Mystery Thriller Web Series: ఓటీటీలోకి వస్తున్న మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్..
Mystery Thriller Web Series: ఓటీటీలోకి ఇప్పుడో డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. శేఖర్ హోమ్ పేరుతో వస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ ను గురువారం (ఆగస్ట్ 1) మేకర్స్ రిలీజ్ చేశారు.
Mystery Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్‌కు కాస్త మిస్టరీని జోడించి ఇద్దరు డిటెక్టివ్ లను రంగంలోకి దింపితే.. అలాంటి వెబ్ సిరీస్ లు ఇచ్చే మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు జియో సినిమా సరిగ్గా అలాంటి సిరీస్ నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు శేఖర్ హోమ్. విలక్షణ నటుడు కే కే మేనన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సిరీస్ ట్రైలర్ గురువారం (ఆగస్ట్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ ట్రైలర్
శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ ను ఈ మధ్యే జియో సినిమా ఓటీటీ అనౌన్స్ చేసింది. ఆగస్ట్ 14 నుంచి ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు అప్పుడే వెల్లడించింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ డిటెక్టివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ లో కే కే మేనన్, రణ్‌వీర్ షోరే డిటెక్టివ్ లుగా నటించారు. రసికా దుగల్, కీర్తి కుల్హరిలాంటి ఓటీటీ పాపులర్ యాక్టర్స్ కూడా ఈ సిరీస్ లో నటించారు.
ఈ కొత్త సిరీస్ ఆరు ఎపిసోడ్లు ఉండనుంది. బీబీసీ స్టూడియోస్ ప్రొడక్షన్స్ ఇండియా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ను రోహన్ సిప్పీ, శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. వరుస హత్యలు, వాటిని ఎవరు చేశారన్న మిస్టరీ.. ఆ హత్యలను పరిష్కరించడానికి వచ్చే డిటెక్టివ్ లు.. ఇలా శేఖర్ హోమ్ సిరీస్ ట్రైలర్ సాగింది.
శేఖర్ హోమ్ సిరీస్ ఏంటంటే?
1990ల నేపథ్యంలో సాగే ఈ శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ లో టైటిల్ పాత్రను కే కే మేనన్ పోషించగా.. అతని పార్ట్‌నర్ జైవ్రత్ సాహ్నీగా రణ్‌వీర్ షోరే కనిపించాడు. బ్లాక్ మెయిల్ నుంచి హత్యల వరకు ఈ ఇద్దరూ కలిసి ఎలా పరిష్కరించారన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. సస్పెన్స్ తోపాటు కాస్త హ్యూమర్ టచ్ కూడా జోడించి ఈ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
సర్ ఆర్థర్ కానన్ రాసిన షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ స్టోరీల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు. 1990ల నేపథ్యంలో సాగే ఈ కథ వెస్ట్ బెంగాల్లోని లోన్పూర్ అనే టౌన్ లో జరిగినట్లుగా ఈ సిరీస్ లో చిత్రీకరించారు. అక్కడ ఉండే శేఖర్ మరో వ్యక్తి జైవ్రత్ సాహ్నితో కలిసి తూర్పు భారతంలోని మిస్టరీలను పరిష్కరిస్తుంటారని జియో సినిమా ఈ సిరీస్ కథ గురించి వెల్లడించింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు డిటెక్టివ్ పాత్రను జోడించి వస్తున్న ఈ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది.