Today OTT Releases: ఓటీటీల్లో ఇవాళ, రేపు సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాతర.. మొత్తం ఎన్ని రిలీజ్ కాబోతున్నాయంటే?-today ott releases new movies web series releasing on aha video etv win jio cinema zee5 otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Today Ott Releases: ఓటీటీల్లో ఇవాళ, రేపు సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాతర.. మొత్తం ఎన్ని రిలీజ్ కాబోతున్నాయంటే?

Today OTT Releases: ఓటీటీల్లో ఇవాళ, రేపు సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాతర.. మొత్తం ఎన్ని రిలీజ్ కాబోతున్నాయంటే?

Hari Prasad S HT Telugu
Aug 14, 2024 07:46 AM IST

Today OTT Releases: ఓటీటీల్లోకి బుధవారం (ఆగస్ట్ 14), గురువారం (ఆగస్ట్ 15) ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అడుగుపెట్టనున్నాయి. కామెడీ నుంచి హారర్ వరకు ఎన్నో జానర్ల మూవీస్ ఇందులో ఉన్నాయి.

ఓటీటీల్లో ఇవాళ, రేపు సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాతర.. మొత్తం ఎన్ని రిలీజ్ కాబోతున్నాయంటే?
ఓటీటీల్లో ఇవాళ, రేపు సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాతర.. మొత్తం ఎన్ని రిలీజ్ కాబోతున్నాయంటే?

Today OTT Releases: ఓటీటీల్లో రెండు రోజుల్లోనే సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాతర ఉండనుంది. ఈసారి లాంగ్ వీకెండ్ రాబోతోంది. దీంతో అందుకు తగినట్లే ఆహా వీడియో, ఈటీవీ విన్, జీ5, జియో సినిమాలాంటి ఓటీటీలు పలు ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. సాధారణంగా ప్రతి శుక్రవారం వీటి హడావిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం బుధ, గురువారాల్లోనే రానున్నాయి. ఇప్పటికే ఈ వారం మూడు కొత్త సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి వచ్చేశాయి.

ఈరోజు ఓటీటీ రిలీజెస్

నిజానికి మంగళవారం (ఆగస్ట్ 13) నుంచే ఓటీటీల్లోకి కొత్త సినిమాలు రావడం మొదలైంది. ఇప్పటికే డార్లింగ్ (హాట్‌స్టార్) మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక బుధవారం (ఆగస్ట్ 14) ఓ ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ, ఓ వెబ్ సిరీస్ వచ్చాయి. ఇవి ఈటీవీ విన్, జియో సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

వీరాంజనేయులు విహారయాత్ర - ఈటీవీ విన్

ఈటీవీ విన్ ఓటీటీలో ఓ కామెడీ మూవీ నేరుగా వచ్చేసింది. ఈ సినిమా పేరు వీరాంజనేయులు విహారయాత్ర. సీనియర్ నటుడు నరేష్ నటించిన, బ్రహ్మానందం వాయిస్ అందించిన ఈ సినిమా ట్రైలర్ తోనే ఆసక్తి రేపింది. బుధవారం (ఆగస్ట్ 14) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

శేఖర్ హోమ్ వెబ్ సిరీస్ - జియో సినిమా

జియో సినిమా ఓటీటీలో శేఖర్ హోమ్ అనే వెబ్ సిరీస్ ఈరోజే అడుగుపెట్టింది. కే కే మేనన్, రణ్‌వీర్ షోరే, రసికా దుగల్ నటించిన ఈ సిరీస్ ఓ డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్. షెర్లాక్ హోమ్స్ నవల ఆధారంగా రూపొందిన సిరీస్ ఇది.

రేపు ఓటీటీల్లోకి వచ్చేవి ఇవే..

ఇక గురువారం (ఆగస్ట్ 15) ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. ముఖ్యంగా ఆహా, జీ5 ఓటీటీల్లోకి ఇవి వస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

ఓఎంజీ - ఆహా వీడియో

వెన్నెల కిశోర్ హారర్ కామెడీ మూవీ ఓఎంజీ ఓ మంచి ఘోస్ట్ మూవీ గురువారం (ఆగస్ట్ 15) ఆహా వీడియోలోకి రాబోతోంది. ఈ జానర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు బాగా ఎంజాయ్ చేసే మూవీ ఇది.

ఇవోల్ - ఆహా వీడియో

ఆహా వీడియో ఓటీటీలోకే మరో బోల్డ్ తెలుగు మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు ఇవోల్. గురువారం (ఆగస్ట్ 1) నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి అమ్మాయి రిలేషన్‍లో ఉండడం, డ్రగ్స్, క్రైమ్ అంశాలతో రూపొందిన సినిమా ఇది.

మనోరతంగల్ - జీ5 ఓటీటీ

ఇక జీ5 ఓటీటీలో ఇండియాలోనే అతిపెద్ద స్టార్ హీరోల వెబ్ సిరీస్ మనోరతంగల్ గురువారం (ఆగస్ట్ 15) నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్ తోపాటు తమిళ స్టార్ కమల్ హాసన్ నటించిన ఈ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది.