Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-netflix new web series the royals ott introduced the cast of the rich web series with a teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Hari Prasad S HT Telugu
Aug 14, 2024 01:27 PM IST

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ లో నటిస్తున్న స్టార్లను పరిచయం చేస్తూ సదరు ఓటీటీ బుధవారం (ఆగస్ట్ 14) ఓ టీజర్ రిలీజ్ చేసింది. స్ట్రీమింగ్ వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తున్న మరో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లకు పెట్టింది పేరు. ఇంగ్లిష్ లో అయినా హిందీలో అయినా ఇప్పటి వరకూ అలాంటివి ఎన్నో. ఈ మధ్యే ఈ ఓటీటీలో వచ్చిన హీరామండి.. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా నిలిచింది. ఇప్పుడలాందిటే మరో భారీ బడ్జెట్ సిరీస్ ను తీసుకురాబోతోంది. ఈ సిరీస్ పేరు ది రాయల్స్.

నెట్‌ఫ్లిక్స్ కొత్త వెబ్ సిరీస్

ఇండియాలోనే కాదు ప్రపంచంలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటి నెట్‌ఫ్లిక్స్. ఈ ఓటీటీలో ఇప్పుడు ఎంతో మంది బాలీవుడ్ నటీనటులు నటిస్తున్న వెబ్ సిరీస్ ది రాయల్స్ రాబోతోంది. బుధవారం (ఆగస్ట్ 14) ఈ సిరీస్ నటీనటులను పరిచయం చేస్తూ సదరు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఓ టీజర్ రిలీజ్ చేసింది. ఇది అచ్చూ ఇంగ్లిష్ లో వచ్చిన ది బ్రిడ్జర్టన్ సిరీస్ లాగే ఉందంటూ అప్పుడే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటీనటులు భూమి పడ్నేకర్, ఇషాన్ ఖట్టర్, జీనత్ అమన్, నోరా ఫతేహి, చుంకీ పాండే, సాక్షి తన్వర్, డీనో మోరియా, మిలింద్ సోమన్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ రీగల్ రొమాన్స్ డ్రామా ఎంత రిచ్ గా ఉండబోతోందో ఈ పాత్రల పరిచయం, టీజర్ ద్వారానే నెట్‌ఫ్లిక్స్ చెప్పేసింది. ప్రియాంకా ఘోష్, నుపురు ఆస్థానా ఈ 8 ఎపిసోడ్ల రొమాంటిక్ కామెడీ సిరీస్ ను డైరెక్ట్ చేశారు.

ది రాయల్స్.. అచ్చూ అలాగే..

ఇషాన్ ఖట్టర్, భూమి ఫడ్నేకర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సిరీస్ రాజవంశీకుల గ్లామర్, రొమాన్స్ ను తెరపై ఆవిష్కరించనుంది. అయితే ఈ టీజర్ రిలీజ్ కాగానే ఫ్యాన్స్ ఈ సిరీస్ ను ఇంగ్లిష్ లో వచ్చిన ది బ్రిడ్జర్టన్ సిరీస్ తో పోలుస్తున్నారు. దేశీ బ్రిడ్జర్టన్ ను చేస్తున్నారా అని ఓ అభిమాని కామెంట్ చేశారు. ఈ రెండు సిరీస్ లలో చాలా పోలికలు ఉన్నాయంటూ మరికొందరు కూడా కామెంట్స్ చేయడం విశేషం.

ముఖ్యంగా మ్యూజిక్, కాస్ట్యూమ్స్ అయితే అచ్చూ అలాగే ఉన్నట్లు చెబుతున్నారు. ఆ సిరీస్ లాగే ఇది కూడా రొమాంటిక్ పీరియడ్ డ్రామాస్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్న ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇక భూమి, ఇషాన్ మధ్య కెమెస్ట్రీ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ వివరాలను మాత్రం నెట్‌ఫ్లిక్స్ ఇంకా వెల్లడించలేదు.