OTT Horror Movie: ఓటీటీలోకి వచ్చేసిన వణికించే హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?-ott horror movie hollywood horror movie a quiet place day one out on amazon prime video ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror Movie: ఓటీటీలోకి వచ్చేసిన వణికించే హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

OTT Horror Movie: ఓటీటీలోకి వచ్చేసిన వణికించే హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Aug 14, 2024 10:13 AM IST

OTT Horror Movie: ఓటీటీలోకి వణికించే హారర్ మూవీ వచ్చేసింది. ఈ ఏడాది జూన్ లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే అందులోనూ ఓ ట్విస్ట్ ఉంది.

ఓటీటీలోకి వచ్చేసిన వణికించే హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన వణికించే హాలీవుడ్ హారర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

OTT Horror Movie: ఓటీటీలోకి మరో భయపెట్టే హాలీవుడ్ హారర్ మూవీ వచ్చింది. కొన్నేళ్ల కిందట మొదలైన ఎ క్వైట్ ప్లేస్ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన మూడో మూవీ ఎ క్వైట్ ప్లేస్: డే వన్ మూవీ బుధవారం (ఆగస్ట్ 14) నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా ఫ్రాంఛైజీ నుంచి గతంలో వచ్చిన రెండు సినిమాలు మంచి థ్రిల్ పంచాయి.

ఎ క్వైట్ ప్లేస్: డే వన్ ఓటీటీ

ఎ క్వైట్ ప్లేస్: డే వన్ మూవీ ఈ ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి వచ్చినా.. ఫ్రీగా చూసే అవకాశం మాత్రం లేదు. ఈ హారర్ మూవీ చూడాలంటే రూ.389 చెల్లించాల్సిందే. మైఖేల్ సర్నోస్కీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎ క్వైట్ ప్లేస్ సినిమాకు ప్రీక్వెల్. లుపితా న్యోంగో ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేసింది.

న్యూయార్క్ సిటీపై ఎంతో వినికిడి శక్తి ఉండి, చూపులేని కొన్ని ఏలియన్స్ దాడి చేయడం అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. కాస్త శబ్దం వినిపించినా మనుషులపై దాడి చేసి చంపేసే వింత జీవులను చూపించిన ఎ క్వైట్ ప్లేస్ సినిమా చూశారా? ఆ మూవీకి ప్రీక్వెల్ ఈ ఎ క్వైట్ ప్లేస్: డే వన్. టైటిల్ చూస్తేనే అసలు కథేంటో మీకు అర్థమై ఉంటుంది.

శబ్దాన్ని ఛేదించే వింత జీవుల కథ

మొదటి సినిమాలో చూపించిన ఆ వింత జీవులు అసలు ఎలా, ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఈ తాజా ప్రీక్వెల్లో చూడొచ్చు. న్యూయార్క్ సిటీకి బతుకు తెరువు కోసం వచ్చే సమైరా (లుపిత న్యోంగో) జీవితం ఈ శబ్దాన్ని ఛేదించే వింత జీవుల బారిన పడి ఎంత భయానకంగా మారిందన్నది ఈ హారర్ మూవీలో చూపించారు. భూమిపై బతికి బట్టకట్టాలంటే అసలు శబ్దం చేయకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది.

పారామౌంట్ పిక్చర్స్ ఎ క్వైట్ ప్లేస్: డే వన్ మూవీని జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. అంతకుముందు జూన్ 26న తొలిసారి ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. దీనికి పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.26 కోట్ల డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడీ హారర్ మూవీ ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఫ్రీగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్నది ఇంకా తెలియాల్సి ఉంది.