాల్‍, దివ్యాంశ్ ద్వివేది, భాను, ఆరోషి సౌద్, అర్షిత్ జైన్, నాయన్ భట్, అజిత్ సర్వోత్తమ్ ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ అర్చాలియా దర్శకత్వం వహించారు. ఓ మారుమాల గ్రామం నుంచి ఉపాధి కోసం నగరానికి వెళ్లి కష్టాల్లో పడే వ్యక్తి చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. నగరానికి వద్దని పిల్లలు చెప్పినా అతడు వారితో కలిసి వెళతాడు. ఇటీవలే వచ్చిన తిక్‍డమ్ టీజర్ ఆకట్టుకుంది. ఈ కామెడీ ఎమోషనల్ డ్రామా మూవీని ఆగస్టు 23 నుంచి జియోసినిమాలో చూడొచ్చు.