Secret Invasion Review: భూమిపై రూపాలు మార్చే ఏలియన్ల దాడి.. 'సీక్రెట్ ఇన్వేషన్' రివ్యూ
Secret Invasion Web Series Review: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన మరో కొత్త వెబ్ సిరీస్ 'సీక్రెట్ ఇన్వేషన్' (Secret Invasion OTT Series). ఈ సిరీస్ మార్వెల్ అభిమానులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
టైటిల్: సీక్రెట్ ఇన్వేషన్
నటీనటులు: శామ్యూల్ ఎల్ జాక్సన్, ఎమిలియా క్లార్క్, కింగ్‍స్లీ బెన్ ఆదిర్, బెన్ మెండెల్సన్, డాన్ చెడ్లీ, ఒలివియా కోల్మన్, కోబీ స్మాల్డర్స్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రెమీ అడెఫరాసిన్
దర్శకత్వం: అలీ సెలీమ్
సంగీతం: క్రిస్ బోవర్స్
విడుదల తేది: జూన్ 21 నుంచి జూలై 26 2023 వరకు
ఎపిసోడ్స్: 6
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‍స్టార్
Secret Invasion Web Series Review Telugu: ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మార్వెల్ సంస్థ (Marvel Cinematic Universe). దీని నుంచి వచ్చే ప్రతి మూవీ, సిరీస్‍పై అంచనాలు భారీగానే ఉంటాయి. మొన్నటివరకు సూపర్ హీరోలతో సినిమాలు, సిరీసులుగా రాగా ఈ మధ్య సపోర్టింగ్ క్యారెక్టర్స్ ను ప్రధాన పాత్రలుగా తీర్చిదిద్దుతూ తెరకెక్కిస్తున్నారు. అలా మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన వెబ్ సిరీసే సీక్రెట్ ఇన్వేషన్ (Secret Invasion Review). మరి మార్వెల్ సీక్రెట్ ఇన్వాసియన్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
థానోస్ బ్లిప్ నుంచి వచ్చిన తర్వాత సేబర్‍కు వెళ్లిపోతాడు నిక్ ఫ్యూరి (శామ్యూల్ ఎల్ జాక్సన్). రెండేళ్లపాటు నిక్ ఫ్యూరి సేబర్‍లోనే ఉండిపోతాడు. నిక్ ఫ్యూరి ఏమైపోయాడో తెలియని స్క్రల్స్ (ఏలియన్ జాతి) తాము నివసించేందుకు గ్రహం చూపిస్తానని చెప్పి, ఉపయోగించుకుని మోసం చేశాడని భావిస్తారు. ప్రతికారంగా మననుషులందరినీ చంపేసి భూమినే తమ నివాసంగా మార్చుకునేందుకు గ్రావిక్ (కింగ్‍స్లీ బెన్ ఆదిర్) కొంతమంది రెబల్ స్క్రల్స్ తో రహస్యంగా దాడులు చేయిస్తుంటాడు.
ట్విస్టులు
స్క్రల్స్ రెబల్స్ లో నిక్ ఫ్యూరి క్లోజ్ ఫ్రెండ్, స్క్రల్స్ మాజీ జెనరల్ టేలోస్ (బెన్ మెండెల్సన్) కూతురు గాయా (ఎమిలియా క్లార్క్) కూడా ఉంటుంది. సమస్య తెలుసుకుని సేబర్ నుంచి వచ్చిన నిక్ ఫ్యూరి స్క్రల్స్ రహస్య దండయాత్రను అడ్డుకోలిగాడా? తన పోరాటంలో నిక్ ఫ్యూరి ఎవరిని కోల్పోయాడు? అసలు గ్రావిక్ ఎవరు? అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపిన గ్రావిక్ నిక్ ఫ్యూరిని మాత్రం ఎందుకు వదిలేసేవాడు? రెబల్ అయిన గాయాకు జరిగిన నష్టం ఏంటీ? ఆమె చివరికి ఏం చేసింది? స్క్రల్స్ భూమిని ఆక్రమించుకున్నారా? లేదా వారు నివాసం ఉండే మరో గ్రహం ఏదైనా దొరికిందా? వంటి ఆసక్తికర విశేషాలు తెలియాలంటే సీక్రెట్ ఇన్వేషన్ మినీ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇప్పటివరకు నిక్ ఫ్యూరిని అవేంజర్స్ ను కనిపెట్టే సపోర్టింగ్ రోల్‍లో చూశాం. ఈ మధ్య పాపులర్ పాత్రలతో సెపరేట్‍గా సినిమాలు, వెబ్ సిరీసులు తెరకెక్కిస్తుంది మార్వేల్. అందులో భాగంగానే నిక్ ఫ్యూరి మెయిన్ లీడ్ రోల్‍లో సీక్రెట్ ఇన్వేషన్ ను తీసుకొచ్చింది. ఇందులో మనకు ఒక్క అవేంజర్ కూడా కనిపించడు. అవేంజర్స్ ను పిలుద్దాం అని టాపిక్ వచ్చిన ప్రతిసారి స్ర్కల్స్ తో యుద్ధం నా పర్సనల్. నేను వాళ్లను ఓడించలేనప్పుడు చనిపోవడమే బెటర్ అని నిక్ ఫ్యూరితో డైలాగ్ చెప్పించి సూపర్ హీరోలను తీసుకురానిదానికి కారణం చూపించారు.
రూపాలు మార్చుకుంటూ
భూమి మీద స్క్రల్స్ ఎందుకు దాడి చేయాలనుకున్నారు, వారికి నిక్ ఫ్యూరి చేసిన ప్రామిస్, యూఎస్, రష్యా గవర్న్ మెంట్‍లో రూపాలు మార్చుకుని స్క్రల్స్ ఉండటం, స్క్రల్ అయినా టేలోస్ నిక్ ఫ్యూరికి హెల్ప్ చేసే విధానం, గ్రావిక్ దాడులు, అందులో నిక్ విఫలం కావడం వంటి అనేక విషయాలను ఇంట్రెస్టింగ్‍గా తెరకెక్కించారు. కానీ, కొద్దిపాటు బోరింగ్ సన్నివేశాలు ఉంటాయి. వాటిని భరిస్తే అసలు కథ ఏంటనేది తెలుస్తుంది. ఇక సిరీసులో కొన్ని ట్విస్ట్ లు చాలా బాగుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ వావ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మార్వెల్ అభిమానులకు చాలా నచ్చుతుంది.
అదిరిపోయే ట్రీట్
యాక్షన్ సీన్స్, బీజీఎమ్‍తోపాటు ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. శామ్యూల్, ఎమిలియా, కింగ్‍స్లీ బెన్, మెండెల్సన్, డాన్ చెడ్లీ, ఒలివియా పాత్రలు ఆకట్టుకుంటాయి. విలన్ గ్రావిక్ పాత్రలో కింగ్‍స్లీ ఆకట్టుకున్నాడు. అయితే, కోబీ స్మాల్డర్స్ పాత్రను ముగించడం కొద్దిగా నిరాశపరుస్తుంది. క్లైమాక్స్ లో సరికొత్త లేడి హీరో రావడం అదిరిపోయే ట్రీట్ అని చెప్పవచ్చు. దాంతో తర్వాతి సీజన్స్, కొత్త సూపర్ వుమెన్ సినిమాలకు హింట్ ఇచ్చినట్లుగా ఉంది. ఫైనల్‍గా చెప్పాలంటే మార్వెల్ అభిమానులకు సీక్రెట్ ఇన్వేషన్ (Secret Invasion Telugu Review) ఓ డీసెంట్ వాచ్.
రేటింగ్: 2.75/5